ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు చాలా స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. అంతే కాదు, నలుగురిలో అందంగా కనబడాలనే కోరిక వారిలో దృఢంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వారు అందంగా కనబడుట కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడుట లేదు. మహిళలు తమ అందాన్ని మెరుగుపరుచుకోవడానికి, వారి అభిరుచిని బట్టి మార్కెట్లో అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో వారికి నచ్చినవి వారు ఎంపిక చేసుకోవచ్చు.
అందుకే, ఈ ఆధునిక యుగంలో బ్యూటీ విభాగం కూడా బాగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్పత్తులు కాకుండా మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఇలా మార్కెట్లో ఏఒక్కటి కొత్తగా కనిపించానా, అవి ఎందుకు పనికొస్తాయి? ఎలా వాడాలి? అనేవి తెలుసుకోకుండానే కొంత మంది మహిళలు కొనేస్తుంటారు.
అందుకే, ఈ ఆధునిక యుగంలో బ్యూటీ విభాగం కూడా బాగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్పత్తులు కాకుండా మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఇలా మార్కెట్లో ఏఒక్కటి కొత్తగా కనిపించానా, అవి ఎందుకు పనికొస్తాయి? ఎలా వాడాలి? అనేవి తెలుసుకోకుండానే కొంత మంది మహిళలు కొనేస్తుంటారు.
శీతాకాలంలో మహిళల చర్మసంరక్షణకు కొన్నిరహస్యాలు
మహిళలు బయట మార్కెట్లో సౌందర్య ఉత్పత్తులను కొనాలనుకొన్నప్పుడు, మన్నికైనవి కొనాలని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీ చర్మతత్వాన్ని బట్టి, సౌందర్య ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. మీ రోజువారి బ్యూటీ కిట్ లో ఎలాంటివి ఉండాలి, ఎలాంటివి ఉండకూదనే విషయం తెలుసుకోవడానికి ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది. ప్రస్తుత మార్కెట్లో మూడు రకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బిబి క్రీమ్స్, సిసి క్రీములు, డిడి క్రీలు గురించి తెలుసుకుందాం. క్రీములనగానే చాలా మంది గందరగోళం చెందుతుంటారు. అలాంటి ఆందోళ లేకుండా మీకు వివిధ రకాలుగా ఉపయోగపడే క్రీములు గురించి తెలుసుకుందాం..1) బివి క్రీమ్ :
పేరు వింటే ఆశ్చర్యం కదా..దీన్నే బ్యూటీ బామ్ మరియు బ్యూటీ బెనిఫిట్స్ అని పిలుస్తారు. ఇది మార్కెట్లోఅందుబాటులో ఉండే ఒక కామన్ క్రీమ్. ఇది మద్య, లైట్ కవరేజ్ స్కిన్ టోన్ కు సరిపోతుంది. ఈ క్రీం చర్మానికి రాసుకోవడం వల్ల మాయిశ్చరైజర్ గా పనిచేసి, సన్ టాన్ నుండి చర్మం నల్లగా మారకుండా కాపాడతుుంది. రోజు మొటిమలను, మచ్చలను కప్పిఉంచడానికి ఎక్కువ ఫౌండేషన్ ఉపయోగించక్కర్లేదు, రోజూ ఈ బిబి క్రీమ్ కొద్దిగా రాస్తే సరిపోతుంది
కొన్ని బిబి క్రీములు చర్మ కాంతిని కూడాపెంచుతాయి. ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తే, చివరి క్షణంలో ఎంపిక చేసుకునే క్రీమ్ ఇది.
2) సిసి క్రీమ్స్ :
సిసి క్రీమ్ మార్కెట్లోకి ఈ మద్యనే వచ్చింది. దీన్ని కవరేజ్ కంట్రోల్ లేదా కలర్ కరెక్టర్ అని కూడా పిలుస్తారు. ఇది తర్వాతి జనరేషన్ వారు వివిధ రకాలుగా ఉపయోగించుకోగలిగ క్రీమ్. ఇది చాలా తేలికగా..లైట్ గా ఉంటుంది. బిబి క్రీమ్ కంటే తేలికైనది.
చర్మ సౌందర్యాన్ని పెంచే 8 బెస్ట్ ఫేషియల్ మసాజ్ క్రీములు
ఇది ప్రైమర్, బ్రైటర్, ఫౌండేషన్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలున్నాయి. ఇందులో మినిరల్ పిగ్మెంట్ ఉండటం వల్ల చర్మంలో పిగ్మెంటేషన్, ప్యాచెస్ తగ్గిస్తుంది. కొన్ని సిసి క్రీముల్లో ఫ్రీరాడికల్ ఫైటర్స్ కూడా ఉంటాయి. ఇవి సన్ స్పాట్స్, ముడుతలు లేకుండా సహాయపడుతుంది. సిసి క్రీములు రోజూ వాడే సౌందర్య ఉత్పత్తులతో కలిపి వాడుకోవచ్చు
3) డిడి క్రీములు:
భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకూ బిబి, సిసి క్రీములు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు డిడి క్రీములు కూడా రావడంతో కొంచెం ఆసక్తి ఉంటుంది. డిడి క్రీములను డైలీ డిఫెన్స్ కోసం డిడి స్టాండ్స్ అంటారు. ఇవి ఇతర వాటివలే సన్ ప్రొటక్షన్ , లైటనింగ్ లక్షణాలను అందివ్వదు. కానీ, స్కిన్ స్ట్రక్చర్, చర్మానికి అదనపు తేమను అందివ్వడంలో గొప్పగా సహాపడుతుంది. ముఖ్యంగా ముఖం, చేతులకు ఎక్కువ తేమను అందిస్తుంది.
ముడుతల కోసం ఇంటిలో తయారు చేసుకొనే క్రీములు
పొడి చర్మ కలవారికి డిడి క్రీములు ఎక్కువగా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా పాదాలు మోకాళ్లు, మోచేతులకు సహాయపడుతుంది. ఇందులో యాంటీఏజింగ్ లక్షణాలు ఉండి, చర్మం నునుపుగా మార్చుతుంది. ముడుతలను తొలగిస్తుంది బిబి, సిసి, డిడి క్రీములు వేటికవి ప్రత్యేకంగా ఉపయోగపడుతాయి. అయితే మీ చర్మ తత్వాన్ని బట్టి ఎంపికచేసుకోవాలి. మార్కెట్లో వచ్చే ప్రతి కొత్త ఉత్పత్తిని గుడ్డిగా నమ్మి కొని వాడటం వల్ల చర్మానికి హాని కలిగుతుంది. దుష్ప్రభావాలు ఉంటాయి. అలా జరగకూడదనుకుంటే జాగ్రత్తగా వాటి గురించి తెలుసుకుని కొనడం మంచిది.
Comments
Post a Comment