హాట్ స్టీమింగ్ తో ఇటు అందం.. అటు ఆరోగ్యం మీ సొంతం...

ముఖం అందంగా ఉంచుకోవడానికి మరో ప్రత్యామ్నాయ మార్గం స్టీమింగ్. కత్రిమంగా తయారైనటువంటి రసాయనిక ఉత్పత్తులు ఎన్ని వాడినా.. వాటి ప్రయోజనం అంతంత మాత్రమే. అదే సహజ పద్దతులతో చేసుకొనేది ఏదైనా సరే సహజ అందాన్నే అందిస్తుంది. అందులో ఒక పద్దతే స్టీమింగ్. ముఖానికి స్టీమింగ్(ఆవిరి) పట్టడం వల్ల చర్మం ఫ్రెష్ గా తయారవుతుంది. చర్మలోని రంధ్రాలు తెరచుకొని చర్మం లోపలినుండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఫేషియల్ స్టీమింగ్ తో ఇటు అందానికి అటు ఆరోగ్యానికి రెండింటికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఖర్చులేటువంటి పద్ధతిని ఇంట్లో ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. కాబట్టి మీ చర్మాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఈ ఫేస్ స్టీమింగ్ పద్దతి ఒక సారి చేసి చూడండి తర్వాత ఫలితం మీకే తెలుస్తుంది.

ఫేస్ స్టీమింగ్ అంటే ఏమిటి? ఇది కొన్ని నిమిషాల పాటు ముఖానికి పట్టాల్సిన ఆవిరి. ఈ ఫేస్ స్టీమింగ్ ను ఎలా పట్టాలంటే ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని బాగా మరింగించి తల, ముఖం కవర్ అయ్యేట్లు టవల్ కప్పుకొని డైరెక్ట్ గా ముఖానికి ఆవిరి పట్టడం. మరి ఈ ఫేస్ స్టీమింగ్ పద్దతి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం....

చర్మాన్ని శుభ్రపరచుటలో ఇది ఒక సులభమైన బ్యూటీ పద్దతి. ఎప్పుడైతే ముఖానికి వేడిగా ఆవిరి పడుతామో అప్పుడు చర్మంలోని మతకణాలను తొలగిస్తుంది. చర్మ కణాలను తెరుచుకొనేలా చేసే తేమనందిస్తుంది. ఈ పద్దతి ద్వారా చర్మంలో పేరుకొన్న దుమ్ము, ధూళి వెలుపలికి నెట్టివేయబడుతుంది.

ఫేస్ స్టీమింగ్ తో మరి బ్యూటీ బెనిఫిట్ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఫేస్ స్టీమింగ్ ను 5-10మినిమిషాల పాటు పడితే సరిపోతుంది. ఆవిరి పట్టిన తర్వాత ముఖాన్ని బాగా రుద్దాలి. దాంతో ముఖంలో ఉన్న వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ తొలగింపబడుతుంది. అతి తక్కువ శ్రమతో ముఖంలో ఏర్పడ్డ బ్లాక్, వైట్ హెడ్స్ తొలగించి ముఖాన్ని క్లీన్ చేసి.. క్లియర్ గా కనబడేలా చేస్తుంది. ముఖంలో బ్లాక్, వైట్ హెడ్స్ తొలగించి ముఖాన్ని నునుపుగా మార్చుతుంది.

ఫేస్ స్టీమింత్ ద్వారా మరో అద్భుత మైన ఉపయోగం ఉంది. అదేంటంటే ముఖానికి ఆవిరి పట్టడం ద్వారా ముఖంలో మొటిమలతో ఏర్పడ్డ మచ్చలను తొలగిస్తుంది. ఆవిరి పట్టడం వల్ల చర్మంలోపల ఇమిడి ఉన్న నూనె గ్రంధులను తెరచుకొనేలా చేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. స్టీమింగ్ తర్వాత ముఖాన్ని స్ర్కబ్ చేయడం వల్ల ముఖ చర్మంలో ఏర్పడ్డ టాక్సిన్స్, దుమ్మును, తొలగించి నల్ల మచ్చలను మాయం చేస్తుంది. ముఖాన్ని ఫ్రెష్ గా మార్చుతుంది.

ఫేస్ స్టీమింగ్ తో ఇంకో అద్భుతమైన ఉపయోగం.. వయస్సును తెలపనియకుండా ఉపయోగపడుతుంది. నిత్య యవ్వనంగా కనబడేలా చేస్తుంది. వయస్సు పెరిగే కొద్ది చర్మంలో చాలా మార్పులు చోటు చేసుకొంటాయి. అటువంటి సమయంలో ఈ పద్దతిని పాటించడం వల్ల మత చర్మాన్ని బయటకు కనబడనియ్యకుండా చేస్తుంది. దాంతో ముఖంలో నిర్జీవత్వం మరియు వయస్సు పైబడిన వారుగా అనిపించదు.

ఫేస్ స్టీమింగ్ తో మాయిశ్చరైజర్ గా పనిచేసి పొడిచర్మాన్ని తేమగా మెరిసేలా చేసి, చర్మాన్ని బిగుతుగా ఉండేలా కాపాడుతుంది. ఒక వేళ ముఖంలో మొటిమలు ఉన్నట్లైతే ఈ ఆవిరిని 5 నుండి పది నిమిషాల లోపు మాత్రమే పట్టాలి. ఇలా వేడిగా ఆవిరి పట్టిన తర్వాత అరగంట మాటు ముఖం రిలాక్స్డ్ గా పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లటి ఐస్ క్యూబ్ తో ముఖాన్ని మర్ధన చేసుకోవాలి. హాట్ స్టీమ్ వల్ల మొటిమలు చిదిమిపోయి లోపల ఉన్న పస్(చీము)బయటకు నెట్టివేయబడుతుంది. ఇక ఐస్ క్యూబ్ తో రుద్దడం వల్ల మొటిమలతో తెరచుకొన్న రంద్రాలను మూసుకొనేలా చేస్తుంది. కాబట్టి ఒక్క రోజులో మొటిమలను పోగొట్టడంలో ఇదో మంచి పద్దతి అని చెప్పొచ్చు.!

 ఎప్పుడైతే ముఖానికి ఆవిరి పడుతారో అప్పుడు ఆ వేడికి ముఖం అంతా చెమట నీరుతో నిండిపోతుంది. ఈ నీరే చర్మాన్ని శుభ్రపరిచేలా చేస్తుంది. హాట్ స్టీమింగ్ తో డెడ్ స్కిన్ తొలగించి చర్మరంద్రాలను తెరచుకొనేలా చేసి దుమ్ము ధూళి శుభ్రపరిచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగేతందుకు ఉపయోగపడుతుంది. దాంతోనే ముఖంలో షైనింగ్ వస్తుంది. మెరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చులేనటువంటి బ్యూటీ పద్దతిని ఉపయోగించి అందంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. స్టీమింగ్ అనేది ఒక్క చర్మానికే కాదు హెయిర్ కు, బాడీకి కూడా బాగా ఉపయోగపడుతుంది. స్టీమింగ్ పద్దతులను ఉపయోగించి సంతోషంగా గడపండి.....

Comments