ముఖంలో జిడ్డు తగ్గించే సులభ మార్గాలు!

జిడ్డు సమస్యను డీల్ చేయాలంటే చాలా కష్టం. శరీరం అవుటర్ స్కిన్ మీద ఎక్సెస్ ఆయిల్ చేరడం వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, మొటిమలు ఏర్పడుతాయి. చర్మానికి మరింత చీకాకు కలుగుతుంది.

అయితే జిడ్డు చర్మం వల్ల ఒక పెద్ద ప్రయోజనం కూడా ఉంది. ఆయిల్ స్కిన్ కలవారిలో, వయస్సు పెరిగే లక్షణాలు త్వరగా కనబడవు. డ్రై స్కిన్ కంటే ఆయిల్ స్కిన్ లో ముడతలు తక్కువగా ఏర్పడుతాయి.

వంశపారంపర్యం, డైటరీ చాయిస్, ఎక్కువ స్ట్రెస్, హార్మోనుల్లో మార్పులు, పబ్బరిటి వంటి కారణాల వల్ల ఆయిల్ స్కిన్ ఏర్పడుతుంది.
జిడ్డు సమస్యకు కారణం ఏదైనా ..జిడ్డు సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని ఖరీదైన సౌందర్య సాధనాలే వాడాలని లేదు. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

 స్కిన్ అండ్ హెయిర్ కు కోకనట్ ఆయిల్ వాడటానికి గల సర్ప్రైజింగ్ రీజన్స్

నిమ్మరసం:

 ఇందులోని సిట్రిక్‌ యాసిడ్‌ సహజ యాస్ట్రింజెంట్‌లా పని చేస్తుంది. నిమ్మరసం, మినరల్‌ వాటర్‌ని సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుని నూనె లేని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

పెరుగు:

 రెండు చెంచాల పెరుగులో కొద్దిగా ఓట్‌మీల్‌ పొడి, చెంచా గోరువెచ్చని తేనె కలిపి ముఖానికి రాసి, మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేయాలి.

 నూనెలతో ఆయిల్ స్కిన్ కు చెక్ పెట్టవచ్చు!

టొమాటోలు:

 వీటిలో కూడా సహజ యాస్ట్రింజెంట్‌ గుణాలుంటాయి. టొమాటో ముక్కతో ముఖం మీద మర్దన చేసుకోవాలి. వీలుంటే టొమాటో రసంలో కాస్త తేనె కలిసి ముఖానికి మర్దన చేస్తే మరీ మంచిది.

యాపిల్‌: 

ఈ గుజ్జులో కాస్త, పెరుగు, నిమ్మరసం కలిపి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు ముఖానికి రాసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద జిడ్డు పేరుకోకుండా ఉంటుంది.

కీరదోస:

 ఇందులో విటమిన్‌ ఇ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. కీరదోస గుజ్జును చర్మానికి పూతలా వేసుకుంటే ఆ గుణాలన్నీ అంది.. ఆరోగ్యంగా ఉంచుతాయి. అలానే కీరదోస రసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. కాసేపటికి కడిగేసుకుంటే సరిపోతుంది.

పాలు : 

పాలు ఆయిల్ ఫ్రీ క్లెన్సర్. ఇది ఆయిల్ స్కిన్ ను సాప్ట్ గా మార్చుతుంది. పాలలో ఉండే ఆల్ఫాహైడ్రాక్సీ యాసిడ్ చర్మాన్ని ఎక్సఫ్లోయేట్ చేస్తుంది. చర్మంలో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. పాలలో కొంచెం గందం నూనెల లేదా బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి, అందులో కాటన్ డిప్ చేసి ముఖానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మంచి నిద్రకూడా పడుతుంది. ఉదయం చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

 జిడ్డు చర్మం గల వారు తప్పక అనుసరించాల్సిన 11ప్రాధమిక చర్మ సంరక్షణ చిట్కాలు

కలబంద: 

కలబందలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఆయిల్ స్కిన్ వల్ల వచ్చే మొటిమలను నివారిస్తుంది. అలోవెర చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను గ్రహిస్తుంది. అలోవెర జెల్ ను సగానికి కట్ చేసి, అందులోని జెల్ తీసి ముఖానికి అప్లై చేసి, డ్రై అయిన తర్వాత నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేయాలి.

తేనె: 

తేనె చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. ముడుతలను పోగొడుతుంది. తేనెలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మానికి డీప్ గా పోషణను అందిస్తుంది. ఆయిల్ స్కిన్ పోగొడుతుంది. ఒక లేయర్ తేనెను చర్మానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. రోజులో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.









Comments