కాళ్లపై ముడతలని తగ్గించుకోవడమెలా?

ముడతలతో పాటు ఫైన్ లైన్స్ అనేవి ఏజింగ్ లక్షణాల కిందకి వస్తాయి. వయసుపైబడుతున్న కొద్దీ చర్మంలో కొలాజిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. చర్మంలోని ఎలాస్టిసిటీని పెంపొందించే కొలాజిన్ తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవడం వలన ఏజింగ్ లక్షణాలు చర్మంపై దర్శనమిస్తాయి.

 అందువలన, చర్మం వదులుగా మారి ముడతలు ఏర్పడతాయి. ముఖ్యంగా, ముఖంపై అలాగే మెడపై ముడతలు కనిపిస్తాయి. రాను రాను కాళ్లపై అలాగే చేతులపై కూడా కనిపిస్తాయి.

 అకాల వృద్ధాప్యం వలన కూడా కాళ్లపై ముడతలు ఏర్పడతాయి. ఇది చూడడానికి కాస్తంత అందవికారంగా కనిపిస్తుంది. కాబట్టి, కాళ్ళపైన ముడతలని సహజంగానే తొలగించుకోవడం మంచిది.

సులభమైన హోమ్ రెమెడీస్ ను పాటించి ముడతలకు గుడ్ బై చెప్పవచ్చు. ఏదైనా బ్యూటీ టెక్నీక్ ని పాటించేముందు సాధారణంగానే కాళ్ళని అలాగే చేతులను ఇగ్నోర్ చేస్తాము.

అయితే, రోజంతా ఈ శరీర భాగాలే ఎక్కువగా ఒత్తిడికి గురవుతాయి. అందువలన, వీటి గురించి కూడా కేర్ తీసుకోవడం మంచిది.

పాదాలను తరచూ మాయిశ్చరైజ్ చేయడం తప్పనిసరి. డ్రై స్కిన్ కి ముడతలకు అవినాభావ సంబంధం ఉంది. చర్మం తగినంత సెబమ్ ను ఉత్పత్తి చేయకపోతే చర్మం పొడిబారుతుంది. అందువలన, మీరు వెలుపలి నుంచి చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను అందించాలి.

 అందువలన, వింటర్ సీజన్ లో మీరు ఎల్లప్పుడూ కాటన్ సాక్స్ ని ధరించి ఉండాలి. ఈ కాలంలోనే చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. ఈ పద్దతిని పాటించడం ద్వారా చర్మం పొడిబారదు.

కాళ్లపై ముడతలను సహజంగా ఎలా తొలగించుకోవాలి? ఈ పోస్ట్ ని చదివి తెలుసుకోండి.

1. ఆహారంపై శ్రద్ధ వహించండి

 ఈ సులభమైన పద్దతులను పాటిస్తూ కాళ్లపై అలాగే పాదాలపై ముడతలను తగ్గించుకుంటూనే మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేసి పండ్లను అలాగే గ్రీన్ వెజిటబుల్స్ ను మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. జ్యూసీ ఫ్రూట్స్ తో పాటు కూరగాయలు మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. తద్వారా, ముడతల సమస్య మీ దరి చేరదు.

2. తగినంత మంచినీళ్లను తీసుకోవాలి: 

పొడిబారిన చర్మం సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉంటే మంచినీళ్లను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లను తీసుకోవాలి. నీళ్లను తగినంత తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేటెడ్ గా మరి ముడతల సమస్య తగ్గుముఖం పడుతుంది. కాళ్లపై ముడతలు తగ్గుతాయి. పాదాలు అలాగే ఇతర ప్రదేశాల్లో కూడా ముడతలు తగ్గుతాయి. ఈ విధంగా పాదాలపై అలాగే కాళ్లపై ముడతలను సహజంగా తగ్గించుకోవచ్చు.

3. ఆలివ్ ఆయిల్ మసాజ్: 

ఆయిల్ ఆయిల్ దట్టంగా ఉండటం వలన మీ చర్మంపై ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలని మీరు భావించినప్పుడు మీ కాళ్ళను అలాగే పాదాలను కాస్తంత ఆలివ్ ఆయిల్ తో మర్దనా చేయండి. నిద్రపోయే ముందు ఈ పద్దతిని పాటించండి. తద్వారా ఆయిల్ అనేది చర్మం లోపలికి వెళ్లి లోపలనుంచి పొడిబారే సమస్యను నిర్మూలిస్తుంది.

4. షీ బటర్ ను అప్లై చేయండి: 

ముడతలను నిర్మూలించి చర్మానికి తిరిగి జీవం పోసేందుకు షీ బటర్ వంటి కొన్ని చర్మ సంరక్షణ పదార్థాలను చర్మంపై అప్లై చేయాలి. మీ కాళ్ళను, పాదాలను బాగా కడిగి షీ బటర్ తో సున్నితంగా మసాజ్ చేయండి. వారానికి మూడుసార్లు ఈ విధంగా చేయడం ద్వారా మృదువైన పాదాలను సొంతం చేసుకోండి.

5. విటమిన్ ఈ ప్రాముఖ్యతను గుర్తించండి: 

పాదాలపైనున్న ముడతలను సులువుగా తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే, విటమిన్ ఈ సహాయాన్ని పొందండి. సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అయితే, ఔషధంలా తీసుకునే కంటే విటమిన్ ఈ పుష్కలంగా కలిగిన స్పినాచ్, ఆల్మండ్స్, పీనట్స్ వంటి ఆహారపదార్థాలని మీ డైట్ లో భాగంగా చేస్తే బిగుతైన అలాగే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.

6. ఈ ప్యాక్ ను ప్రయత్నించండి:

 బొప్పాయి గుజ్జుని, పైనాపిల్ ని సమాన పరిమాణాలలో తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపండి. ఈ పదార్థాలని బాగా కలపండి. ఈ పేస్ట్ ని కాళ్లపై అలాగే పాదాలపై అప్లై చేయండి. దాదాపు ముప్పై నిమిషాల తరువాత ఈ పేస్ట్ ను తొలగించండి. వారానికొకసారి ఈ ప్యాక్ ను వాడటం ద్వారా ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.

7. అవొకాడో ని అప్లై చేయండి: 

కాళ్లపై, పాదాలపై ఏర్పడిన ముడతలను సహజంగా ఎలా నిర్మూలించాలన్న ఆలోచనలో మీరున్నట్లయితే మీరు అవొకాడో సహాయాన్ని పొందవచ్చు. ముడతలని, క్రాక్స్ ని తొలగించేందుకు అవొకాడో ప్యాక్ ని క్రమపద్ధతిలో అప్లై చేయండి. అవొకాడో గుజ్జుని తీసుకుని ఆలివ్ ఆయిల్ మరియు తేనే కలిపి ఒక ప్యాక్ ను ప్రిపేర్ చేయండి. ముడతలు ఏర్పడే ప్రదేశంలో ఈ ప్యాక్ ను అప్లై చేయండి.


Comments