క్లియర్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ పొందడానికి ఇంటి చిట్కాలు

వ్యక్తి అందాన్ని తెలియపరచడంలో స్వచ్చమైన అందమైన చర్మ సౌందర్యం తెలుపుతుంది. హెల్తీ స్కిన్ అందంగా కనిపించడానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్క మహిళ అందమైన ఎలాంటి మొటిమలు, మచ్చలు లేని చర్మ సౌందర్యాన్ని కోరుకుంటుంది. మీ చర్మ సంరక్షణ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చర్మ ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. చర్మం అందంలో విషయంలో స్ట్రెస్, నిద్రలేమి, న్యూట్రీషియన్ లోపం, పొల్యూషన్, సూర్య రశ్మిలోని యూవీ కిరణాల వల్ల చర్మం డ్యామేజ్ అవ్వడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ చర్మం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. క్లియర్ అండ్ ఫెయిర్ స్కిన్ పొందడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ హోం రెమెడీస్ అన్ని రకాల చర్మ తత్వాలకు సహాయపడుతుంది. చర్మం అందంగా, నేచురల్ గా కాంతివంతంగా మార్చడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

స్వచ్చమైన, కాంతివంతమైన చర్మం పొందడానికి, స్కిన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వేలల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కమర్షియల్ మరియు కెమికల్ ప్రొడక్ట్స్ , కాబట్టి, వీటికి బదులుగా, కొన్ని సింపుల్ అండ్ ఈజీ హోం రెమెడీస్ ను పఫాలో అవ్వడం వల్ల పూర్తిగా చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. నేచురల్ గా చర్మ సౌందర్యం మెరుగుపరచడానికి ఇంట్లో అనుసరించాల్సిన కొన్ని ఎఫెక్టివ్ టిప్స్ ఈ క్రింది విధంగా..

నిమ్మరసం, కీరదోసకాయ: 

క్లియర్ స్కిన్ అందివ్వడంలో ఉత్తమ హోం రెమెడీ నిమ్మరసం, నిమ్మరసం క్లియర్ స్కిన్ అందివ్వడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. విటమిన్ సి కంటెంట్ చర్మంలో డార్క్ స్పాట్స్ తొలగిస్తుంది. స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపరుస్తుంది. నిమ్మరసంను ముఖానికి అప్లై చేసి, 15నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. తర్వాత కీరదోసకాయ ముక్కలుగా కట్ చేసి, చర్మానికి మర్ధన చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం, పంచదార: 

నేచురల్ గా చర్మంను కాంతివంతంగా మార్చడం ఎలా?చర్మంను కాంతివంతంగా మార్చడంలో నిమ్మరసం , పంచదార కాంబినేషన్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక టీ స్పూన్ నిమ్మరసంను , ఒక టీస్పూన్ పంచదారను ముఖం, మెడ, చేతులకు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత స్ర్కబ్ చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు, పైనాపిల్ జ్యూస్:

 పసుపులో అద్భుతమైన యాంటీసెప్టిక్ గుణాలున్నాయి, స్కిన్ లైటనింగ్ ఏజెంట్ ఇది ముఖంలో స్కార్స్, మరియు ఇతర మార్క్స్ ను తొలగిస్తుంది. పసుపు చర్మంలోని ఇన్ఫెక్షన్స్, మరియు వ్యాధులను నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు లో ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ జ్యూస్ మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖం, మెడకు అప్లై చేయాలి. ఈ పేస్ట్ ను పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ హోం రెమెడీని వారంలో రెండు మూడుసార్లు అనుసరిస్తే స్పాట్ లెస్ స్కిన్ పొందవచ్చు.

శెనగపిండి, పసుపు:

శెనగపిండి మరియు పసుపు మిశ్రమం చర్మానికి నేచురల్ గ్లోను అందిస్తుంది.ఒక టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ శెనగపిండి, కొద్దిగా పాలు వేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి డ్రై అయ్యే వరకూ ఉండాలి, తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

తేనె, రోజ్ వాటర్:

 క్లియర్ స్కిన్ పొందడానికి తేనె మరియు రోజ్ వాటర్ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి గ్రేట్ మాయిశ్చరైజింగ్ గా సహాయపడుతుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది, ఈ ఫేస్ మాస్క్ ను ప్రతి రోజూ ఉదయం అప్లై చేయాలి.

అలోవెర జెల్ :

 క్లియర్ స్కిన్ పొందడానికి మరో బెస్ట్ హోం రెమెడీ అలోవెర, ఇందులో చర్మానికి సంబంధించిన ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది. ఇందులో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు స్కార్స్ ను నయం చేస్తుంది. అలోవెర స్కిన్ మాయిశ్చరైజింగ్ పెంచుతుంది, చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

పెరుగు మరియు గుడ్డు:

 చర్మం అందంగా , కాంతివంతంగా మార్చడానికి పెరుగు, గుడ్డు మిశ్రమం గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. గుడ్డు చర్మంను టైట్ గా మార్చుతుంది మరియు ముడుతలను మాయిం చేస్తుంది. స్కిన్ కు కావల్సిన ప్రోటీన్స్ ను అందిస్తుంది. దాంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఓట్స్ మరియు పెరుగు:

 ఈ రెండు కాంబినేషన్స్ ముఖంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది,చర్మంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఓట్స్ నేచురల్ స్కిన్ స్ర్కబ్బర్ గా పనిచేస్తుంది


Comments