చర్మంలో ముడతలను తొలగించే 8 హోం రెమెడీస్

ఏజింగ్ లక్షణాలకు ప్రధాణ కారణం చర్మంలో ముడతలు, ముఖ్యంగా ముఖంలో డ్రై స్కిన్. ప్రీమెచ్యుర్ ఏజింగ్ లక్షణాలు ఒత్తిడి ఎక్కువైనప్పుడు కనబడుతాయి. ఇవి ఏజింగ్ లక్షణాలకు మొదటి కారణం.

 ఎక్కువ స్ట్రెస్, ఎక్కువగా ఎండలో తిరగడం, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చోవడం మొదలగు కారణాల వల్ల చర్మంలో ముడతలు, చారలు ఏర్పడుతాయి. ఇటువంటి కారణాల వల్ల ముడుతలు ఏర్పడితే ఎప్పటికప్పుడు తొలగించుకోవచ్చు. అయితే వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మునుముందు తొలగించుకోవడం కష్టమవుతుంది.

 అందుకు మనందరం చేయాల్సిందల్లా స్కిన్ ఎలాసిటిని పెంచుకోవడం, ముడుతలు లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం. అసలు వయస్సు కంటే పెద్దవారిగా చర్మంలో ముడుతలు ఏర్పడటం, వయస్సైన వారిలా కనబడటం ఏ ఒక్కరికీ ఇష్టం ఉండదు. ప్రీమెచ్చుర్ ఏజింగ్ మరియు ముడుతలను నివారించుకోవడానికి కొన్ని సులభమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆయిల్ ఫుడ్స్ తినడం తగ్గించడం, స్మోకింగ్ మానేయడం.

15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై

ముడుతలను నివారించుకోవడానికి బోటాక్స్ ట్రీట్మెంట్ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇవి కరీదైనవి మాత్రమే కాదు, నొప్పి కలిగించేవి. అంతే కాదు ఈ ఖరీదైన చికిత్సలు శాశ్వత పరిష్కార మార్గం కావు. ముడుతలను నివారించుకోవడానికి ఇంట్లోనే కొన్ని నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

గుడ్డు తెల్లసొన 

గుడ్డులో ముడుతలను నివారించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఎగ్ వైట్ లో ఉండే విటిమిన్ ఇ చర్మంలో ముడుతలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. గుడ్డులోని తెల్లసొనలో కాటన్ డిప్ చేసి ముఖానికి అప్లై చేసి అలాగే ఉండనివ్వాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా ప్యాక్ కావలసినవి:

 • అలోవేరా జెల్
 • కోడిగ్రుడ్డులో తెల్లసొన 
తయారీ, అప్లై చేసే విధానం:
 • ఒక గిన్నెలో పైన సూచించిన పదార్ధాలను వేసి పేస్ట్ లా కలుపుకోవాలి.
 • ఈ పేస్ట్ ను ముడుతలతో చుట్టూ అప్లై చేసి మసాజ్ చేయాలి. ముఖ్యంగా ముడతలు ఎక్కువగా ఉండే కళ్ళు, నోటి చుట్టూ ఈ పేస్ట్ ను అప్లై చేసి మసాజ్ చేయాలి.
 • అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

ఆలివ్ నూనె

 ముడుతలను నివారించుకోవడం కోసం ఏలాంటి ఫేస్ ప్యాక్స్ ను చేయాల్సిన అవసరం లేదు. రాత్రి నిద్రించే ముందు ఆలివ్ నూనెను నేరుగా చర్మానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుతుంది. చర్మంలోని ముడుతలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

కొబ్బరి నూనే 

ముడుతలను నివారించుకోవడం కోసం ఆలివ్ ఆయిల్ ఖరీదైనది. సమయానికి దొరకని వారికి కొబ్బరి నూనె ఉత్తమమైనది.రోజూ ఇంటికి చేరుకోగానే మేకప్ ను తొలగించి కొబ్బరి నూనెను అప్లై చేయాలి. దీన్ని అప్లై చేయాలి. కొబ్బరి నూనెతో మేకప్ తొలగించడం సులభం అవుతుంది. రెగ్యులర్ గా వాడటం వల్ల ముడతలు కూడా క్రమంగా తగ్గిపోతాయి.

నిమ్మరసం

 ముడుతలను నివారించడంలో నిమ్మరసం కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా నిమ్మరసం తీసుకుని ముడతల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం ముడతలను, చర్మంలో సన్నటి చారలను మాయం చేయడానికి సహాయపడుతుంది.

పసుపు మాస్క్

 పసుపులో చర్మంను కాంతివంతంగా ప్రకాశంపచేయడానికి అవసరమయ్యే యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది అనేక చర్మ సమస్యలను పరిష్కరించడం కోసం సహాయపడుతుంది. పసుపు అనేక చర్మ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు డ్రై స్కిన్ నివారిస్తుంది.
 కావలసినవి: 
• ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి
 • 2 టేబుల్ స్పూన్ల చెరకు రసం విధానము 
• ఒక బౌల్లోనికి పైన తెలిపిన పదార్థాలు తీసుకోవాలి
 • ఈ రెండూ పదార్థాలని పేస్ట్ లా బాగా కలపాలి
 • ఈ పేస్ట్ ను ముఖం మరియు మెడ మీద అప్లై చేయాలి 
• 10 నిమిషాలు ఉంచండి. 
• గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
 • ఈ ఫేస్ ప్యాక్ ను 2-3 రోజుల తరువాత రిపీట్ చేయండి. 

ఎఫెక్టివ్ మొటిమలను నివారించుకోవడానికి పసుపుతో 8 సింపుల్ చిట్కాలు..!!

బొప్పాయి మరియు అరటి మాస్క్

 కావలసినవి

 • బొప్పాయి ఒక చిన్న ముక్క
 • అరటి పండు సగం 
విధానము 
• బొప్పాయి, అరటి ముక్కలను ఒక బౌల్లో తీసుకుని బాగా మెత్తగా పేస్ట్ లా కలుపుకోవాలి.
 • ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి.
 • 15 నిముషాల పాటు వదిలివేయండి 
• ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి 
ఈ పేష్ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే ముడతలను మాయం చేసుకోవచ్చు. ఎందుకంటే బొప్పాయిలో ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. అరటి పండ్లలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి . ఈ రెండు పోషకాలు మీ చర్మ సమస్యలను, ముఖ్యంగా ముడుతలను నయం చేయడంలో సహాయపడతాయి.

టమాటో మాస్క్

 కావలసినవి

 • బాగా పండిన ఒక టమోటా
 • 2 టేబుల్ స్పూన్ల సీసాల్ట్ విధానము 
• టమోటాను మెత్తగా పేస్ట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
 • టమోటో పేస్ట్ లో సీసాల్ట్ ను కలపాలి.
 • ఈ రెండు పదార్థాలు బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి 
• పేస్ట్ ను ముఖ చర్మం మీద అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి
 • ఈ ఫేస్ ప్యాక్ ను 10 నిముషాలు అలాగే ఉంచాలి 
• 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
• 7 రోజుల తరువాత తిరిగి ఈ ప్యాక్ ను ప్రయత్నించండి.
 టమోటోలలో ఉండే కెరోటిన్, యూవికిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. చర్మంలో సన్నని చారలు, ముడతలను మాయం చేస్తుంది.









Comments