డార్క్ స్కిన్ టోన్ కోసం సరైన మేక్ అప్ ని ఎంచుకోవడం ఎలా?

మీకు తెలుసా? ఒకప్పుడు కాస్మెటిక్ పరిశ్రమలు అన్ని ఎక్కువగా ఫెయిర్ గా వున్నవారిని దృష్టిలో పెట్టుకొని వారి ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసేవారు. నార్మల్ స్కిన్ కలిగిన వారి కోసం తక్కువ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండేవి.

 ఒకప్పుడు మహిళలకి అందుబాటులో వున్న ఫౌండేషన్స్ మరియు పౌడర్ లు కూడా నలుపు చర్మం వారికి అంత అట్ట్రాక్టీవ్ గా అనిపించేవి కావు. అయినప్పటికీ, నెమ్మదిగా, సౌందర్య పరిశ్రమలు అన్ని స్కిన్ టోన్ వారికి అనువుగా వుండే అన్ని రకాల ఉత్పత్తులతో ముందుకు వచ్చాయి.

నిజానికి మేక్ అప్ ఫెయిర్ స్కిన్ వాళ్ళతో కంపేర్ చేస్తే నలుపు రంగు వారికి అంత అందం గా కనిపించకపోవచ్చు. నలుపు చర్మం గల వారు వారి అందాన్ని నిరూపించుకోవడం కోసం మేకప్ ని వాడటమనేది నిజంగా ఒక సవాలు లాంటిది. కానీ ప్రతిసారి వారి అందంతో వారు ఏ మాత్రం తక్కువ కాదని వారి మేక్ అప్ తో నిరూపించుకున్నారు. దానికి తోడు అదృష్టవశాత్తూ, కాస్మెటిక్ పరిశ్రమలు కూడా నలుపు చర్మం కలిగిన వారికోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించాయి మరియు వారి స్కిన్ టోన్ కి తగినట్లు వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులో వున్నాయి.
నలుపు చర్మం కలిగి ఉన్న మహిళలు కొన్ని ప్రొడక్ట్స్ ని తరచూ వాడినప్పటికీ అనుకున్న ఫలితాలను ఇవ్వని సందర్భాలు చాలానే ఉండవచ్చు. లేదా మేకప్ కోసం ఎక్కువ సమయం గడిపిన తర్వాత కూడా, మీరు అనుకున్నంత అందంగా కూడా కనిపించకపోవచ్చు. అలాగని మీకు మేకప్ సెట్ అవదని దిగులు చెందాల్సిన అవసరం లేదు.

మీరు ఇప్పుడు డిస్సప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వ్యాసంలో మీ స్కిన్ టోన్ కి తగినట్లు ఎలాంటి మేక్ అప్ సరిపోతుంది ఎలాంటిది మీరు సెలెక్ట్ చేసుకోవాలనే దానిగురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి అవేంటో ఇప్పుడు చదివి తెలుసుకుందామా!

1. మీ అండర్స్టోన్స్ తో పని:

 సరైన మేక్ అప్ ని సెలెక్ట్ చేసుకోవడమనేది పూర్తిగా అండర్స్టోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నలుపు రంగుకి తగిన ఫౌండేషన్ ని ఎంచుకోవడమనేది ఒక సవాలు లాంటిది. ఎందుకంటే చాలా బ్రాండ్లు కేవలం రెండు లేదా అంతకంటే ఎక్కువ రంగులను మాత్రమే అందిస్తాయి. అవికూడా చూడటానికి ఒక లాగానే ఉంటాయి. ఇందులో మూడు కలర్స్ ఉన్నాయి. కూల్, వార్మ్, న్యూట్రల్ ఇప్పుడు దీని అర్థం ఏమిటి అని అనుకుంటున్నారా? మీ స్కిన్ టోన్ కి తగిన కలర్ ని ఈ క్రింది

 అంశాలలో ఎంచుకోవాల్సి ఉంటుంది.

వార్మ్: పీచ్, పసుపు, మరియు గోల్డ్ అండర్టోన్.
 కూల్: రెడ్, పింక్, నీలం అండర్ టోన్.

న్యూట్రల్: పైన పేర్కొన్న రంగుల మిశ్రమం.

