ఈ సింపుల్ రెమెడీస్ తో మొటిమలు తగ్గడం కొంచెం ఆలస్యం కావచ్చు,.కానీ పక్కా తగ్గిపోతాయి

పొద్దున్నే ముఖాన్ని అద్దంలో చూసుకుంటే.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన మొటిమ వెక్కిరించిందనుకోండి.. చాలా కోపం వస్తుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తే ముఖం నిండా మొటిమలు వచ్చేస్తాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
 మొటిమలను తగ్గించుకోవడానికి చర్మ తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలాంటి ఖర్చులేకుండా మొటిమలను తగ్గించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ ను ఇంట్లో ప్రయత్నించి టెస్ట్ చేయబడినవి.

మరి ఆలస్యం చేయకుండా, ఎలాంటి అనుమానం కానీ, టెన్షన్ కానీ లేకుండా ఈ క్రింది సూచించిన పింపుల్ రెమెడీస్ ను ఫాలో అయిపోండి. ఈ నేచురల్ రెమెడీస్ తో మొటిమలు తగ్గడం కొంచెం ఆలస్యం అవ్వొచ్చు. అయితే ఫలితం మాత్రం ఎఫెక్టివ్ గా ఉంటుంది..

 15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై

1. ఐ డ్రాప్స్ :

 కళ్ళు చీకాకు, రెడ్ నెస్, నీళ్ళు కారడానికి ఉపయోగించే కంటి చుక్కలను మొటిమలకు అప్లై చేస్తే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.

2. వేప పేస్ట్ :

 ముదురు వేపాకు ఆకులు, తులసి ఆకులను మరిగే నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. నీళ్లు తక్కువ ఉండేలా చూసుకుంటే మంచిది. బాగా ఉడికిన తరువాత ఆ నీటిని చల్లబరిచి.. దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. మొటిమలు పెరగవు. ముఖం మీద కూడా ఎటువంటి అలర్జీలు రావు.అలాగే ఫ్రెష్ గా ఉండే వేప ఆకులను పేస్ట్ చేసి మొటిమల మీద అప్లై చేయాలి.

 మొటిమల నివారణకు నిమ్మరసం ఉపయోగించే పద్దతులు!

3. ఆల్కహాల్ రుద్దడం: 

ఆల్కహాల్లో ఉండే బెంజెలైట్ మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా పోగొడుతుంది. అందువల్ల ఆల్కహాల్లో కొద్దిగా కాటన్ డిప్ చేసి మొటిమల మీద అప్లై చేసి మర్ధన చేయాలి. ఇలా రోజులో మూడు నాలుగు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది యాంటీ సెప్టిక్ లా పనిచేసి, మొటిమలను తగ్గిస్తుంది.

4. తులసి, గందం మాస్క్ :

 పచ్చటి తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి.. గట్టిగా నలిపి పిండితే రసం వస్తుంది. ఆ రసానికి రెండు మూడు చుక్కల నిమ్మరసం కలపాలి. అలా తయారుచేసిన మిశ్రమాన్ని మొటిమల మీద రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే తులసి ఆకు రసంలో గందం పొడి, రోజ్ వాటర్ వేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5. చమోమొలీ టీ :

 చమోమొలీ టీ ని అన్ని రకాల చర్మతత్వాలకు అప్లై చేసుకోవచ్చు. కాటన్ తీసుకుని, టీలిక్విడ్ లో డిప్ చేసి మొటిమల మీద అప్లై చేయాలి. దీన్ని ప్రతి సారి ఫ్రెష్ గా తయారుచేసుకోవాలి. మొటిమలను నివారించడంలో బెస్ట్ హోం రెమెడీ. దీన్ని అప్లై చేయడానికి ముందు కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టి తర్వాత వాడుకోవచ్చు.

5. ముల్తానీ మట్టి, కర్పూరం, రోజ్ వాటర్ 

ఈ కాంబినేషన్ హోం రెమెడీ, అన్ని రకాల చర్మ తత్వాలకు సహాయపడుతుంది. ముల్తానీ మట్టిలో కర్పూరం మిక్స్ చేసి, రోజ్ వాటర్ తో పేస్ట్ లా చేసి, మొటిమల మీద అప్లై చేయాలి. మిగిలితే దీన్ని ఫ్రిజ్ లో కూడా నిల్వచేసుకోవచ్చు.

 మచ్చలు పడకుండా మొటిమలు నివారించే హెర్బల్ రెమెడీస్..!

6. జాజికాయ పౌడర్, పాలు : 

ఈ రెండు పదార్థాలు మొత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మొటిమల మీద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రాత్రుల్లో అప్లై చేసుకుని ఉదయం నీళ్ళతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
7. పుదీపా :
 మొటిమలు లేని ముఖ అందం కోరుకునే వారు పుదీనా వాడుకోవచ్చు. ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులతో మొత్తగా పేస్ట్ చేసి, మొటిమల మీద నేరుగా అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.









Comments