బ్యాక్ స్కార్స్ (వీపున మచ్చలు, మొటిమలు)నివారించే చిట్కాలు

అందం విషయంలో కళ్ళు, ముక్కు, పెదాలు, చెవులు, మెడ, చేతులు, గోళ్ళు, కాళ్ళు, వేళ్ళు ఇలా శరీరంలో ప్రతి భాగం ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అంతే కాదు నడుము, వీపుకు కూడా అమ్మాయి అందంలో ప్రధాణ ఆకర్షిత భాగాలు, ఈ రెండు కూడా చూడటానికి అందంగా ఉన్నప్పుడే ఆ సౌందర్యం పూర్తిగా ఇనుమడిస్తుంది . పైనుండి క్రింది వరకూ చూడటానికి అందంగా కనిపించి వీపు భాగంలో నల్లని మచ్చలు, మొటిలమలతో అస్యహ్యంగా ఉన్నట్లైతే చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.

 జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పే వేసిన అందమే అన్నట్లు, వీపు అందంగా ఉంటే ఏలాంటి డ్రెస్సు వేసినా అందంగానే కనిపిస్తుంది. డీప్ నెక్, బ్యాక్ లెస్, ఇలా ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొనే వారు, వీపు అందంగా లేకపోతే, ఫ్యాషన్ డ్రెస్సలను పరిమితం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా సెల్ఫెకాన్ఫిడెన్స్ తగ్గి, షాపింగ్ మీద ఆసక్తి తగ్గుతుంది.

మరి అలాంటి వారు ఏమాత్రం చింతించకుండా ఉండాలంటే, వీపున ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా అందంగా కనిపించడానికి కొన్ని ఎఫెక్టివ్ మార్గాలున్నాయి. ఈ మార్గాలను అనుసరిస్తే, మీరు తిరిగి బ్యాక్ లెస్ మరియు హాల్టర్ ను హాపీగా ధరించవచ్చు.

ముఖ్యంగా వేసవి సీజన్ లో ఫ్యాషనబుల్ మరియు ట్రెండీ దుస్తులు అధికంగా అదుబాటులో ఉన్నాయి. మరి వాటి ధరించాలన్నా, వేసవి వేడిని మరియు హుమిడిటీ నుండి ఉపశమనం పొందాలన్నా ఈ చిట్కాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందే. తక్షణ ప్రభావం పొందడానికి ఖరీదైనా, విలువైన ట్రీట్మెంట్స్ మరియు మందులు ఉపయోగించడ కంటే, ఎఫెక్టివ్ గా పనిచేసే హోం రెమెడీస్ ను ఉపయోగించడం ఉత్తమం. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

1. టీట్రీ ఆయిల్: 

టీ ట్రీ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాటన్ వస్త్రాన్నిఒక కట్టికి చుట్టి నీటిలో డిప్ చేసి , దాని మీద కొద్దిగా టీట్రీ ఆయిల్ వేసి వీపును అప్లై చేయాలి. తడి ఆరే వరకూ అలాగే ఉండి తర్వత దుస్తులు ధరించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2.ఆలివ్ ఆయిల్: 

ఆలివ్ ఆయిల్ ఒక నేచురల్ మాయిశ్చరైజర్ మరియు హీలర్. ఇది చర్మంలో ఏర్పడే మొటమలు మచ్చలను చాలా గ్రేట్ గా నివారిస్తుంది . కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను చేతిలోకి తీసుకొని వీపున అప్లై చేయాలి. తడి ఆరే వరకూ ఉండి, తర్వాత ఆయిల్ ఫ్రీ క్లెన్సర్ తో శుభ్రంగా తుడిచేసుకోవాలి.

3. నిమ్మరసం:

 నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని స్కార్స్ మరియు మొటిమలను, మచ్చలను నివారిస్తుంది. మరియు ఇందులో ఉండే విటమిన్ సి కొత్త చర్మాన్ని పునరుత్పత్తి చేస్తుంది.

4. చందనం మరియు రోజ్ వాటర్: 

కొద్దిగా సాండిల్ వుడ్ మరియు రోజ్ వాటర్ ను తీసుకొని పేస్ట్ చేయాలి. దీన్ని వీపు బాగానికి అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం స్నానం చేస్తే, మంచి గ్లోయింగ్ స్కిన్ మీరు పొందవచ్చు.

5. టమోటో గుజ్జు: 

టమోటోను రెండుగా కట్ చేసి గుజ్జును వీపు బాగంలో అప్ల చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుబ్రం చేసుకోవాలి.

6. వెల్లుల్లి:

 వెల్లుల్లి ఒక నేచురల్ స్కిన్ హీలర్. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని, మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మచ్చలు తొలగిపోతాయి.

7. ఆరెంజ్ పీల్: 

ఆరెంజ్ తొక్కలను ఎండలో వేసి ఎండబెట్టాలి. తర్వాత వీటిని పౌడర్ చేసి, అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి వీపు భాగానికి అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

Comments