వేసవి వేడితాపం..ముఖం మీద మొటిమలు

ఎండ వేడికి మొటిమలు వచ్చి అవి మానిన తర్వాత నల్లటి మచ్చలుగా మారతాయి. చర్మకాంతి కూడా తగ్గుతుంది. ఈ చర్మ తత్వం ఉన్నవారు ముఖాన్ని తరచుగా చన్నీటితో శుభ్రం చేసుకుంటుండాలి. యుక్తవయస్సులో ఉండే వారు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. ఈ వయస్సులో మొటిమలు రావడం సహజం. ఒక్కోసారి యుక్త వయస్సు దాటిన వారిలోనూ మొటిమలు వస్తుంటాయి.

వీటిని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. 

1. నల్లమచ్చలు (హైపర్ పిగ్మెంటేషన్):

 ఎండలోకి వెళ్ళగానే చర్మం నల్లబడటం, ముఖ్యంగా ముఖంపై నల్లని మచ్చలు రావడం.
2. మొటిమలు:

 ఈ బాక్టీరియా, చుండ్రు, కాస్మెటిక్స్ వంటివి మొటిమలకు కారణమవుతాయి. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవడం కూడా కారణమే.

 3. చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే ఆహారంలో ప్రొటీన్‌ తో పాటు తగినంత ఫ్యాట్ కూడా ఉండేలా చూసుకోవాలి.

4. చేపలు, అవొకడో వంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఒమెగా 3, జింక్ మొటిమలను అరికడతాయి. ఈ జంక్ ఫుడ్‌ కు దూరంగా ఉండాలి. కాఫీ, ఆల్కహాల్, రెడీ మీట్, వేయించిన పదార్థాలను తీసుకోకూడదు.

5. రోజూ ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తీసుకుంటే విటమిన్-ఎ తగినంత అందుతుంది. బ్రొక్కోలి, క్యాలీఫ్లవర్, పాలకూర రోజూ మెనూలో ఉండేలా చూసుకోవాలి.

6. వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తాగుతుంటాం. అలాగే కొన్ని చిట్కాల ద్వారా సౌందర్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. చల్లని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే అలసిన ముఖం కాంతివంతంగా మారుతుంది.

7. వేసవి కాలంలో రెండు సార్లు స్నానం చేయాలి. అలా చేయక పోతే చెమట పడుతుంది. స్నానం చేసి టాల్కం పౌడర్ రాసుకోవాలి. దీంతో చెమట పొక్కులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

8. శరీరానికి రాసుకొనే మంచి సన్ స్క్రీన్ లోషన్ సెలక్ట్ చేసుకోవాలి.

Comments