సాధారణంగా రపుంజీల్ లాంటి పొడవైన మరియు దట్టమైన జుట్టును పొందడం అనేది చాలామంది మహిళల కోరిక. అయితే అలాంటి సొగసైన,పొడవైన జుట్టుని సొంతం చేసుకోవాలనుకునే వాళ్లలో మీరు ఒకరా? అలాంటి జుట్టుని కలిగివుండటం వలన అది మీరు ఎంతమందిలో వున్నా మిమల్ని అందరిలోకెల్లా ప్రత్యేకంగా మరియు అందంగా కనిపించేలా చేస్తుంది. మరి ఇలాంటి అవకాశాన్ని ఏ మహిళ కోరుకోదు చెప్పండి!
కానీ,ఈ రోజుల్లో ఎక్కువమంది మహిళలు వారి జుట్టు సన్నబడుతోందని బాధపడుతున్నారు.ఈ పరిస్థితి లో మీ జుట్టు చాలా బలహీనమైనదిగా , పెళుసుగా మరియు దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది.
ఈ విధంగా మీ జుట్టు సన్నబడటం మరియు జీవం లేనట్లుగా కనిపించడానికి అనేక బాహ్య మరియు అంతర్గత కారణాలు ఉన్నాయి.
ఎలాంటి చెడు ప్రభావాలు లేకండా, మీ జుట్టు యొక్క రూపాన్ని మీరు గుర్తించగలిగేలా చేసే ఒక హెయిర్ కండిషన్ వుంది. అదేంటో ఇప్పడు చూద్దామా మరి..
ఒత్తయిన మరియు దట్టమైన జుట్టు కోసం కావాల్సినవి
జుట్టు సన్నబడిందనే సమస్యతో భాదపడుతున్న చాలా మందిలో మీరు కూడా ఒకరు అయితే, అప్పుడు మీకు కచ్చితంగా మేము సహాయపడతాము .ఎలా అనుకుంటున్నారా? ఇవాళ బోల్డ్ స్కై మీకు చవకైన మరియు సులభంగా లభించే సహజ పదార్ధాల జాబితాను తీసుకువచ్చాము, అవి మీకు మందమైన మరియు దట్టమైన జుట్టును పొందటానికి సహాయపడతాయి.
పలచని జుట్టుకి చికిత్స చేయడానికి కొన్ని పురాతన ఇంటి చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం . ఇక్కడ, మేము కొన్ని పదార్థాలు మరియు వాటిని ఎలా ఉపయోగించాలనే మార్గాలను తెలియాజేశాము...
1. ఆముదం (కాస్టర్ ఆయిల్)
ఆముదంలో ఉండే పోషకాలు మీ జుట్టు మందంగా చేసి మరియు జుట్టు కుదుళ్ళ నుండి బలపరుస్తాయి, దాని వలన విఘటనను నివారించవచ్చు.
ఎలా ఉపయోగించాలి:
వారానికి ఒకసారి, మీ జుట్టుకి మరియు కుదుళ్ళకి ఆముదం నూనెని రాసి 5-10 నిముషాల పాటు మసాజ్ కోసం చేయాలి. అలా చేసిన తరువాత, మీ తలని ఒక తేలికపాటి షాంపూ మరియు గోరువెచ్చని నీటితో కడిగేయండి.
2.మెంతులు
మెంతుల్లో వుండే పోషకాలు మీ స్కాల్ప్ లోని మలినాలను తొలగించి మీ జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది మరియు సన్నగా వున్న మీ జుట్టుని మందంగా లావుగా కనిపించేలా చేస్తాయి.
ఎలా ఉపయోగించాలి:
రాత్రిపూట నీటిలో కొన్ని మెంతులను నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వాటిని నిమ్మరసం తో పాటు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పడు ఈ మిశ్రమాన్ని మీ తలకి రాసి కాస్సేపు మర్దనా చేయండి తలపై ఒక గంట సేపు ఉంచుకొని తరువాత, దానిని కడిగేయండి. ఉత్తమ ఫలితాల కోసం దీనిని వారానికి రెండుసార్లు ఉపయోగించండి.
3.ఉల్లిపాయ జ్యూస్
ఉల్లిపాయ రసం మీ జుట్టు యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుంది మరియు అది మీ జుట్టుని దట్టమైన మరియు మందంగా కనిపించేలా చేయగలిగే యాంటీఆక్సిడెంట్లతో నిండిన పోషకాలను కలిగివుంటుంది.
