రొటీన్ స్కిన్ కేర్ లో భాగంగా రైస్ వాటర్ ని ఎలా వాడాలి?

రైస్ వాటర్ అనేది ఆసియా మహిళల యొక్క సౌందర్య రహస్యం. అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రైస్ వాటర్ లో పుష్కలంగా లభిస్తాయి.

 ఈ అద్భుతమైన ఇంగ్రిడియెంట్ ను బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుంటే స్వచ్ఛమైన, శుభ్రమైన చర్మాన్ని పొందవచ్చు. అందుచేతనే, ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ అద్భుతమైన కాస్మెటిక్ ప్రాపర్టీస్ కలిగిన ఈ బ్యూటీ ఇంగ్రీడియెంట్ తమ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుని తమ చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకుంటున్నారు.
స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా రైస్ వాటర్ ని ఎలా వాడాలి?

ఈ రోజుల్లో కూడా, కెమికల్స్ తో కూడిన బ్యూటీ ప్రోడక్ట్స్ ని వాడడానికి కొంత మంది ఇష్టపడటం లేదు. వారు, సహజ సిద్ధమైన కాస్మెటిక్ ప్రాపర్టీస్ కలిగిన ఇంగ్రీడియెంట్స్ నే వాడుతున్నారు. అటువంటి వాటిలో రైస్ వాటర్ అనేది ముందుంటోంది. అంతేకాక, ఈ రైస్ వాటర్ ని బ్యూటీ రొటీన్ లో అనేక విధాలుగా వాడవచ్చు. తద్వారా, మృదువైన, కోమలమైన చర్మాన్ని పొందవచ్చు.

బోల్డ్ స్కై లో ఈ రోజు ఈ అద్భుతమైన బ్యూటీ ఇంగ్రిడియెంట్ ని మీ రెగ్యులర్ బ్యూటీ రొటీన్ లో భాగంగా ఎలా వాడాలో తెలియచేస్తాము. ఇక్కడ వివరించబడిన పద్దతులను పాటించి అద్భుతమైన ఫలితాలను పొందండి. పొడిబారిన, నిస్తేజంగా మారిన మీ చర్మానికి చక్కటి పోషణని అందించండి.

రైస్ వాటర్ ని చర్మ సంరక్షణ కోసం ఏ విధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం:

1. రైస్ వాటర్ తో రోజ్ వాటర్: 

రెండు నుంచి మూడు టీస్పూన్ల రైస్ వాటర్ ని 3 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ తో కలిపి అద్భుతమైన సహజసిద్ధమైన స్కిన్ సూతింగ్ టోనర్ ని తయారుచేసుకోండి. ఈ హోంమేడ్ టోనర్ ని మీ ముఖంపై స్ప్రే చేసుకుని చర్మంలో పేరుకుపోయిన దుమ్మూ ధూళిని తొలగించుకోండి. తద్వారా, చర్మంలో దాగున్న స్వచ్ఛతను బయటకు తీసుకురండి. స్వచ్ఛమైన చర్మాన్ని పొందడానికై ఈ టోనర్ ని వారానికి రెండు సార్లు వాడవచ్చు.

2. రైస్ వాటర్ తో గ్రీన్ టీ: 

రెండు టేబుల్ స్పూన్ల రైస్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ని కలపండి. ఈ హోంమేడ్ మిశ్రమంతో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని మరలా శుభ్రపరచండి. ఈ రైస్ వాటర్ పేషియల్ రిన్స్ ని మీ వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకుంటే ప్రకాశవంతమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

3. రైస్ వాటర్ తో తేనె: 

ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ హనీతో రెండు టీస్పూన్ల రైస్ వాటర్ ని కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లా అప్లై చేయండి. పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రపరుచుకోండి. ఈ హోంమేడ్ ఫేస్ మాస్క్ ను వారానికి ఒకసారి వాడితే మొటిమల సమస్య తొలగుతుంది.

4. రైస్ వాటర్ తో అలో వెరా జెల్:

రెండు టీస్పూన్ల అలో వెరా జెల్ ను ఒక టీస్పూన్ రైస్ వాటర్ తో కలపండి. ఇప్పుడు, ఈ మిశ్రమాన్ని చర్మంపై మృదువుగా అప్లై చేయండి. ముప్పై నిమిషాల తరువాత మీ చర్మాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచండి. ఈ విధమైన పద్దతిలో రైస్ వాటర్ ను ఉపయోగిస్తే మృదువైన కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది. వారానికి రెండు సార్లు ఈ పద్దతిని పాటిస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

5. రైస్ వాటర్ తో మిల్క్ పౌడర్: 

ఒక పాత్రలో, రెండు టేబుల్ స్పూన్ల రైస్ వాటర్ ని అలాగే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ని కలపండి. ఇప్పుడు, ఈ పదార్థాలని పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ని మీ ముఖంపై అప్లై చేసుకోండి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి. ఈ రైస్ వాటర్ మాస్క్ ని వారానికి ఒకసారి వాడితే ట్యాన్డ్ స్కిన్ ప్రాబ్లెమ్ తొలగిపోతుంది.

6. రైస్ వాటర్ తో లెమన్ జ్యూస్

 నాలుగు టేబుల్ స్పూన్ల రైస్ వాటర్ తో ఒక టీస్పూన్ లెమన్ జ్యూస్ ను కలపండి. ఈ హోంమేడ్ సొల్యూషన్ తో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోండి. ఈ ఫేషియల్ రిన్స్ ని వారానికి రెండుసార్లు వాడితే నిస్తేజంగా మారిన మీ చర్మం చక్కటి కళను సంతరించుకుంటుంది.

7. రైస్ వాటర్ తో దోశకాయ

 ఒక బౌల్ తీసుకుని అందులో తరిగిన దోసకాయ ముక్కలను వేసుకోండి. దోసకాయను మ్యాష్ చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల రైస్ వాటర్ ని కలపండి. ఇప్పుడు తయారైన మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి. ఈ విధంగా మీ చర్మాన్ని వారానికొకసారి గారాబం చేస్తే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.

8. రైస్ వాటర్ తో శాండల్వుడ్ పౌడర్:

 ఒక టేబుల్ స్పూన్ రైస్ వాటర్ ని ఒక టేబుల్ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ తో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అలాగే మెడపై అప్లై చేయండి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోండి. ఈ పద్దతిలో మీ చర్మాన్ని సంరక్షించుకుంటే చర్మంపై అకాల వృద్ధాప్య లక్షణాలైన ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి కనిపించవు. ఈ హోంమేడ్ సొల్యూషన్ ని స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకుని చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోండి.


Comments