మనం నిత్యజీవితంలో ఉపయోగించే నిత్యవసర వస్తువల్లో నూనెలు ఒకటి. నూనెల్లో వివిధ రకాల నూనెలున్నాయి. అయితే అన్ని రకాల నూనెల్లో కంటే సన్ ఫ్లవర్ ఆయిల్ ది బెస్ట్ అని అంటున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని సూచిస్తున్నారు. ప్రకృతిలో జనిస్త్తున్న పుష్పాలు మానవాళిని కనువిందు చేస్తుంటాయి. అందులోనూ సూర్యుడితో పాటు తిరిగే పొద్దు తిరుగుడు పచ్చదనంతో పాటు భారీ తనం కూడా కంటికింపుగా ఉంటుంది. అంతే కాదు సన్ ఫ్లర్ నుండి వికసించే విత్తనాలు కూడా ఆరోగ్య, సౌందర్య సాధాణాలు అధికంగా వినియోగిస్తున్నారు . అత్యధికంగా ప్రపంచం మొత్తంలో ప్రధమంగా వినియోగించెది వంటనూనెగా.. సౌందర్య ద్రవాలు, లేపనాలలో, చర్మరక్షణ నూనెలలో వినియోగిస్తారు. అంతే కాదు ఆరోగ్య పరంగా కూడా చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో లెసిథిన్, కెరోటినాయిడ్స్, టోకోఫెరల్స్ మరియు విటమిన్ ఎ, డి, మరియు ఇలు పుష్కలంగా ఉంటాయి .

సన్ ఫ్లవర్ ఆయిల్ ను మన ఇండియన్స్ అంత ఎక్కువ ఉపయోగించరు కానీ, అమెరికా వంటి దేశాల్లో దీని వాడకం ఎక్కువ. ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ పుట్టక అమెరికా.. అంతే కాదు ఈ నూనె అక్కడ ఎక్కువ ఉపయోగిస్తుంటారు. వంటలకు ఈ నూనె ఎక్కువగా వాడుతుంటారు. అలాగే చర్మ సంరక్షణలో కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. ఈ నూనెలో ఎమోలెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అధిక న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల వీటి చాలా విరివిగా కాస్మోటిక్ ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తున్నారు . ఈ సన్ ఫ్లర్ ఆయిల్ మొటిమలు, ఎగ్జిమా మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ నూనె ఏజింగ్ లక్షణాలను మరియు హానికరమైన యూవి రేస్ నివారిస్తుంది. చర్మానికి సంబంధించిన మరెన్నో గుణాలు ఇందులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
మొటిమలను నివారిస్తుంది:
సన్ ఫ్లవర్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది చర్మానికి చాలా గ్రేట్ గా పనిచేసి, మొటిమలను నివారిస్తుంది . ఇది స్కిన్ మాయిశ్చరైజర్ గా పనిచేసి మొటిమలు మరియు ఇతర స్కిన్ ఇన్ఫ్లమేషన్ డిసీజ్ ల నుండి రక్షణ కల్పిస్తుంది. అంతే కాదు ఇది చర్మంలోకి చాలా గ్రేట్ గా షోషింపబడుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా రెండు టీస్పూన్ల పెరుగులో , రెండు స్పూన్ల సన్ ఫ్లవర్ ఆయిల్, ఒక స్పూన్ ఆముదం నూనె మిక్స్ చేయాలి. ఈ మూడు మిక్స్ చేసిన తర్వాత దీనితో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 10 నిముషాలు మసాజ్ చేసి తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.
యాంటీఏజింగ్ ఫేస్ మాస్క్:
సన్ ఫ్లవర్ ఆయిల్ చర్మాన్ని యంగ్ గా మరియు రేడియంట్ గా మార్చుతుంది. ఇది మొటిమలను మరియు స్కిన్ వదులవ్వడాన్ని నివారిస్తుంది. ఏజ్ అయిపోయిన వారిలా కనించడానికి కారణమయ్యే లక్షణాలను మరియు ముడుతలను మరియు ఫైన్ లైన్స్ ను నివారించడంలో సన్ ఫ్లవర్ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఏజ్ స్పాట్స్ నివారిస్తాయి. అందుకురెండు స్పూన్ల సన్ ఫ్లవర్ ఆయిల్లో, ఒక స్పూన్ అలోవెర జెల్ ను మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేసి తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.
