మన వంటింట్లోనే అందానికి కావలసిన రహస్యం దాగివుంది. కాని వాటిలోనుంచి మన శరీరానికి సంబంధించినంత వరకు వాడం. మన వంటింట్లో ధాన్యాలు, పండ్లు, కాయగూరలుంటాయి. వాటితో మీ శరీర సౌష్టవం పెరిగేలా చేసి, అందంగా ఉంచేలా కొన్ని చిట్కాలు మీ కోసం :-
** మీ శరీర చర్మం ఆయిలీగా ఉంటే రోజ్ వాటర్‌లో బేసన్ కలిపి ముఖం, శరీరంపై పూతగా పూయండి. కాసేపయ్యాక స్నానం చేయండి.
** పసుపు పొడిని వెన్నతో కలిపి ముఖానికి పేస్ట్‌లా పూసుకుంటే చర్మం మృదువుగా మారి నున్నగా తయారవుతుంది.
** మీగడ, బేసన్ లేదా పెరుగును కలిపి అరగంట వరకు వెంట్రుకలకు పూసి ఉంచండి. ఆ తర్వాత వెంట్రుకలను గోరువెచ్చని నీటితో కడిగేయండి.
** గోధుమ పిండిని పాలలో కలుపుకుని మీ ముఖంపై పూయండి. దీంతో చర్మ రంగులో నిగారింపు వస్తుంది.
** పాలలో బుడ్డశెనగలను నానబెట్టి దానిని త్రాగండి. ఆ తర్వాత అందులో కాసింత పసుపు పొడిని కలిపి ముఖానికి రాయండి.
** బేసన్‌లో మీగడ, పసుపు పొడి, పెరుగును కలిపి మీ శరీరమంతా పూయండి. కాసేపయ్యాక స్నానం చేయండి. దీంతో చర్మం కోమలంగా నిగనిగలాడుతుందని ఆయుర్వేద వైదగ్యులు తెలిపారు.

Comments
Post a Comment