ఈ ప్రభావవంతమైన చిట్కాల ద్వారా సూర్యుడి వల్ల చర్మం పై ఏర్పడే మచ్చలను తగ్గించుకోవచ్చు

సూర్యుడి నుండి వెలువడే అతి ప్రమాదకరమైన అతిలోహ కిరణాలు చర్మం పై మచ్చలు ఏర్పడేలా చేస్తాయి. వీటినే సూర్యుని మచ్చలు అని కూడా అంటుంటారు. సహజ సిద్ధంగా అవి ఎటువంటి హాని మనకు తలపెట్టలేకపోయినా కూడా, మేకప్ వేసినా కూడా వాటిని దాచడం చాలా కష్టతరం అవుతుంది. ఒకసారి మీరే ఊహించుకోండి. దీనివల్ల మీకు చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు.

అంతేకాకుండా మీ చర్మం యొక్క నిగారింపు అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఇలాంటి సమస్యతో మీరు కూడా బాధపడుతూ, మీ చర్మం పై కూడా ఒక ఆకర్షణీయమైన నిగారింపు అక్కడక్కడా లేదని భావిస్తున్నారా? అందుకు సంబంధించిన సమాధానం మా దగ్గర ఉంది. ఈరోజు మనం బోల్డ్ స్కై ద్వారా సహజ సిద్దమైన చిట్కాలను ఉపయోగించి ఎలా సూర్యుడి వల్ల కలిగిన సూర్య మచ్చల యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చో తెలుసుకోబోతున్నాం.
మనం ఇప్పుడు తీసుకోబోయే పదార్ధాల్లో చర్మాన్ని బ్లీచింగ్ చేసే లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర సమ్మేళనాలు అధికంగా ఉండబోతున్నాయి. ఇవన్నీ చర్మ సంబంధిత సమస్యలపై అద్భుతాలను సృష్టిస్తాయి.

 ఇవి చాలా సులువుగా దొరుకుతాయి మరియు టి.వి ప్రకటనలో చూసే మచ్చలు తగ్గించే క్రీములు కంటే కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల, కొన్ని వారాల వ్యవధిలోనే సూర్యుడి వల్ల కలిగే మచ్చలు కనుమరుగు అవుతాయి. కాబట్టి వాటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ వ్యాసాన్ని చదవండి.

1. ఆపిల్ సీడర్ వెనిగర్ :

 ఆపిల్ సీడర్ వెనిగర్ లో ఆల్ఫా హైడ్రోక్సీ ఆమ్లాలు అత్యధికంగా ఉంటాయి. దీనిని ఉపయోగించడం వల్ల అందవిహీనంగా మన చర్మాన్ని చేసే సూర్యుడి మచ్చలు కనుమరుగు అవుతాయి మరియు మీ యొక్క చర్మం కూడా ఎంతో బాగా మెరిసిపోతుంది.

 దీనిని ఎలా వాడాలంటే :

ఆపిల్ సీడర్ వెనిగర్ ని కొద్దిగా నీటిలో విలీనం చేయండి. ఆ తర్వాత దూది ఉండలను తీసుకొని అందులో నానబెట్టండి.

ఆ తర్వాత మీ చర్మం పై ఎక్కడెక్కడ అయితే సూర్యుని మచ్చలు ఉన్నాయో ఆ ప్రాంతంలో రాయండి.

 ఇలా చేసిన తర్వాత 5 నుండి 10 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ పై చల్లని నీటితో ముఖాన్ని కడగండి.

ఇలా వారానికి కనీసం రెండు మూడు సార్లు చేయడం వల్ల ప్రభావవంతమైన ఫలితాలు లభిస్తాయి.

2. అలోవిరా జెల్ :

 చర్మాన్ని ప్రకాశవంతం చేసే లక్షణాలు అలోవిరా జెల్ లో అత్యధికంగా ఉన్నాయి. సూర్యుని మచ్చల వల్ల కలిగే తీవ్రతను తగ్గించి వాటిని కనుమరుగుచేయడంలో ఇది ఒక అద్భుతమైన చిట్కాగా పనిచేస్తుంది.

 దీనిని ఎలా వాడాలంటే :

అలోవిరా మొక్క నుండి జెల్ ని మొత్తం బయటకు తీయండి.

ఇలా చేయడం వల్ల అది ఎంతో తాజాగా ఉంటుంది.

ఆ తర్వాత చర్మంపై ఎక్కడైతే సూర్యుని మచ్చలు ఉన్నాయో ఆ ప్రాంతంలో మర్దన చేయండి.

 ఆ పై అరగంట పాటు అలానే ఉంచి చల్లటి నీటితో శుభ్రంగా కడగండి.

ఇలా రోజుకి రెండుసార్లు చేయడం ద్వారా సూర్యుడి మచ్చలు దూరం చేయవచ్చు.