సన్ డ్యామేజ్ స్కిన్ ను నివారిస్తుంది:
హానికరమైన యూవీ రేస్ చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది స్కిన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి చర్మం మీద సన్ ఫ్లవర్ ఆయిల్ పైకవచంలా పనిచేసి యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇందులో విటమిన్ ఇ కంటెంట్ అధికంగా ఉంటం వల్ల సూర్యకిరణాలు చాలా తక్కవుగాచర్మానికి తగిలేలా చేస్తుంది. దాంతో స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని, రెండు స్పూన్ల సన్ ఫ్లవర్ ఆయిల్ తీసుకుని తర్వాత అందులో ఒక స్పూన్ అలోవెర జెల్, ఒక స్పూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ మిక్స్ చేసి బాగా షేక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన్ సన్ బర్న్ అయిన చర్మానికి అప్లై చేచాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
మాయిశ్చరైజింగ్ మాస్క్ :
సన్ ఫ్లవర్ ఆయిల్ బెస్ట్ మాయిశ్చరైజింగ్ మాస్క్ లా పనిచేస్తుంది. ఇది స్కిన్ సాప్ట్ గా , తేమగా మార్చుతుంది. వయస్సయ్యే లక్షణాలు బయటకు కనబడకుండా ఎక్స్ టర్నల్ గా చర్మం పాడవకుండా కాపాడుతుంది. కొద్దిగా సన్ ఫ్లవర్ ఆయిల్ తీసుకుని వేడి చేయాలి. ఇప్పుడు దీన్ని రాత్రి నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసి, తగినంత తేమను అందివ్వాలి.
హైపర్ పిగ్మెంటెడ్ స్కిన్ ను ట్రీట్ చేస్తుంది:
సన్ ఫ్లవర్ ఆయిల్ అద్భుతమైన హోం రెమెడీ. ఇది హైబపర్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది. డార్క్ ప్యాచెస్ తో బాధపడే వారు, సన్ ఫ్లవర్ ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగించాలి. కొద్దిగా సన్ ఫ్లవర్ ఆయిల్ తీసుకుని, ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చన్నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
డ్రై స్కిన్ నివారిస్తుంది:
చర్మం పొడిబారడం, దురద, చీకాకు కలిగించే లక్షణాలు ఉన్నట్లైతే సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఖచ్ఛితంగా ఉపయోగించి. డైలీ అండ్ రొటీన్ గా సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఉపయోగించాలి. ఆముదం నూనె యొక్క మిశ్రమం, బేకింగ్ సోడా సన్ ఫ్లవర్ ఆయిల్ తో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. చర్మంలో మలినాలను సులభంగా తొలగిస్తుంది. సన్ ఫ్లవర్ ఆయిల్లో ఉండే ఫ్యాటీయాసిడ్స్ డల్ మరియు డ్రై స్కిన్ ను నివారిస్తుంది.
కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది:
కళ్ళు ఉబ్బుగా ఉన్నట్లైతే ఇది ముఖ అందాన్ని పాడుచేస్తుంది. కళ్ళ ఉబ్బును తగ్గించడానికి సన్ ఫ్లవర్ ఆయిల్ గొప్పగా సహాయపడుతుంది. కొద్దిగా సన్ ఫ్లవర్ ఆయిల్ తీసుకుని, కళ్ళ క్రింద అప్లై చేసి, మసాజ్ చేయాలి. రాత్రి నిద్రించే ముందు కళ్లకు అప్లై చేసి పడుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత చన్నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
రిలాక్సింగ్ బాత్ :
కొన్ని చుక్కల సన్ ఫ్లవర్ ఆయిల్ ను స్నానం చేసే నీటిలో వేసి , ఆ నీటితో స్నానం చేస్తే స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ పొందుతారు. సన్ ఫ్లవర్ ఆయిల్లో ఉండే నేచురల్ స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణాలు స్నానం చేసే నీటిలో మిక్స్ చేయడం వల్ల చర్మానికి మరెన్నె బెనిఫిట్స్ ను అందిస్తుంది. ఒక కప్పు బేకింగ్ సోడ అరకప్పు సన్ ఫ్లవర్ ఆయిల్ తీసుకుని, స్నానం చేసే నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయడం వల్ల రిలాక్స్ అవుతారు.
Comments
Post a Comment