డ్రై స్కిన్ తగ్గించుకోవడానికి ఓట్ మీల్ ఏవిధంగా ఉపయోగపడుతుంది

ప్రతి మూడు నెలలకొకసారి సీజన్ మారుతుంటుంది. చల్లని, లేదా పొడి గాలులు వీచినప్పుడు మొదట చర్మం , జుట్టు మీద ప్రభావం చూసుతుంది. ముఖ్యం చర్మం చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. డ్రైగా మారుతుంది. చర్మం మీద పొలుసుల్లాంటివి ఏర్పడుతాయి. చర్మం దురద పెడుతుంది. చర్మం డ్రైగా మారుతుంది. డ్రై గా మారిన చర్మానికి తగిన తేమను అందిస్తే పొడి చర్మ సమస్య ఉండదు.

 వయస్సైన వారే కాదు, టీనేజర్స్ కూడా డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నారు. వయస్సైన వారిలో పొడి చర్మం ఏర్పడటం సహజం. కానీ టీనేజర్స్, మద్యవయస్కుల్లో డ్రై స్కిన్ కు కారణం వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఎక్కువ నీళ్ళు తాగకపోవడం వంటివి డ్రై స్కిన్ కు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితి వింటర్లో ఎక్కువగా ఉంటుంది.
డ్రై స్కిన్ తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల లోషన్స్, మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తుంటారు. ఇవి తాత్కాలిక ఫలితం మాత్రమే అందిస్తుంది. అయితే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలంటే, కొన్ని న్యాచురల్ రెమెడీస్ ను ప్రయత్నించాలి. అటువంటి న్యాచురల్ రెమెడీస్ లో ఓట్ మీల్ ఒకటి.

 ఓట్ మీల్లో మాయిశ్చరైజింగ్ లక్షణాలు, యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ చర్మానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. ఏ సీజన్లో అయినా చర్మాన్ని కాపాడుతాయి. ఓట్ మీల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చర్మ సంరక్షణ కోసం ఓట్ మీల్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

1. మాయిశ్చరైజింగ్ ఓట్ మీల్ క్రీమ్

ఇది హోం మేడ్ ఓట్ మీల్ క్రీమ్. ఇది చర్మానికి తగిన తేమను అందిస్తుంది.

 కావల్సిన వస్తువులు: 

ఓట్స్ : 1/2 cup
కోకనట్ ఆయిల్ -3/4th cup
 ల్యావెండర్ ఆయిల్ -5 drops

 పద్దతి: 

1. ఓట్స్ ను మెత్తగా పౌడర్ చేయాలి.
2. తర్వాత కొబ్బరి నూనెను వేడి చేయాలి.
 3. కొబ్బరి నూనె వేడి అయ్యాక స్టౌ మీద నుండి దింపు అందులో ఓట్ మీల్ పౌడర్ ను వేయాలి. 4. ఉండలు కట్టకుండా కంటిన్యూగా కలుపుతుండాలి.
 5. తర్వాత ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేయాలి.
6. ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో వేసి నిల్వ చేసుకుని, దీన్ని రెగ్యులర్ క్రీమ్ లా ఉపయోగించుకోవాలి.

2. ఓట్ మీల్ మరియు అరటి మాస్క్ :

 అరటిపండ్లులో మాయిశ్చరైజింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఓట్ మీల్ తో కలపడం వల్ల మాయిశ్చరైజింగ్ లక్షణాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి.

కావల్సినవి: 

-1 cup ఓట్ మీల్
 -1 బాగా పండిన అరటిపండు
 -2 టేబుల్ స్పూన్ గోరువెచ్చని పాలు

 పద్దతి: 

1. ఓట్ మీల్ ను మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
2. తర్వాత అరటి పండును మెత్తగా చేసి, అందులో ఓట్ మీల్ పౌడర్ ను కలపాలి.
 3. ఈ మిశ్రమంలో గోరువెచ్చని పాలను కలిపి డ్రై స్కిన్ కు అప్లై చేయాలి.
 4. అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. ఓట్ మీల్, తేనె ప్యాక్ :

 తేనెలో తేమను అందించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది డ్రై స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కావల్సినవి:

 -1/2 cup ఓట్ మీల్ పౌడర్
-1 cup పాలు
 -1 tsp తేనె

 పద్దతి: 

1. పాలలో ఓట్ మీల్ పౌడర్ ను కలపాలి.
 2. రెండు నిముషాలు అలాగే ఉంచాలి.
3. తర్వాత తేనె మిక్స్ చేసి డ్రై స్కిన్ కు అప్లై చేయాలి.

4) ఓట్ మీల్ బాత్ : 

ఓట్ మీల్ బాత్ వల్ల చర్మం కాంతివంతంగా మరియు తేమగా తయారవుతుంది.

 కావల్సినవి :

 -1 cup పాలు
 -2 cups ఓట్ మీల్ పౌడర్
-1 tbsp తేనె

వేసుకునే విధానం: 

1. స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.
 ఇందులో కలిపి ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపినప్పుడు, స్కిన్ మరింత డ్రైగా మార్చుతుంది.
 2. కాబట్టి, పైన సూచించిన పదార్థాలను స్నానం చేసే నీళ్ళలో వేసి కలపాలి. 15-20 నిముషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది.






Comments