మన ఇంటి పెరట్లో దొరికే బొప్పాయి ఆరోగ్యానికే కాదు..అందానికీ మేలు చేస్తుంది. చర్మానికి అందంతో పాటు ఆరోగ్యానికి పండ్లు చాలా ఉపయోగపడుతాయి. ప్రతి నిత్యం మనం మార్కెట్‌లో ఏదో ఒక రకం పండ్లు కొంటాం. ఆ పండ్ల తోలు, గుజ్జు మనకు ఎంతో ఆరోగ్యం కలుగ చేస్తుంది. పండ్లలో విటమిన్లు, మినరల్స్ కార్బోహైడ్రేట్స్, పీచు పదార్ధములతో బాటు- 'ఆంటి ఆక్సిడన్స్' అనేది అధికంగా వుండడం వల్ల - చర్మ సౌందర్యాన్ని కాపాడి చర్మ వ్యాధులను నివారిస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడే పండ్లలో బొప్పాయి ఒకటి. దీనిలో ఎ.ఇ.సి. విటమిన్లు వున్నందున చర్మాన్ని కాపాడడంతోబాటు మృదుత్వాన్ని రక్షిస్తుంది. దీనితో తయారు చేసిన నూనె, చర్మానికి శుభ్రంగా ఉంచుతుంది. బొప్పాయి జ్యూస్ సూర్యరశ్మి వల్ల వచ్చే మచ్చలను నివారించడమే కాకుండా శరీరానికి రక్షణనిస్తుంది. మరి సౌందర్యాన్ని ద్విగుణీకతం చేసే ఈ బొప్పాయి. ప్రయోజనాలు తెలుసుకుందాం
1. ఎండాకాలంలో బొప్పాయి చాలా మంచిది. ఇది మంచి ఫేస్ ప్యాక్‌గా పనిచేస్తుంది. రెండు బొప్పాయి గుజ్జుకుకు ఒక తేనె, గుడ్డులోని తెల్లసొన తీసుకుని కలుపుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఆగి కడిగేయాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
2. పచ్చిబొప్పాయి చెక్కు తీసి చిన్న ముక్కను తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో నాలుగు చుక్కల వెనిగర్, కొద్దిగా నీళ్లు కలిపి ముఖానికి మర్దన చేసుకొని కడిగేస్తే చర్మం శుభ్రపడుతుంది. ఇది చక్కని క్లెన్సర్ లా పనిచేస్తుంది.
3. చర్మం బరకగా ఉంటే బొప్పాయి గుజ్జును రాసి కొద్దిసేపయ్యాక నీళ్లతో తడిపి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మదత్వాన్ని సంతరించుకుంటుంది. బొప్పాయి కలిపిన ముల్తానీ మట్టితో తరచూ పూత వేసుకోవడం వల్ల ముడతలను సమస్య నియంత్రణలో ఉంచవచ్చు
4. బొప్పాయి, అరటి గుజ్జు సమపాళ్లలో తీసుకొని రాత్రిపూట ముఖానిక మర్దన చేసి పావుగంటయ్యాక కడిగి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మర్నాటికి చర్మం మెత్తబడి, రోజంతా తాజాగా కనిపిస్తుంది.
5. అరటిపండు, బొప్పాయి, యాపిల్ పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
6. జిడ్డు చర్మం వాళ్లు.. బొప్పాయి, వేప, ముల్తాన్ మట్టి, కచ్చుర్ సుగంధీ పౌడర్‌ను రోజువాటర్‌తో మిక్స్ చేసి ముఖానికి అపె్లై చేయాలి. 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు తగ్గడమే కాదు, మొటిమలు తగ్గుతాయి.
7. బొప్పాయి, కచ్చుర్ సుగంధీ పౌడర్, ముల్తాన్ మట్టి, ఛాయపసుపు, గులాబీ పౌడర్‌లను రోజ్‌వాటర్‌లో వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20నిమిషాల తర్వాత కడిగితే పిగ్మెం మొటిమల మచ్చలు తగ్గుతాయి. అయితే ఇలా వారానికి మూడు సార్లు తప్పనిసరిగా చేస్తేనే ఫలితం ఉంటుంది.
8. కొంత మందికి చర్మం గరుకుగా ఉంటుంది. ఇటువంటి వారి చర్మాన్ని కూడా మృదువుగా మార్చ గల గుణం బొప్పాయిలో ఉంది. బొప్పాయి తొక్కను తీసి ఓ గిన్నెలో వేసి ఉడికించి దానిని మెత్తగా నూరి ముఖానికి రాసి పదిహేను నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా ముఖం కోమలత్వాన్ని సంతరించుకుంటుంది.

Comments
Post a Comment