టమోటాలతో ఆరోగ్యంతోపాటు..అందమైన చర్మం మీ సొంతం!

టమోటాలు రుచికరంగా ఉంటాయి. జీర్ణక్రియకు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఉదరానికి సంబంధించి సమస్యలుంటే దివ్యౌషదంలా పనిచేస్తాయి. అంతేకాదు అధిక రక్తపోటుకు టమోటాలతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.


 టమోటోలోని అద్భుతమైన సౌందర్య గుణగణాలు 

సోఫియా నారాంగ్, వెల్నెస్ ఎక్స్ పర్ట్ ఓరిప్లేమ్ ఇండియా మరియు మెహర్ రాజ్ పుట్ జిమ్ మరియు న్యూట్రిషన్, డైటిస్ట్, ఫిట్నెస్ స్టూడియోల్లో టమోటాల వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి వివరించారు.

విటమిన్స్ & న్యూట్రీషియన్స్ ఎక్కువ:

 టమోటాలో విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, ఫోలెట్, పొటాషియంతోపాటు ఇతర న్యూట్రియెట్స్ కూడా ఉన్నాయి. ఒక మీడియం టమోటా 22కిలో కేలరీలతో సమానంగా ఉంటుంది. ఇందులో జీరో శాతం కొవ్వు, 5 గ్రాముల కార్బోహైడ్రేట్, 1 గ్రాము ఫైబర్, 1గ్రాము ప్రొటిన్, 5గ్రాముల సోడియం ఉంటుంది.

కంటి ఆరోగ్యానికి టమోటోలు:

 టమోటాలో లైకోపీస్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది టమోటాను ఎరుపు రంగులో ఉంచుతుంది. అంతేకాదు టమోటాలో హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు కళ్లకు ఎంతో మేలు చేస్తాయి.

బ్యూటీ కోసం టమోటోలు:

 టమోటాలో స్కిన్ కు సంబంధిచిన హై బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్ఫా-బీటా కెరోటిన్, లుయూటిన్ మరియు లైకోపీన్ వంటి ప్రధాన కేరోటినాయిడ్లన్నింటినీ కలిగి ఉన్న టొమోటోస్ మీ చర్మం, ముఖం, జుట్టు కోసం అత్యంత ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

 టమోటాలలో ఇమిడి ఉన్న సర్ ప్రైజింగ్ బ్యూటీ సీక్రెట్స్


టమోటో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది:

 వీటిలో లైకోపీస్ అత్యుత్తమ యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీని కలిగి ఉంది. ఇది ఒక అద్భుతమైన సహజ రక్తస్రావ నివారిణిగా సహాయపడుతుంది. లైకోపీన్ యొక్క అధిక కంటెంట్ తో ఆహారాన్ని ఉపయోగించడం ద్వారా టమోటాలు UV-A ఎక్స్పోజర్ల నుంచి చర్మంకు కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

టమోటో బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది: 

టమోటాలు మీ ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్ ను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో టమోటా ముక్కతో మర్దన చేయండి.

టమోటో సన్ ట్యాన్ నివారిస్తుంది:

 ఎండలో తిరగడం వల్ల ముఖానికి మురికి పట్టడం సహజం.దీంతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యకు టమోటాతో చెక్ పెట్టొచ్చు. స్కిన్ కు టమోటా గుజ్జు మంచి ఔషదంలా పనిచేస్తుంది. టమోటా గుజ్జును మీ ముఖంపై అప్లై చేసి 15నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి. టమోటా గుజ్జు మీ స్కిన్ టోన్ రిపేర్ చేయడంతో పాటు రిఫ్రెష్ చేస్తుంది.

టమోటో మొటిమలను నివారిస్తుంది:

 మొటిమలను తొలగించడంలో టమోటాలు కీలకపాత్ర పోషిస్తాయి. మిటమిన్ ఏ, సి, కె మరియు ఆమ్లధర్మాల లక్షణాలు మీ ముఖంపై ఉన్న మొటిమలను తొలగించడంలో సహాయపడుతాయి. జస్ట్ మీ ముఖంపై పల్ప్ అప్లై చేయండి. 10నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. ఫలితం మీరే చూస్తారు. 

మిమ్మల్ని అందంగా మార్చే డిఫరెంట్ టమోటో ఫేస్ మాస్క్ చిట్కాలు

టమోటోలు అధిక రక్తపోటును తగ్గిస్తుంది:

 టమోటాలో పొటిషియం పుష్కలంగా ఉంటుంది. రోజువారీ మీ ఆహారంలో టమోటాలను చేర్చడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఆహారంలో తగిన మొత్తంలో పొటాషియం లేకుంటే...మీ ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. ఒక పెద్ద టమోటాలు 431 mg పొటాషియంతో సమానంగా ఉంటాయి. రోజువారీ అవసరానికి 10శాతం అవసరమవుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను విచ్చిన్నం చేస్తుంది:

 టమోటోల్లో కేలరీలు తక్కువగా ఉండటంతోపాటు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉన్నందున బ్యాడ్ కొలెస్ట్రాల్ ను విచ్చిన్నం చేస్తుంది.











Comments