మీ ఏజ్ ను బట్టి చర్మ రక్షణకు ఉపయోగించాల్సిన ఫేస్ ప్యాక్స్ అండ్ న్యాచురల్ రెమెడీస్

సహజంగా మన చర్మం ఒక్కో వయస్సులో ఒక్కో విధంగా మారుతుంది. కాబట్టి, చర్మ సంరక్షణ అనేది చాలా ముఖ్యం. మీ ఏజ్ ను బట్టి చర్మ రక్షణకు ఉపయోగించాల్సిన ఫేస్ ప్యాక్స్ అండ్ న్యాచురల్ రెమెడీస్

 చర్మం తత్వం, చర్మం ఆకారం మన వయస్సును తెలుపుతుంది. టీనేజ్ లో ఉన్నప్పుడు చర్మంలో మొటిమలు ఎక్కువగా బాధిస్తాయి. ఆ వయస్సులో మొటిమలను టార్గెట్ చేసి చర్మానికి రక్షణ కల్పించి కాపాడుకోవాలి.

 అదే విధంగా 30 ఏళ్ళలో వయస్సు పెరిగే లక్షణాలు చర్మంలో ప్రారంభం అవుతాయి. ఈ లక్షణాలను కూడా నివారించుకోవాలి.
మరి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అంటారా?. చర్మ సంరక్షణకు న్యాచురల్ రెమెడీస్ చాలానే ఉన్నాయి. ఇవి అనేక చర్మ సమస్యలను నివారిస్తాయి. ఇవి చర్మ సమస్యలను ఎఫెక్టివ్ గా నివారించడం మాత్రమే కాదు. చర్మ సమస్యలకు కారణమయ్యే వాటిని కూడా తొలగిస్తాయి.

మార్కెట్లో అందుబాటులో ఉండే అనేక సౌందర్య ఉత్పత్తులు అసాధారణమైనవి, వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. తాత్కాలిక ఉపశమనం కలిగించి తిరిగి సమస్యను పెద్దది చేస్తాయి. కాబట్టి, చాలా వరకూ మహిళలు వయస్సు రిత్యా ఎదుర్కొనే చర్మ సమస్యలను నివారించుకోవడానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్ ను మీకు పరిచయం చేస్తున్నాము.ఇవి చర్మంను సాఫ్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతాయి.

 వయసును బట్టి వక్షోజాల్లో మార్పులకు అసాధారణమైన సంకేతాలు..!

1. 18-20 ఏళ్ళు వయస్సు వారు:

 ఇది యుక్త వయస్సు . ఈ వయస్సులోని వారు ఎక్కువగా మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలకు ఆయిల్ స్కిన్ కూడా ఒక కారణం కాబట్టి, ఆయిల్ స్కిన్, మొటిమలను నివారించే చర్మంను స్మూగ్ తా మార్చే రెమెడీ ఒకటి ఉంది.

గ్రీన్ టీ

 గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి మొటిమలను నివారిస్తాయి. చర్మంలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా నివారిస్తాయి. మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా తొలగిస్తుంది. ఈ క్రింది సూచించిన చిట్కాను అనుసరించడంతో పాటు, రోజూ గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి

 కావల్సిన వస్తువులు: 

గ్రీన్ టీ బ్యాగ్
1 ఒక కప్పు నీళ్ళు
పద్దతి:
 1.వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ ను వేసి 10, 15నిముషాలు అలాగే ఉంచాలి.
 2. బ్యాగ్ తీసి, తర్వాత చల్లార్చాలి.
 3. ఈ గ్రీన్ టీలో కాట్ ముంచి, ముఖం మొత్తం అద్దాలి.

2)20-25 వయస్సు మద్య:

 20 నుండి 25 ఏళ్ళ మద్య వయస్సున్నవారిలో మొటిమలు తరచుగా బాధిస్తుంటాయి. అయితే డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్ ఎక్కువ. ఎక్కువ ఎండలో తిరిగినా కూడా చర్మంలో మొటిమలు, నల్ల మచ్చలు బాధిస్తాయి.

 డార్క్ స్పాట్స్, సన్ డ్యామేజ్ అయిన చర్మానికి న్యాచురల్ రెమెడీస్ బాగా పినచేస్తాయి. మీరు స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు. అందుకు నిమ్మరం, తేనె, పసుపు వంటివి బాగా పనిచేస్తాయి.

నిమ్మరసం, తేనె, పసుపు ఫేస్ ప్యాక్ :

 నిమ్మరసంలో ఉండే విటమిన్ సి స్కిన్ బ్రైట్ గా మార్చుతుంది. తేనె బ్లీచింగ్ ఏజెంట్, డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంలో ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది.

