జుట్టు పట్టు కుచ్చులా తయారవ్వాలంటే? హెయిర్ మాయిశ్చరైజ్ అప్లై చేయాలి!

జుట్టును ఎల్లప్పుడు ఆరోగ్యంగా, మాయిశ్చరైజర్ గా ఉంచుకోవడం వల్ల జుట్టు అందంగా కనబడుతుంది. అయితే తలలో మాయిశ్చరైజర్ కోల్పోతే జుట్టు బలహీనంగా మారుతుంది, దాంతో జుట్టు డ్రైగా, చిట్లడం జరుగుతుంది. హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. చుండ్రు చిరాకు పెడుతుంది. దాంతో జుట్టు చూడటానికి నిర్జీవంగా, డల్ గా కనబడుతుంది. ఈ వింటర్ సీజన్ లో తరచూ తలస్నానం చేస్తే జుట్టు జిడ్డుగా, చిక్కుబడిపోతుంది. దాంతో జుట్టు చూడటానికి చిందరవందరగా, మ్యానేజ్ చేయడానికి కూడా కష్టంగా మారుతుంది.

పైన తెలిపిన జుట్టు సమస్యలన్నింటిని ఎఫెక్టివ్ గా ఎదుర్కోవాలంటే అందుకు ఒక్కటే పరిష్కార మార్గం. అదే హెయిర్ మాయిశ్చరైజర్. అయితే బ్యూటీ స్టోర్స్ లో అనేక రకాల హెయిర్ క్రీములు, మాయిశ్చరైజర్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో ఉపయోగించే రసాయలు జుట్టు మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి, నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడం మంచిది.

ఆమ్లా వాటర్ తో చర్మం, జుట్టు సమస్యలు మాయం

ఈ క్రింది లిస్ట్ లో సూచించిన పదార్థాలు సహజసిద్దమైనవి, వీటి వల్ల జుట్టుకు ఎలాంటి హాని కలగదు, వీటిని కనుక రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే జుట్టు పట్టు కుచ్చులా తయారవుతుంది.

1. ఆలివ్ ఆయిల్

 తలకు పెట్టుకునే నూనెల్లో అనేక రకాలున్నాయి. వాటిలో ఆలివ్ ఆయిల్ ఒకటి. ఆలివ్ ఆయిల్ ను తలకు పెట్టుకోవడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో జుట్టు తేమగా, షైనీగా, ఆరోగ్యంగా మెరుస్తుంటుంది. అంతే కాదు తలలో దురద, పొడి జుట్టును నివారించుకోవాలంటే వారంలో ఒకసారి ఆలివ్ ఆయిల్ ను తలకు అప్లై చేయాలి.

2. అలోవెర జెల్ :

 జుట్టుకు కావల్సిన తేమ, పోషణను అందివ్వడంలో అలోవెర జెల్ గొప్పగా సహాయపడుతుంది. అలోవెర లీఫ్ నుండి ఒక టేబుల్ స్పూన్ జెల్ ను తీసి తలకు అప్లై చేయాలి. ఈ సింపుల్ హోం రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

3. కొబ్బరి నూనె: 

తలకు మాయిశ్చరైజింగ్ గుణాలను అందివ్వడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. పొడిజుట్టును నివారించడంలో ఇది ఒక నేచురల్ నూనె. కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి తలకు అప్లై చేయడం ఒక పురాతన రెమెడీ. ఇలా కొబ్బరి నూనెను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఎప్పుడూ తేమగా, సాప్ట్ గా మాయిశ్చైజింగ్ గుణాలు కలిగి ఉంటుంది. 

కరవేపాకే కదా....అనకండి అందులోని గొప్ప ఔషధ గుణాలు చూడండి...


4. అరటి 

అరటిపండ్లలో ఎక్కువ మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటం వల్ల దీన్ని తలకు ఉపయోగిస్తుంటారు. జుట్టు సమస్యలను నివారించుకోవడం కోసం చాలా మంది బనానా హెయిర్ ప్యాక్ ను ఇల్లలో ప్రయత్నిస్తుంటారు. కాబట్టి, ఈ నేచురల్ రెమెడీతో మీరు కూడా మీ జుట్టును హెల్తీగా మరియు మాయిశ్చరైజర్ గా మార్చుకోండి.

5. తేనె 

తేనెలో అద్భుతమైన మాయిశ్చరైజింగ్ గుణాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకు అద్భుత మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దీన్ని నేరుగా జుట్టుకు అప్లై చేసుకోవచ్చు లేదా జుట్టుకు ఉపయోగించే ఇతర పదార్థలతో కలిపి వాడుకోవచ్చు.

6. ఉల్లిపాయ జ్యూస్

 ఉల్లిపాయ జ్యూస్ లో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది తలలో ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది. ఆనియన్ జ్యూస్ ను నేరుగా తలకు అప్లై చేయడం లేదా ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగించుకోవచ్చు. దాంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

 నల్లటి కురులు సొంతం చేసుకోవాలంటే...8 నేచురల్ టిప్స్

7. ఎసెన్షియల్ ఆయిల్

 జుట్టుకు ల్యావెండర్ ఆయిల్, బాదం ఆయిల్, జోజోబ ఆయిల్ వంటివి ఉపయోగించడం వల్ల స్మూత్ ఎఫెక్ట్ ను కలిగి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. ల్యావెండర్ ఆయిల్ ను ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగించాలి. దీన్ని వారానికొకసారి ఉపయోగిస్తే చాలు జుట్టు అందంగా తయారవుతుంది.

8. యాపిల్ సైడర్ వెనిగర్ 

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆస్ట్రిజెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది అత్యంత పవర్ ఫుల్ న్యాచురల్ రెమెడీ. డ్రై హెయిర్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. దీన్ని వాటర్ తో మిక్స్ చేసి నేరుగా తలకు అప్లై చేయాలి. ఇది తలకు అవసరమయ్యే మాయిశ్చరైజర్, తేమను అందించి, తలలో ఇన్ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది.








Comments