మెరిసే చర్మం కోసం ఇంటివద్దనే తయారు చేసుకోగలిగే పెరుగు ఫేస్ మాస్కులు

చాలామంది స్త్రీలు చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మరియు విలాసవంతమైన స్పా, సెలూన్లపై ఎక్కువ డబ్బు ఖర్చుపెడుతుంటారు. ఇవన్నీ ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం నిలబెట్టుకోడానికి చేస్తుంటారు.

 కానీ చర్మం ఆరోగ్యాన్ని, మెరుపును సాధించటానికి అనేక చవకైన, సహజమైన ఇంటి పద్ధతులు కూడా ఉన్నాయి. చర్మంలో మెరుపుకి, నునుపుకి చాలా సహజ పదార్థాలున్నా, వాటన్నిట్లో ఒకటి మాత్రం చాలా ప్రభావవంతమైనది.

 మేము మాట్లాడేది మీకందరికీ తెలిసిన పదార్థం గురించే - పెరుగు. అన్ని అందాల చికిత్సల్లో ఇష్టపడే, ఈ పెరుగులో బ్యాక్టీరియా వ్యతిరేక, బ్లీచింగ్ లక్షణాలు నిర్జీవంగా ఉన్న చర్మంపై అద్భుతాలు చేస్తాయి.

 మీ చర్మాన్ని బాగుచేసుకోటానికి పెరుగును వాడటానికి చాలా పద్ధతులున్నా, ఇతర లాభదాయకమైన పదార్థాలైన నిమ్మ, ఆలివ్ నూనె వంటివాటితో కలిపి వాడటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
మీకు సింపుల్ గా తెలియచేయటం కోసం మేము పెరుగుతో అద్భుతమైన వివిధ ఫేస్ మాస్క్ ల లిస్టును అందించాం. ఇవి చర్మానికి తిరిగి జీవం పోసి, సహజమైన కాంతిని అందిస్తాయి.

 వీటిని ప్రయత్నించి మీరు ఎప్పుడూ కావాలనుకున్న ముఖాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ మాస్క్ ల గురించి ఇక్కడ మరింత చదవండి.

1. పెరుగు మరియు నిమ్మ రసం ఫేస్ మాస్క్

 - 1 చెంచా పెరుగును అర చెంచా నిమ్మ రసంతో కలపండి.

- ఈ పేస్టును కొంచెం తడిగా ఉన్న ముఖంపై రాయండి.

- 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- ఈ మాస్క్ ను వారానికి రెండుసార్లు ప్రయత్నించి మెరిసే చర్మాన్ని పొందండి.

2. పెరుగు మరియు మెంతులు

 - చేతిలో పట్టినన్ని మెంతులను నీళ్ళలో నానబెట్టండి.

- మరునాడు పొద్దున 1 చెంచా పెరుగుతో కలపండి.

- దీన్ని మీ చర్మంపై పట్టించి 10 నిమిషాలపాటు ఉంచి, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

 - వారానికోసారి ఈ ఫేస్ మాస్క్ ను ప్రయత్నించి మొహంలో డల్ నెస్ ను పోగొట్టుకోండి.

3. పెరుగు మరియు ఆలివ్ నూనె

 - 1 చెంచా పెరుగును అర చెంచా ఆలివ్ నూనెతో కలపండి.

 - మీ ముఖంపై ఈ మిశ్రమంను పల్చటి పొరగా రాయండి.

- దీన్ని 15 నిమిషాలపాటు అలానే ఉంచేసి మొహాన్ని గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

- వారానికోసారి ఈ మాస్క్ ను ప్రయత్నించి మెరిసే ముఖాన్ని మీ సొంతాన్ని చేసుకోండి.

4. పెరుగు మరియు తేనె 

- ఈ మాస్క్ ను 2 చెంచాల పెరుగు మరియు అర చెంచా ఆర్గానిక్ తేనెతో కలిపి తయారుచేయండి.

- ఈ మిశ్రమాన్ని మీ మొహం మరియు మెడకి పట్టించండి.

 - 10-15 నిమిషాలు అలానే ఉంచేసి, తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

 - ఈ మాస్క్ ను వారానికోసారి వాడి మంచి ఫలితాలు పొందండి.

5. పెరుగు మరియు ఆలోవెరా జెల్

 - ఒక బౌల్ లో 1 చెంచా పెరుగు, 1 చెంచా ఆలోవెరా జెల్ ను ఒక చెంచాతో బాగా కలపండి.

 - ఈ మిశ్రమాన్ని మీ మొహానికి పట్టించి రాత్రంతా వదిలేయండి.

- పొద్దున్నే, ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగేసి, మెరిసే చర్మానికి హలో చెప్పండి.

6. పెరుగు మరియు టమాటా 

- టమాటా గుజ్జును తీసి 1 చెంచా తాజా పెరుగుతో కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ అప్పుడే కడిగిన మొహానికి పట్టించండి.

 - దీన్ని 20 నిమిషాల పాటు అలానే వుంచేసి, గోరువెచ్చని నీటితో తర్వాత కడగండి.

 - వారానికోసారి ఈ ఫేస్ మాస్క్ ప్రయత్నించడం వలన మీ చర్మం మెరుస్తుంది.

7. పెరుగు మరియు బొప్పాయి గుజ్జు 

- 1 చెంచా బొప్పాయి గుజ్జును తీసి, 2 చెంచాల తాజా పెరుగుతో కలపండి.

- మీ మొహంపై ఈ మిశ్రమం పల్చటిపొరలాగా రాయండి. రాత్రంతా అలా వదిలేయండి.

 - పొద్దున, గోరువెచ్చని నీటితో మొహాన్ని కడిగేయండి.

 - వారానికోసారి ఈ పద్ధతిని పాటించి మెరిసే చర్మాన్ని పొందండి.

8. పెరుగు మరియు పాల పొడి 

- అర చెంచా పాల పొడిని 1 చెంచా పెరుగుతో కలపండి.

 - మొహం మరియు మెడపై సమానంగా ఈ పదార్థాన్ని పూయండి.

 - 5-10 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- ఈ ఇంటి ఫేస్ మాస్క్ ను వారానికి 2 సార్లు ప్రయత్నించి మంచి ఫలితాలు పొందండి.

9. పెరుగు మరియు బియ్యం పిండి

 - సింపుల్ గా అర చెంచా బియ్యంపిండిని 1 చెంచా పెరుగుతో కలపండి.

 - మీ ముఖానికి ఈ మిశ్రమాన్ని పట్టించండి. - 10-15 నిమిషాలపాటు ఎండనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- వారానికోసారి ఈ చిట్కా పాటిస్తూ డల్ గా ఉన్న మీ మొహంపై చర్మాన్ని బాగుచేసే మంచి ఫలితాలు పొందండి.











Comments