మీకు వాటి గురించి ఖచ్చితంగా తెలియకపోతే, మీకు మేము సహాయం చేస్తాం.

వైట్ మరియు క్రీమ్ టెస్ట్:

 ఒక తెల్ల రంగు టవల్ మరియు ఒక క్రీమ్ రంగు టవల్ తీసుకోండి. దీన్ని చేస్తున్నప్పుడు మీ ముఖానికి ఎలాంటి మేకప్ లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు మీ ముఖం మీద ఒక వైట్ టవల్ ను కాసేపు నొక్కి ఉంచి తర్వాత తీసి కలర్ ఏమైనా మారిందేమో చూడండి.

 ఒకవేళ, అలా జరిగినట్లయితే మీరు వార్మ్ అండర్ టోన్ ని కలిగివున్నారని అర్థం. అదే విధంగా క్రీమ్ టవల్ చేయండి. క్రీమ్ కలర్ మీరు అనుగుణంగా ఉంటే, అప్పుడు మీరు ఒక కూల్ అండర్టోన్ కలిగి ఉంటారు. అలాకాకుండా మీకు రెండూ సరిపోయినట్లైతే మీది న్యూట్రల్ అండర్ టోన్ గా గుర్తించాలి.

మీ సిరలు(వెయిన్స్) యొక్క రంగులు: మీరు ఇంకా మీ వెయిన్స్ ని బట్టి కూడా మీ స్కిన్ టోన్ ని తెలుసుకోవచ్చు. అదెలా అని అనుకుంటున్నారా! మీ మణికట్టు మీద మీ సిరలు ఆకుపచ్చ రంగులో ఉంటే, అప్పుడు మీరు వెచ్చని అండర్టోన్స్ ని కలిగి వున్నారని అర్థం. అదే నీలం రంగులో ఉంటే, అప్పుడు మీకు కూల్ అండర్టోన్స్ ని కలిగి వుంటారు. అలా కాకుండా మీ సిరలు నీలం-ఆకుపచ్చగా కనిపిస్తున్నాయనుకుంటే అప్పుడు మీరు న్యూట్రల్ అండర్టోన్స్ కలిగివున్నారని గమనించాలి.

వెండి లేదా బంగారం:

 బంగారం మరియు వెండి ని ధరించి కూడా మీరు కనుకోవచ్చు. ఎలాగంటే మీరు బంగారం ని ధరించినప్పుడు అందులో మంచిగా కనిపిస్తున్నారని అనుకుంటే, అప్పుడు మీరు వార్మ్ అండర్టోన్స్ ని కలిగి ఉంటారు. అదే వెండి ని ధరించినప్పుడు వెండిలో మంచిగా కనిపిస్తే, అప్పుడు మీరు కూల్ అండర్టోన్స్ ని కలిగి ఉంటారు. మీరు ధరించే దుస్తుల రంగులు: మీరు మీ గదిలో వేర్వేరు రంగు దుస్తులను ధరించి ప్రయత్నించండి. నీలం, ఊదారంగు, ఆకుపచ్చ, పచ్చని ఆకుపచ్చ మొదలైనవి వేసుకున్నప్పుడు మీకు మీరు మంచిగా అనిపిస్తే, అప్పుడు మీరు కూల్ అండర్ టోన్స్ ని కలిగివుంటారు. ఎరుపు, ఆరెంజ్, పసుపు, మరియు ఆలివ్ ఆకుపచ్చ రంగులని ధరించినప్పుడు మీకు బాగా నచ్చినట్లయితే, అప్పుడు మీరు వార్మ్ వెచ్చని అండర్టోన్స్ ని కలిగి వున్నారని అర్థం. ఇందులో ఏ రంగు దుస్తులలో నిన్న అందంగా వున్నారని భావిస్తే అప్పుడు మీరు న్యూట్రల్ అండర్టోన్స్ కలిగివున్నారని గమనించాలి.

