ముఖంలో గులాబీ మెరుపులు పొందడానికి నేచురల్ ఫేస్ ప్యాక్స్

స్త్రీకి అందం కంటే మించినది మరొకటి లేదు. అందుకే మహిళలు అందానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ అందం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు. మన అందాన్ని మనకు కావల్సిన రీతిలో మనమే తీర్చిదిద్దుకోవచ్చు. సమయానికి పోషకాహారం తీసుకోవడంతో పాటు, కొన్ని సౌందర్యచిట్కాలను పాటిస్తే వయస్సు పెరిగినప్పటికీ తరగని అందం మన సొంతమవుతుందంటున్నారు సౌందర్యనిపుణులు. ఎలాంటి అందమైనా ఎక్కువ కాలం కాపాడుకోవడానికి ఇంటిలోనే కొంత సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. అలా చేస్తే కళ్లు తిప్పుకోలేని అందం మీ సొంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్

అందంలో ముఖ్య పాత్రను పోషించేది చర్మం. వయస్సుని తొందరగా గుర్తు పట్టేలా చేసేది చర్మం. చర్మంలో ముడుతలవల్లే నిగారింపు, యవ్వనం, అందం మటు మాయమౌతాయి. వయస్సుతో సంబంధం లేకుండా కేవలం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఇలా జరుగుతుంటుంది. కొంత మందిని కొన్ని సందర్భాల్లో చూసి వాళ్ళు అమ్మ, కూతుళ్ళా లేకా అక్కా చెల్లెళ్ళా అని అనుకుంటారు. దానికి కారణం అందానికి తగినటువంటి కేర్‌ తీసుకోవడమే. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీరూ అందంగా...ఆకర్షనీయంగా కనిపిస్తుంటారు.

READ MORE: డార్క్ గా ఉన్న చర్మంను తెల్లగా మార్చే నేచురల్ ఫేస్ ప్యాక్ 

అలాంటి ఫెయిర్ స్కిన్...గ్లోయింగ్ స్కిన్ కోరుకోవడం ప్రతి ఇండియన్ గర్ల్ యొక్క డ్రీమ్ . అలాంటి డ్రీమ్ ను నిజం చేసుకోవడానికి చాలా మంది ఎక్కువగా కాస్మోటిక్స్ మరియు ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తూ అందంగా కనబడుటకు ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రొడక్ట్స్ తాత్కాలిక ఫెయిర్ నెస్ మాత్రమే ఇస్తుంది. మరియు దీర్ఘకాలంలో చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది.

 మీ చర్మంలో ఫెయిర్ నెస్ మరియు మంచి గ్లో ను తీసుకురావడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. ఈ ఫేస్ ప్యాక్స్ ముఖంలో అన్ని రకాల మచ్చాలు మరియు మొటిమల యొక్క మార్క్స్ ను తొలగిస్తుంది. అంతే కాదు ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని యంగ్ గా మరియు సాఫ్ట్ గా మార్చుతుంది.

 READ MORE: కాంతివంతమైన చర్మ సౌందర్యానికి పెరుగుతో ఫేస్ ప్యాక్ 

నేచురల్ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడం చాలా సులభం మరియు అందకు అవసరం అయ్యే పదార్థాలు కూడా మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ ల వల్ల చర్మ శాస్వతంగా ఫెయిర్ అండ్ గ్లోగా మెరుస్తుంటుంది. మరి ఆ నేచురల్ ఫేయిర్ ఫేస్ ప్యాక్స్ ఏంటో చూద్దాం...

దానిమ్మ మరియు తేనె ఫేస్ ప్యాక్: 

దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించి 30 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫెయిర్ స్కిన్ పొందడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

పెసలు మరియు పసుపు ఫేస్ ప్యాక్:

 రెండు చెంచాల పెసళ్ళ పౌడర్ మరియు చిటికెడు పసుపు తీసుకోవాలి . దీనికి కొద్దిగా పాలు జోడించి చిక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బంతిపువ్వులు మరియు రోజ్ ప్యాక్: 

బంతపువ్వుల యొక్క రేకులను మెత్తగా పేస్ట్ చేసి దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం మరియు మెడకు పట్టించి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది ఒక బెస్ట్ హోం మేడ్ ఫేస్ ప్యాక్.

పుదీనా మరియు ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్:

తాజాగా ఉండే పుదీనా ఆకులు మెత్తగా గ్రైండ్ చేసి, దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను మిక్స్ చేయాలి . తర్వాత అందులో కొద్దిగా ముల్తానీ మట్టి మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

గంధం మరియు రోజ్ వాటర్: 

ఒక టేబుల్ స్పూన్ గంధంలో చిటికెడు పసుపు మరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి . ఈ పేస్ట్ ను ముఖానికి మరియు మెడకు పట్టించి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ఫేస్ ప్యాక్ వల్ల నేచురల్ ఫెయిర్ ను పొందవచ్చు.

తేనె మరియు వేప ఫేస్ ప్యాక్: 

ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక చెంచా తేనెలో చిటికెడు పసుపు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి 10 నిముషాల తర్వత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తులసి మరియు వేప ఫేస్ ప్యాక్:

 ఈ ఫేస్ ప్యాక్ ను కోసం తులసి ఆకులు మరియు కొద్దిగా వేప ఆకులు తీసుకొని పేస్ట్ లా చేయాలి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నువ్వులు మరియు పసుపు: 

నువ్వులను నీళ్ళలో వేసి 12గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వంపేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ , పసుపు మిక్స్ చేసి పేస్ట్ లా చేసిన తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకొని 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.





Comments