సహజంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటారు. వయసురీత్యా చర్మంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వయసు పైబడే కొద్దీ చర్మం సాగినట్లు కనిపిస్తుంది. ముఖ చర్మంలో ఉండే కండరాల పటుత్వం తగ్గడమే అందుకు కారణం.
READ MORE: వర్షాకాలంలో పాటించాల్సిన టాప్ 10 చర్మసంరక్షణ చిట్కాలు
దీన్ని నివారించాలంటే.. నిపుణుల సలహాతో వారానికోసారి ఫేషియల్స్ చేయించుకోవాలి. అలాగే రోజు వారీ చర్మ సంరక్షణపైనా దృష్టి సారించాలి. శుభ్రపరచుకోవడం.. మాయిశ్చరైజర్ రాసుకోవడం వంటివన్నీ ప్రాథమిక చర్యలు. చర్మానికి తేమ అందడం కోసం మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు వెలుపలికి వచ్చేసాయి. ఫలితం మెరిసే మేని మీ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.
READ MORE: బరువు తగ్గిన తరువాత బిగుతైన చర్మం కోసం 15 మార్గాలు..
అంతే కాదు కొన్ని హోం రెమెడీస్ కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ హోం రెమెడీస్ కోసం నేచురల్ రెమెడీస్ ను ఎక్కువగా ఉపయోగిస్తాము. ఈ హోం రెమెడీస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఈ హోం రెమెడీస్ వయసురీత్యా వచ్చే చర్మ సమస్యలను నివారిస్తుంది. వయస్సురీత్యా వచ్చే కొన్ని స్కిన్ కేర్ రెమెడీస్ ఈ క్రింది విధంగా...
1. అరటి మాస్క్:
బాగా పండిన అరటిపండులో కొద్దిగా తేనె మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఈ మాస్క్ స్పాలాగే పనిచేస్తుంది. ఇది వదులైన చర్మాన్ని టైట్ గా మార్చుతుంది. స్కిన్ ఎలాసిటిని పెంచి, చర్మంలో మంచి గ్లోను తీసుకొస్తుంది.
ఎగ్ వైట్ :
ఎగ్ వైట్ ఒక నేచురల్ ఆస్ట్రిజెంట్ మరియు ఇది స్కిన్ టైటనర్ గా కూడా పిలవవచ్చు. ఎగ్ వైట్ లో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖం మరియు మెడకు మాస్క్ లా వేసుకొని 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కీరదోసకాయ:
కీరదోసకాయ రసాన్ని స్కిన్ టైటనర్ గా ఉపయోగించుకోవచ్చు. కీరదోసకాయను మెత్తగా చేసి ఆ పేస్ట్ ను నేరుగా ముఖం మరియు మెడకు పట్టించి 10నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి . ఈ చిట్కాను మీరు ప్రతి రోజూ అనుసరించవచ్చు. మరో చిట్కా కీరదోసకాయను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసి ముఖం మరియు మెడకు పట్టించాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
బేకింగ్ సోడ:
బేకింగ్ సోడను మరియు గోరువెచ్చని నీరు ఒక టేబుల్ స్పూన్ వేసి ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఇది చర్మంను టైట్ చేస్తుంది. ముఖంలో ముడుతలు మరియు మొటిమలను నివారిస్తుంది.
టమోటోలు:
తాజాగా ఉన్న టమోటోల నుండి రసాన్ని తీసి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసి సర్కులర్ మోషన్ లో మర్ధన చేయాలి. ఇది చర్మానికి అద్భుతాలను చేస్తుంది. టమోటోల్లో అసిడిక్ ఆమ్లాం ఉండటం వల్ల ఇది కొద్దిగా దురదగా అనిపిస్తుంది. అయితే ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. కాబట్టి, ఒక గంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం బ్యూటిఫుల్ గా అందంగా కనబడుతుంది.
ఆముదం:
చర్మంను నేచురల్ గా టైట్ చేసే బెస్ట్ హోం రెమెడీ. ఆముదం ముఖం మరియు మెడకు అప్లై చేయడ వల్ల చర్మం టైట్ గా మరియు చర్మం మెరిసేలా చేస్తుంది. ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు మీ ముఖానికి ఆముదంను అప్లై చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.
పెరుగు:
పెరుగులో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇది చర్మం మెరవడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మం టైట్ గా మారడానికి ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. క్యాల్షియం మరియు ప్రోటీన్స్ చర్మాన్ని టైట్ చేస్తుంది. రెండు చెంచాల పెరుగు మరియు రెండు చెంచాల నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10నిముషాలు మసాజ్ చేసి 5నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది కొల్లాజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది ముడతలను నివారిస్తుంది . ప్రీమెచ్యుర్ ఏజింగ్ నివారిస్తుంది.
అలోవెరా:
అలోవెరా చర్మాన్ని టైట్ చేస్తుంది . మాలిక్ యాసిడ్ ఉండటం వల్ల చర్మం యొక్క ఎలాసిటి మెరుగుపరుస్తుంది మరియు చర్మం మరియు నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
బాదం ఆయిల్ :
బాదం ఆయిల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. బాదం ఆయిల్ ను ముఖానికి అప్లై చేసి 15నిముషాలు మసాజ్ చేస్తే చర్మ సాగకుండా నేచుల్ గా టైట్ చేస్తుంది.
తేనె:
తేనెలో నేచురల్ మాయిశ్చరైజింగ్, యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఏజింగ్ ప్రొపర్టీస్ ఉండటం వల్ల ఇది చర్మంను టైట్ చేస్తుంది. తేనెలో కొద్దిగా నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖం మరియు మెడకు అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
Comments
Post a Comment