2.మీ ఫౌండేషన్ను ఎంచుకోండి: 

మీకు మీ చర్మం యొక్క అండర్ టోన్ గురించి మీకు తెలిసిన తర్వాత, సరైన ఫౌండేషన్ ని ఎంచుకోవడానికి మీకు సులభంగా ఉంటుంది. కావాలంటే కొంచం తీసుకొని మీ ముఖం మీద రాసుకొని పరీక్షించి చూడండి. అయితే మీ శరీరం యొక్క రంగు కి సరిపోయేలా మీరు తీసుకొనే ఫౌండేషన్ ఉండాలని గుర్తుంచుకోండి. మీరు మీ స్కిన్ కి పర్ఫెక్ట్ గా వుండే కలర్ కావాలనుకున్నప్పుడు, కేవలం ఒకటి రెండుని మాత్రమే చూడకుండా వున్న అన్ని ఫౌండేషన్ షేడ్స్ లను పరీక్షించండి. కొంచం సమయం తీసుకొని బాగా ఆలోచించి మీ స్కిన్ టోన్ కి సరిపోయే మంచి ఫౌండేషన్ను ఎంచుకోండి.

3.మీ బ్లుష్ ఎంచుకోండి:

 మీరు ఒకవేళ డార్క్ స్కిన్ టోన్ ని కలిగివున్నట్లైతే డార్క్ మావ్, నారింజ, లేదా క్రాన్బెర్రీ బాగుంటుంది. కానీ బోల్డ్ కలర్స్ ని ప్రయత్నించడానికి అస్సలు బయపడకండి. మీరు వార్మ్ అండర్టోన్స్ ని కలిగిఉంటే అప్పుడు ప్రకాశవంతమైన ఫుచ్సినా మంచిగా కనిపిస్తుంది. మీరు న్యూట్రల్ అండర్టోన్స్ కలిగి ఉంటే, అప్పుడు టాన్జేరిన్ కోసం వెళ్ళండి.

4.ఇషాషా షేడ్స్:

 ఏ రిచ్ షేడ్స్ అయినా మీ కళ్ళు అందంగా కనిపించేలా చేస్తాయి. ప్రకాశవంతమైన నీలం, ఊదా, పచ్చని ఆకుపచ్చ, లోతైన బుర్గున్డి మొదలైన షేడ్స్, మీ చర్మం టోన్ కి మరింత అందంగా ఉంటాయి. కాంస్య మరియు బంగారం మీ చర్మం వెచ్చని మరియు మీ కళ్ళను ప్రకాశవంతంగా చేస్తుంది. మీ చర్మం పొడిగా మరియు డల్ గా కనిపించే విధంగా, తెలుపు, లేత తెలుపు, పేల్ లేదా మెరిసే రంగులను నివారించండి. మీరు మాట్టే ఫినిషింగ్ ని ఇష్టపడినట్లయితే, చాక్లెట్ లేదా న్యూడ్ వంటి న్యూట్రల్ రంగులను ఎంచుకోండి.

5.బ్రోన్జ్ర్: 

అన్ని స్కిన్ టోన్ లకి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బ్రోన్నర్ మీ స్కిన్ టోన్ను హైలైట్ చేస్తుంది మరియు ఇంకా మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని ఒక న్యూట్రల్ షేడ్ కోసం వాడండి మరియు దీనిని మీ టెంపుల్, నుదురు, మరియు బుగ్గల మీద రాసుకోవడం వలన మీరు మరింత అందంగా కనిపిస్తారు.

6. లిప్ స్టిక్ కలర్స్:

 నిగనిగలాడే గులాబీ లేదా వైలెట్ రంగులు మీ పెదవుల కి సరికొత్త రూపాన్ని ఇస్తాయి.అయితే బోల్డ్ మాట్టే రంగులు మరియు బెర్రీ కలర్స్ మీ కలర్ కి బాగా సరిపోతాయి. మీరు వార్మ్ అండర్ టోన్ ని కలిగి ఉంటే, అప్పుడు మీరు పీచ్, ఆరంజ్-ఎరుపు మరియు గోధుమ రంగులలో అందంగా కనిపిస్తారు. మీరు కూల్ అండర్ టోన్ల ని కలిగివున్నట్లైతే ఉన్నట్లయితే, నీలం,ఊదా రంగు, గులాబీ, ఎరుపు రంగు మీకు ఎప్పుడూ బెస్ట్ ఎంపికగా గుర్తుంచుకోండి.






Comments