చర్మ నిగారింపు కోసం తేనెతో ఫేస్ ఫ్యాక్...

ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. తేనే ప్రకృతి సిద్దం గా దొరికే అపురాపమైన ఔషధము . బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి. . తేనే లో ఉన్న విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతే కాదు, తేనె సౌందర్యానికి కూడా చాల గ్రేట్ గా సహాయపడుతుందు. సౌందర్యం మెరుగుపరుచుకోడానికి కూడా తేనె వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే తేనెలో నేచురల్ ఔషధగుణాలు, సౌందర్య లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల తేనెను సౌంద్యంలోని కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు.

చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడంలో తేనె చేసే అద్భుతాలు అన్ని ఇన్నీ కావు . వాతావరణంలో కాలుష్యం, సీజనల్ మార్పులు మరియు అనారోగ్యకరమైన ఆహారాలు వీటన్నింటి వల్ల చర్మ సౌందర్యం పాడవుతుంది. వీటి నుండి బయట పడాలంటే తేనె ఒక్కటే ఉత్తమ మార్గం. చర్మానికి సహజతత్వాన్ని అందివ్వడంలో మరియు ముఖంలో మొటిమలు, మచ్చలు, ముడుతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. తేనె సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది.

తేనెను అందానికి ఏవిధంగా ఉపయోగించాలి? లాభాలేంటి


అందాన్ని మెరుగుపరుచుకోవడంలో వివిధ రకాల ప్రొడక్ట్స్ ఉన్నా వాటిలో ఉత్తమమైనది తేనె. దీన్ని ఫేస్ ప్యాక్, ఫేస్ మాస్క్ గా ఉపయోగించుకోవచ్చు. ఏవిధంగా ఉపయోగించుకొన్నా నేచురల్ గ్లోను అందిస్తుంది. ముఖంలో ఫైన్ లైన్స్, ముడుతలు, డార్క్ స్పాట్స్, మరియు ఇతర సమస్యలన్నింటిని నివారించడలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా తేనె యంగ్ గా కనబడేలా చేస్తుంది. తేనెతో పాటు ఇతర పదార్థాలను జోడించి కూడా ఉపయోగించడం మల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరియు అందాన్ని మెరుగుపరుచుకోవడంలో తేనె ఏవిధంగా మనకు సహాయపడుతుందో చూద్దాం...

తేనె మరియు షుగర్ ఫేస్ ప్యాక్:

 తేనె మరియు షుగర్ ను సమానంగా తీసుకొని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . కొన్ని నిముషాలు డ్రై అయిన తర్వాత సున్నితమైన మసాజ్ ను అందివ్వాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. ఈ హోం రెమెడీని వారానికొకసారి అనుసరించాలి.

తేనె, బాదం మరియు నిమ్మరసం: 

తేనె, బాదం ఆయిల్ మరియు నిమ్మరసం సమంగా తీసుకొని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని లైట్ గా గోరువెచ్చగా చేసి ముఖానికి అప్లై చేయాలి . ఈ మాస్క్ పూర్తిగా డ్రై అయిన తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది.
తేనె మరియు సాండిల్ వుడ్ ప్యాక్ :                                                                                                                  ఈ ఫేస్ ప్యాక్ కోసం సాండిల్ వుడ్ పౌడర్ లో తేనె మిక్స్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. బాగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో స్ర్కబ్ చేయాలి. ఇది చర్మాన్ని సాప్ట్ గా మరియు బ్రైట్ గా మార్చుతుంది.                                

తేనె మరియు ఓట్స్ ప్యాక్: 

ఓట్స్ ను పౌడర్ లా చేసి తేనెతో మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. డ్రై అయిన తర్వాత, రోజ్ వాటర్ చిలకరించి బాగా స్ర్కబ్ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన హెక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది.

హని, పసుపు మరియు గ్లిసరిన్ ఫేస్ ప్యాక్: 

తేనె, మరియు పసుపు మరియు గ్లిజరిన్ ను 2:1:1బాగాలుగా తీసుకొని, వీటిని బాగా మిక్స్ చేసి గోరువెచ్చగా చేసి ముఖానికి పట్టించి, డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ తో చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది.

తేనె మరియు బనానా ప్యాక్:

 బాగా పండిన అరటిపండులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంటుంది మరియు చర్మం స్మూత్ గా మారుతుంది.

తేనె మరియు టమోటో ఫ్యాక్ : 

తేనెలో టమోటో గుజ్జు మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి 15నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల యంగ్ లుక్ పొందవచ్చు. పావుగంట తరవాత చన్నీళ్లతో శుభ్రం చేస్తే చర్మానికి నిగారింపు వస్తుంది.

తేనె -నిమ్మరసం:

 తేనె, నిమ్మరసం మిశ్రమం మొటిమలను తగ్గిస్తుంది. రెండు చెంచాల తేనెకి చెంచా నిమ్మరసం చేర్చి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే మొటిమల సమస్య ఉండదు.

తేనె ముల్తాని మట్టి:

 రెండు చెంచాల తేనెకి చెంచా ముల్తానీ మట్టిని కలిపి ముఖానికి రాసి పావుగంట తరవాత శుభ్రం చేయాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది.

తేనె-కీరదోసకాయ: 

చెంచా తేనె, రెండు చెంచాల చొప్పున పాలూ, కీరదోస గుజ్జూ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.











                                                                                                                                                                                           
                                                            
                                          





Comments