అందంగా ఉండాలంటే.. రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగండి..

అందంగా ఉండాలంటే.. రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగండి అంటున్నారు బ్యూటీషన్లు. నీరు శరీరంలోని మలినాలను వెలివేయడం ద్వారా శరీరాన్ని సంరక్షిస్తుంది. అలాగే కలబంద అందానికి మరింత వన్నె తెస్తుంది. కలబందను ముఖానికి పట్టించాలి, ఒకవేళ మీ ఇంట్లో కలబంద లేకపోతే దగ్గర్లో ఉన్న మందుల షాపులో దొరికే కలబంద జల్ లేదా జూస్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. కలబందతో పాటు ఐస్ ముక్కలు తీసుకుని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

ఇకపోతే, రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవాలి. వెల్లుల్లి మన చర్మంలోని జీవకణాలకు ఉత్తేజాన్నిస్తుంది. చర్మాన్ని తాజాగా.. యవ్వనంగా ఉంచుతుంది. అలాగే నిమ్మరసం, తేనె మన చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది.

రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఈ రెంటిని కలిపి, ముఖానికి పట్టించి, ఒక 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి, ఇలా రోజు చేస్తే మెరుగైన చర్మం పొందుతారు. రోజూ నారింజ రసం తాగడం ఎంతో మంచిది. ఇందులో విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా ఉంచుతుంది.

Comments