ఎలా ఉపయోగించాలి:
1 గ్లాసు నీటిలో 3-4 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం కలిపి, మీ జుట్టుకి రాయండి. దీనిని మీ జుట్టు మీద 10-15 నిమిషాల పాటు ఉంచి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. మంచి ఫలితాల కోసం వారానికొకసారి ఈ గృహ చికిత్సను ప్రయత్నించండి.
4. గోరింట ఆకులు
కొన్ని తరాల నుండి, గోరింట ఆకులు జుట్టు సంరక్షణ ప్రయోజనాల విషయంలో ముక్యమైనవిగా చెప్పబడతాయి. ఈ ఆకులలో ఉండే ఖనిజాలు మరియు పోషకాలు సన్నని మీ జుట్టుని ఒత్తుగా మారుస్తాయి.
ఎలా ఉపయోగించాలి:
కేవలం గోరింట ఆకులను రుబ్బుకొని ఆ పొడిని బాదం నూనెతో కలపాలి. ఇప్పడు మీ స్కాల్ప్ మరియు మొత్తం జుట్టుకి దీనిని పట్టించి 15 నిమిషాలు మర్దనా చేసి కాస్సేపు ఆరనివ్వండి . తరువాత ఒక మోస్తరు నీటితో మీ జుట్టును కడిగేయండి. పట్టు లాంటి ఒత్తయిన జుట్టు ని పొందడానికి నెలకు రెండుసార్లు దీనిని ప్రయత్నించండి.
5. ఆమ్లా నూనె
ఆమ్లా నూనె ని జుట్టు పెరగడానికి తరచూ ఉపయోగిస్తుంటారు, ఆమ్లా నూనె మీ జుట్టు యొక్క మొత్తం నిర్మాణం మెరుగుపరచడానికి మరియు ఒత్తయిన మరియు దట్టమైన జుట్టుని మీ సొంతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఎలా ఉపయోగించాలి:
ఈ నూనెతో మీ తలమొత్తం పట్టించి మసాజ్ చేయండి మరియు రాత్రంతా అలానే వదిలివేయండి. ఉదయం, మీ జుట్టు ని గోరువెచ్చని నీరు మరియు ఒక తేలికపాటి షాంపూ ని వుపయోగించి కడిగేయండి. మీరు వేగవంతమైన ఫలితాల కోసం దీన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు.
6. గుడ్డు పచ్చసొన
ప్రోటీన్లతో సమృద్ధంగా నిండివున్న గుడ్డు లోని పచ్చసొన జుట్టు సన్నబడే సమస్యను నివారించడానికి అద్భుతమైన పరిష్కారంగా వుంది. ఇది మందమైన మరియు దట్టమైన జుట్టును సాధించడంలో మీకు సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి:
ఒక గిన్నెలో ఒక గుడ్డు పచ్చసొన వేసి కావాల్సినంత లావెండర్ నూనె ని కొన్ని చుక్కలను కలపి బాగా మిక్స్ చేసి, మీ స్కాల్ప్ మీద రాయండి. 30 నిమిషాల తరువాత, మీ జుట్టును ఒక మూలికా షాంపూతో కడగాలి. మంచి ఫలితాల కోసం నెలకు రెండుసార్లు దీనిని ఉపయోగించవచ్చు.
7.ఆలివ్ ఆయిల్
విటమిన్లు మరియు పోషకాలతో నిండివున్న ఆలివ్ నూనె మీ కుదుళ్ళని బలపరిచి మరియు వాటి నిర్మాణం మెరుగుపరచడానికి మరొక శక్తివంతమైన నూనెగా చెప్పవచ్చు.
ఎలా ఉపయోగించాలి:
ఆలివ్ నూనె ని మీ స్కాల్ప్ మీద రాసి మరియు 3-4 గంటల పాటు ఉండనిచ్చి మీ తలని ఒక షాంపూ మరియు గోరువెచ్చని నీటితో కడగండి. గొప్ప ఫలితాలను పొందటానికి ఈ పదార్ధాన్ని కనీసం వారానికి 2-3 సార్లు వాడి సన్నని మీ జుట్టుకి సహాయం చేయండి.
Comments
Post a Comment