ముక్కుపై నల్లటి మచ్చలు పోవాలంటే...?

సాధారణంగా కొంతమందిలో ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్ వచ్చి చాలా ఇబ్బందిపడుతుంటారు. ఆ సమస్యను నివారించుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటాము. అసలు ఈ బ్లాక్ హెడ్స్ వచ్చాక కన్నా కూడా రాక ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో చూద్దాం.

1. మనం రోజులో ఎక్కువసేపు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖాన్ని రెండుసార్లు కడుక్కోవాలి. ముఖ్యంగా ముక్కు చుట్టూ అసలు మురికి లేకుండా చూసుకోవాలి.

2. వారానికి ఒకసారి ముఖానికి నలుగు పెట్టుకోవాలి. అలాగే ఆవిరి పట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

3. రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి ఆవిరి పట్టి మెత్తని తువాలుతో ముఖాన్ని తుడుచుకోవాలి. ఇలా చేయడం వలన బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

4. నిమ్మరసంలో కాస్త తేనె, పంచదార వేసి దానితో బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రుద్దితే సహజసిద్దమైన స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది.

5. అలాగే ఓట్స్, చిటికెడు ఉప్పు, ఆలివ్ నూనె కలిపి రాసుకుని పదినిమిషముల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగివేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

Comments