 కావల్సిన వస్తువులు:

 నిమ్మకాయ: 1
తేనె: ఒక టేబుల్ స్పూన్
 నపెనె: అరటేబుల్ స్పూన్
 తయారుచేయు పద్దతి:
1. ఒక బౌల్ తీసుకుని పైన సూచించిన పదార్థాలన్నింటి వేసి పేస్ట్ లా కలుపుకోవాలి.
 2. ఈ పేస్ట్ ను ను ముఖానికి అప్లై చేసి 15నిముషాలు అలాగే ఉండాలి,
3. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 మేనికాంతిని పెంచే 9 యోగ భంగిమలు 

3. 25-30 ఏళ్ళ మద్య ఉన్నవారు:

 25-30ఏళ్ళ మద్య ఉన్నవారు, రోజూ చర్మ సంరక్షణ కోసం తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. ఏజింగ్ లక్షణాలకు కారణమయ్యే నల్ల మచ్చలు, చారలు, ముడుతలను చర్మంలో ఎప్పటికప్పుడు కనబడకుండా నివారించుకోవాలి.

 ఏజింగ్ లక్షణాలను నివారించుకోవడానికి , చర్మం యవ్వనంగా, స్మూత్ గా కనబడటానికి ఒక న్యాచురల్ రెమెడీ ఉంది

 ఆలివ్ ఆయిల్ మరియు ఎగ్ వైట్ 


ఆలివ్ ఆయిల్లో ఓమేగా 3 ఫ్యాటయాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది చర్మంను తేమగా మార్చుతుంది.ఎగ్ వైట్ చర్మం టైట్ గా మార్చి, ముడతలను, చారలను నివారిస్తుంది.

 కావల్సిన వస్తువులు:

 ఆలివ్ ఆయిల్: 
ఒక టీస్పూన్ ఎగ్ వైట్ :
 1 పద్దతి: 
1. ఆలివ్ ఆయిల్, ఎగ్ వైట్ ఒక బౌల్లోనికి తీసుకుని మిక్స్ చేయాలి.
 2. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి
 3. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.
 4. ఈ రెమెడీని వారంలో రెండు సార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. 30ఏళ్ళ యస్సు వారు చర్మ సంరక్షణ

 వయస్సు పెరిగే కొద్ది చర్మం డ్రైగా , డల్ గా మారుతుంది. రెగ్యులర్ గా స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకోవడం చాలా అవసరం. స్కిన్ మాయిశ్చరైజ్ చర్మంను స్మూ్త్ గా మార్చుతుంది. ముడుతలు లేకుండా చేస్తుంది.
 న్యాచురల్ రెమెడీస్ చర్మంను ఎక్స్ ఫ్లోయేట్ చేసి, చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది.
 ఈ హోం రెమెడీకి తేనె, పంచదార, బ్లూబెర్రీ అవసరం అవుతాయి. మచ్చలను కనబడనివ్వకుండా చేస్తాయి. కావల్సినవి:
 అరకప్పు ఫ్రెష్ గా ఉండే బ్లూ బెర్రీస్ 
రెండు టేబుల్ స్పూన్ల తేనె 
ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్
 పద్ధతి:
 1. పైన సూచించిన పదార్థాలన్నింటిని బ్లెండర్ లో వేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. 
2. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 10నిముషాలు అలాగే ఉంచాలి. 
తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. 

25 ఏళ్లు వచ్చాయంటే.. కంపల్సరీ పాటించాల్సిన బ్యూటీ రూల్స్..!

5. 40ఏళ్ళలో చర్మ సంరక్షణ:

 40ఏళ్ళలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గితుంది. దాని వల్ల చర్మంలో ఎలాసిటి తగ్గుతుంది. చర్మం వదులుగా కనబడుతుంది. చర్మం డ్రైగా మారి, ముడతలను పెంచుతుంది. కాబట్టి, డైట్ లో విటమిన్ ఎ ఆహారాలను ఎక్కువగా చేర్చుకోవాలి. దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది. చర్మం స్మూత్ గా మార్చుతుంది. అలోవెర, బాదం రెండూ చర్మంను స్మూత్ గా మార్చుతుంది చర్మంలో చారలను తొలగిస్తుంది:

 కావల్సిన వస్తువులు: 

4-5 బాదంలను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టాలి.
 1 ఫ్రెష్ అలోవెర 
పద్దతి:
 4-5 బాదంలను పేస్ట్ చేయాలి. 
కలబంద కట్ చేసి, అందలోని జెల్ తీసుకోవాలి. 
ఈ రెండూ మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి.
 30 నిముషాల తర్వాత చన్నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.






Comments