కళ్ళ క్రింద నల్లని వలయాలను తొలగించే ఆముదం !

శరీరంలో అతి పెద్ద అవయంగా పిలవబడేది చర్మం. శరీరం మొత్తం చర్మం కప్పి ఉంచి, శరీరానికి రక్షణ కల్పిస్తుంది. చర్మం చాలా పల్చగా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా కంటి వద్ద ఉండే చర్మం మరీ సున్నితంగా ఉంటుంది. కాబట్టి, కళ్ళ క్రింద చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

కళ్ళు అలసినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు కళ్ళ క్రింది నల్లని వలయాలు ఏర్పడుతాయి. కళ్ళ క్రింద నల్లని వలయాలు స్త్రీ, పురుషులిద్దరి సమస్య. అన్ని వయస్సుల వారిలో ఈ సమస్య కనబడుతుంది.
కళ్ళ క్రింద నల్లటి వలయాలను నివారించుకోవడానికి అనేక హోం రెమెడీస్ ఉపయోగించి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఆముదంను ట్రై చేశారా? ఆముదంలో ఉండే ఓమేగా 3 కంటెంట్ చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. కళ్ళ క్రింద ఎక్సెస్ వాటర్ తొలగించి కళ్ళ ఉబ్బు తగ్గిస్తుంది. దాంతో డార్క్ సర్కిల్స్ లేదా నల్లని వలయాలు తగ్గుతాయి.

 ఆముదం తలకే కాదు.. చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది..!

 డార్క్ సర్కిల్స్ తొలగించుకోవడానికి మొదట కేవలం ఒక్క ఆముదంను ప్రయత్నించి చూడండి. దీంతో మార్పులు కనిపించకపోవతే, ఆముదంతో పాటు ఇతర హోం రెమెడీస్ ను ట్రై చేయండి. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

కొబ్బరి నూనె, ఆముదం నూనె:

 కొబ్బరి నూనె, ఆముదం నూనె 1:1నిష్పత్తిలో తీసుకుని, మిక్స్ చేసి కళ్ళక్రింది అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కళ్ళక్రింద, అలాగే ముక్క ప్రక్కల చెవి దగ్గరలో కూడా అప్లై చేసి మర్ధన చేయాలి.

 ఆముదంతో జుట్టుకు కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

ఆముదం, ఆవనూనె :

 ఈ కాంబినేషన్ ప్రయత్నించేటప్పుడు ఆవనూనెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆముదం నూనె స్కిన్ ఇరిటేషన్ కు కారణమవుతుంది. రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనెలో 1/4ఆవనూనె కలిపి కళ్ళక్రింద అప్లై చేసి మసాజ్ చేయాలి. నిద్రించే ముందు అప్లై చేస్తే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

బాదం ఆయిల్ , ఆముదం నూనె :

 బాదం ఆయిల్ మరియు ఆముదం నూనెను సమంగా తీసుకొని మూత టైట్ గా ఉన్న డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు దీన్ని కళ్ళ క్రింద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 స్ట్రెచ్ మార్క్స్ ను నివారించే పొటాటో, కాస్ట్రో ఆయిల్ ప్యాక్

ఆముదం నూనె, ఫ్రెష్ క్రీమ్:

 ఆముదం నూనె, ఫ్రెష్ క్రీమ్ డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. ఒక టీస్పూన్ ఫ్రెష్ క్రీమ్ లో 10 చుక్కల ఆముదం నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళక్రింద నల్లని వలయాల మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆముదం నూనె, పచ్చిపాలు :

 ఆముదం, ఫ్రెష్ క్రీము డార్క్ సర్కిల్స్ ను ఏవిధంగా తొలగిస్తుంది. అదే విధంగా పచ్చిపాలు, ఆముదం కాంబినేషన్ కూడా పనిచేస్తుంది. ఆముదం నూనె, పచ్చిపాలను మిక్స్ చేసి బాగా రెండూ కలిసే వరకూ మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కాటన్ తో కళ్ళ క్రింది అప్లై చేసి మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.







Comments