ఒక చిట్కా, రెండు ఉపయోగాలు... ముఖం తేజస్సుతో వెలిగి పోతుంది, మృదువుగా మారిపోతుంది...

ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో, మనుష్యులు తమ శరీరాకృతికి, అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మొహం బాగా తేజస్సుతో కనపడాలని, మృదువుగా ఉండాలని మార్కెట్లో లభించే వివిధ రసాయనాలతో కూడిన క్రీములను, పేస్ ప్యాక్ లను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ముఖానికి వాడేస్తున్నారు. వీటి వల్ల ఎన్నో దుష్ప్రభావాలు మనకు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

 అందుకు ప్రత్నామ్యాయంగా సహజ సిద్ధంగా, మన వంటింట్లో వస్తువులను ఉపయోగించి పేస్ ప్యాక్ తో పాటు, చర్మం మృదువుగా అవ్వడానికి ఒకే చిట్కాను సూచించారు. ఇది చాలా అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు.
నిపుణులు చెబుతున్న ఈ చిట్కా వినడానికి కొత్తగా ఉన్నా, ఆచరించడం ద్వారా మాత్రం ఎన్నో లాభాలు కలుగుతాయి.
 మొదట కొన్ని పదార్ధాలను ఉపయోగించి పేస్ ప్యాక్ ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావలసినప్పుడు మరి కొన్ని పదార్ధాలను అందులో కలపడం ద్వారా చర్మాన్ని మృదువుగా ఉంచే పానీయం తయారవుతుంది. పైన చెప్పిన రెండు అవసరాలకు కలిపి ఈ ఏకైక మిశ్రమమే ఉపయోగపడుతుంది. వీటి తయారీకి కొన్ని ఎక్కువ పదార్ధాలు అవసరపడతాయి, వాటిని మిశ్రమంగా చేయడానికి మిక్సీ ఖచ్చితం గా ఉండాలి.

 వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసే ఫేస్ ప్యాక్స్ 

ఈ మిశ్రమం తయారి పద్దతి లో అతి ముఖ్యమైన పదార్ధం పెరుగు. దీనికి మరిన్ని పదార్ధాలు కలపడం ద్వారా పేస్ ప్యాక్ తో పాటు, చర్మాన్ని మృదువుగా ఉంచే పానీయం తయారవుతుంది.
 ఈ మిశ్రమం తయారైన తర్వాత ముఖానికి రాసుకొని, అది బాగా ఆరిపోయే వరకు అలానే ఉంచి తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా, అది మీ ముఖానికి కొత్త మెరుపుని తీసుకొస్తుంది.
 ఈ పేస్ ప్యాక్ మరియు చర్మాన్ని మృదువుగా ఉంచే పానీయం తయారీ విధానం :

 పేస్ ప్యాక్ తయారీకి కావలసిన పదార్ధాలు:

 ఒక కప్పు గడ్డ పెరుగు,
 నిమ్మరసం,
 రెండు టేబుల్ స్పూన్ ల ముడి తేనె ,
 ఒక మిక్సీ.
 బాదంతో వివిధ రకాల ఫేస్ ప్యాక్ లతో బ్యూటిఫుల్ అండ్ గ్లోయింగ్ స్కిన్

పేస్ ప్యాక్ తయారీ విధానం:

 రెండు టేబుల్ స్పూన్ ల గడ్డ పెరుగు తో పాటు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, దానితో పాటు రెండు టేబుల్ స్పూన్ ల ముడి తేనెను ముందుగా మిక్సీ ఉపయోగించి మిశ్రమం గా చేయాలి.
 ఆ మిశ్రమం మందంగా గనుక ఉంటే దానికి తగినంత నిమ్మరసం కలిపి పలచన చేయాలి.
ఇలా తయారయిన మిశ్రమం నుండి ఒక టేబుల్ స్పూన్ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని, దానికి ఒక చిటికెడు పసుపుని కలపాలి.
ఇప్పుడు మనకు కావల్సిన పేస్ ప్యాక్ తయారయ్యింది. ఇలా తయారయిన మిశ్రమాన్ని పేస్ ప్యాక్ లా వాడుకోవచ్చు.
 చర్మాన్ని మృదువుగా ఉంచే పానీయం తయారీకి కావాల్సిన పదార్ధాలు :
 అరటి పళ్ళు,
 బాదం పాలు

 తయారీవిధానం : 

ముందుగా అరటి పండుని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పైన చెప్పిన, పసుపు కలపని మిశ్రమానికి , ఈ అరటి పండు ముక్కలతో పాటు, బాదం పాలు కలపి మిక్సీ చేయాలి.
అవసరమైతే కొద్దిగా చక్కెర వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీ చర్మాన్ని మృదువుగా ఉంచే పానీయం తయారైపోయినట్లే. కావాలంటే ఈ పానీయాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, కొద్దీ సేపటి తర్వాత త్రాగ వచ్చు.

 ముఖ్య గమనిక :

 పేస్ ప్యాక్ ని గాని, పానీయాన్ని గాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడుకోవడం మంచిది. భద్రపరిచి, తర్వాత ఉపయోగించుకోవాలనుకుంటే కుదరదు. ఆ మిశ్రమం గాని, పానీయం గాని తయారు చేసిన తర్వాత, సమయం గడిచే కొద్దీ చెడిపోయే అవకాశాలు ఎక్కువ.



Comments