మచ్చల్లేని చర్మం కోసం అద్భుత రహస్యమైన నూనె

సెసమం ఇండికం మొక్క నుంచి వచ్చిన విత్తనాలు, దానిలోంచి తీసిన నువ్వులనూనెను అన్ని రకాల చర్మ సమస్యలకు చాలా ప్రభావవంతమైన సహజ పదార్థంగా వాడతారు. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఈ నూనె చర్మసంరక్షణలో పైన వాడే మందుగా పనిచేస్తుంది.

కానీ, మంచి ఫలితాలు పొందటానికి, నూనెను సరైన విధానంలో వాడాల్సి ఉంటుంది. అందుకే, ఈ రోజు బోల్డ్ స్కైలో మీకు ఈ నూనెను మచ్చల్లేని మరియు అందమైన చర్మం కోసం ఎలా వాడాలో వివరిస్తాం.

నువ్వులనూనెను ఈ కింది విధానాల్లో ఏదో ఒక పద్దతిలో వాడి మీరెప్పుడూ కావాలనుకున్న చర్మాన్ని పొందండి. పైగా ఈ కింద సూచించిన పద్ధతులన్నీ చవకైనవి మరియు శ్రమలేనివి.

నెలకి రెండుసార్లు ఈ కింద చెప్పబడిన ఏ సహజపదార్థంతో అయినా నువ్వుల నూనెను కలిపి చర్మాన్ని అందంగా మార్చుకోండి.

 గమనికః నువ్వులనూనె మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించేముందు చర్మంపై పరీక్ష చేసుకుని తర్వాత వాడండి.

నువ్వులనూనెను విటమిన్ ఇ నూనెతో 

ఎలా వాడాలిః 

-విటమిన్ ఇ క్యాప్సూల్ లోంచి నూనెను తీసి, 5-6 చుక్కల నువ్వులనూనెతో కలపండి. 

-మెల్లగా మీ చర్మం అంతా దీన్ని రాసి మసాజ్ చేయండి. ఒక 10 నిమిషాలు అలానే ఉంచండి.

 -తర్వాత మీ ముఖాన్ని ఫేస్ వాష్ మరియు గోరువెచ్చని నీరుతో కడిగేయండి. 

లాభాలుః ఈ మిశ్రమం మీ చర్మంకి పోషణనిచ్చి మృదువుగా, మెత్తగా మారుస్తుంది. 

నువ్వులనూనెను బ్రౌన్ షుగర్ మరియు ఆలివ్ నూనెతో

 ఎలా వాడాలిః 

-ఒక చెంచా బ్రౌన్ షుగర్, ఆలివ్ నూనె మరియు అరచెంచా నువ్వులనూనెను కలపండి.

 -ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై మెల్లగా కొద్ది నిమిషాలపాటు రుద్దండి.

 -అయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయండి.

లాభాలుః నువ్వుల నూనెను ప్రత్యేకంగా మీ చర్మం మృతకణాలను తొలగించడానికి ఉపయోగించి మురికిని తొలగించుకోండి.

నువ్వుల నూనెను బాదం నూనెతో 

ఎలా వాడాలిః 

-అరచెంచా నువ్వుల నూనెను 1 చెంచా బాదం నూనెతో కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై మసాజ్ చేయండి.

-15 నిమిషాలు అలానే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

లాభాలుః నువ్వుల నూనెను మీ చర్మంకి తిరిగి జీవం పోయడానికి, మృదువుగా మార్చడానికి ఉపయోగించండి.

నువ్వుల నూనెను రోస్ మేరీ సుగంధ నూనెతో 

ఎలా వాడాలిః 

-అరచెంచా నువ్వుల నూనెను 2-3 చుక్కల రోజ్ మేరీ సుగంధ నూనె మరియు 1 చెంచా ఆలివ్ నూనెతో కలపండి.

-మీ ముఖం మొత్తం దీనితో మసాజ్ చేసి,20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

 -తర్వాత మాయిశ్చరైజర్ ను రాసుకోండి.

లాభాలుః ఈ నువ్వుల నూనె మిశ్రమం చర్మంపై బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.




నువ్వుల నూనెను ఆలోవెరా జెల్ తో

ఎలా వాడాలిః


-ఆలోవెరా మొక్కలోంచి తాజా జెల్ ను తీసుకుని, అరచెంచా నువ్వుల నూనెతో కలపండి.

-వచ్చిన మిశ్రమాన్ని ముఖంపై పల్చగా రాసి, 15 నిమిషాలు అలానే ఉంచండి తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

-తేలికైన స్కిన్ టోనర్ ను తర్వాత రాయండి.

లాభాలుః ఈ అద్భుతమైన మిశ్రమం ఎక్కువ మచ్చలు పడటాన్ని తగ్గించి, చర్మం రంగంతా ఒకేలా ఉండేలా చేస్తుంది.

నువ్వుల నూనెను కాఫీ గింజలు మరియు నిమ్మరసంతో

ఎలా వాడాలిః


-1చెంచా కాఫీ గింజలు, అరచెంచా నిమ్మరసం మరియు 3-4 చుక్కల నువ్వుల నూనెతో మిశ్రమం తయారుచేయండి.

-ఈ మిశ్రమాన్ని పల్చని పొరలాగా ముఖంపై రాసి, 5-10నిమిషాలపాటు వదిలేయండి.

-సబ్బుతో మరియు గోరువెచ్చని నీటితో తర్వాత ముఖం కడిగేయండి.

లాభాలుః ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా నువ్వులనూనెను ప్రత్యేకంగా వాడండి మరియు అలా మొటిమలు రాకుండా చూసుకోండి.

Comments