చర్మం తెల్లబడాలంటే.. సెనగపిండి ప్యాక్ వేసుకోండి!

అలా బయటికి వెళ్లొస్తే చాలు.. శరీరంపై దుమ్ముధూళీ పేరుకుంటుంది. చర్మం నల్లబడుతుంది. ఇలా ఏర్పడ్డ టాన్‌ని సులువుగా ఇంట్లోనే వదిలించుకోవచ్చు. కొంచెం ఉప్పుని నిమ్మరసంలో కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి.

లుఫాతో బాగా రుద్దితే ఆ ప్రభావం తగ్గుతుంది. అలాగే సెనగపిండిని ప్రతి రెండు రోజులకు ఒకసారి శరీరం మొత్తానికి పట్టించి రుద్దుతూ ఉంటే చర్మం తాజాగా మారుతుంది.

చర్మం తెల్లబడాలంటే.. రెండు చెంచాల సెనగపిండికి కొంచెం పసుపూ, చెంచా పాలూ, కాసిని రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే టాన్ చాలామటుకు తగ్గుతుంది. అలాగే సెనగపిండి, నిమ్మరసం, పెరుగూ కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

Comments