3. గుర్రపు ముల్లంగి :

 చర్మపు రంగు మారటాన్ని పూర్తిగా నిషేధించే లక్షణాలు ఈ గుర్రపుముల్లంగి లో అద్భుతంగా ఉంటాయి. ఈ అద్భుతమైన చిట్కాను కొన్ని వారల పాటు వాడటం వల్ల, మీ చర్మ పై ఉన్న సూర్య మచ్చలు కనుమరుగు అవుతాయి.

 దీనిని ఎలా వాడాలంటే :

ఒక టీ స్పూన్ తురిమిన గుర్రపు ముల్లంగిలో, రెండు టీ స్పూన్ ల రోజ్ వాటర్ ని కలపండి.

ఈ ముద్దను మీ చర్మంపై ఎక్కడెక్కడ అయితే అవసరం ఉందో ఆయా ప్రాంతాల్లో మృదువుగా రాయండి.

 15 నిమిషాల పాటు అలానే మీ చర్మం పై ఆ మిశ్రమాన్ని ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి.

వేగవంతమైన ఫలితాలు రావడానికి ఈ చిట్కాను నెలకు కనీసం మూడు నాలుగు సార్లు వాడండి.

4. గ్రీన్ టీ : 

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి. దీనిని వాడటం వల్ల మొండిగా వ్యవహరించే సూర్య మచ్చలు కూడా కనుమరుగు అవుతాయి.

దీనిని ఎలా వాడాలంటే :

తీపి వేయని గ్రీన్ టీ లో దూది ఉండని నానబెట్టండి.

 మీ చర్మపైనా ఏ ప్రాంతంలో అయితే సమస్య ఉందో ఆ ప్రాంతంలో దానిని ఉపయోగించి రాయండి.

ఓ అరగంట పాటు అలానే వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడగండి.

ఈ చిట్కాను, ఇలా వారానికి 4 నుండి 5 సార్లు ఉపయోగించడం వల్ల మొండి సూర్య మచ్చలను కూడా కనుమరుగు చేయవచ్చు.

5. ముల్తానీ మిట్టి :

 ముల్తానీ మిట్టి లో ఎన్నో విభిన్న రకాల చర్మానికి లాభం చేకూర్చే కారకాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల ఇది సూర్య మచ్చల యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.

దీనిని ఎలా వాడాలంటే :

అర టీ స్పూన్ ముల్తానీ మిట్టి లో, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఒక మిశ్రమంలా తయారుచేయండి.

మీ చర్మం పై ఎక్కడెక్కడ అయితే సూర్యమచ్చలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని వాడండి.

 10 నుండి 15 నిమిషాల పాటు అది ఎండిపోయే వరకు అలానే ఉంచండి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి.

 ఈ ఇంటి చిట్కాను వారానికి 3 నుండి 4 సార్లు ఉపయోగించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి.

6. దోస కాయ : 

సూర్యుడి మచ్చలను ప్రభావవంతంగా తగ్గించడంలో దోసకాయ కూడా అద్భుతమైన చిట్కాగా పనిచేస్తుంది మరియు మీ చర్మానికి సమానమైన వన్నెను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.

దీనిని ఎలా వాడాలంటే :

దోసకాయను సన్నగా తరిగి, దానిని బాగా చితకొట్టండి.

 మీ చర్మం పై ఎక్కడెక్కడ అయితే సమస్య ఉందో ఆ ప్రాంతంలో ఈ ముద్దను రాయండి.

20 నిమిషాల పాటు అలానే ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటిని ఉపయోగించి మీ చర్మాన్ని శుభ్రం చేయండి.

రోజుకు ఒకసారి ఈ చిట్కాను వాడటం ద్వారా మీకు ఫలితాలు ఎంతో వేగంగా లభిస్తాయి.

7. మజ్జిగ : 

మజ్జిగ లో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆ మచ్చల యొక్క తీవ్రతను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

దీనిని ఎలా వాడాలంటే :

తాజా మజ్జిగను మీ చర్మానికి బాగా రాయండి.

ఇలా చేసిన తర్వాత 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి.

 ఆ పై గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రం చేసుకోండి.

ఈ చిట్కాను ప్రతిరోజూ వాడటం ద్వారా సూర్యుడి మచ్చలను సమర్ధవంతంగా తగ్గించవచ్చు.

8. నిమ్మ రసం :

 నిమ్మ రసంలో చర్మానికి సంబంధించిన బ్లీచింగ్ కారకాలు అధికంగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి కూడా సూర్యుని మచ్చలను ప్రభావవంతంగా తగ్గించడంలో నిమ్మరసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.

దీనిని ఎలా వాడాలంటే :

ఒక తాజా నిమ్మకాయ నుండి రసాన్ని బాగా బయటకు తియ్యండి.

 ఆ రసంలో దూది ఉండను బాగా నానబెట్టండి.

మీ చర్మంపై ఎక్కడైతే సమస్య ఉందో ఆ ప్రాంతంలో రాయండి.

 పది నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని కడగండి.


Comments