Skip to main content
పగిలిన పాదాలు.. నిమ్మరసంతో ఉపశమనం...!
పాదాలు పగిలాయంటే తీవ్ర నొప్పి కలుగుతుంది. కొన్ని సమయాల్లో పగుళ్లలో నుంచి రక్తం కూడా కారుతుంది. పాదాలు పగుళ్లు లేకుండా మృధువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. అసలు పాదాల పగుళ్లకు తేమ లేకపోవడమే కారణమని వైద్యులు తెలుపుతున్నారు. కనుక పాదాల పగుళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాసుకోవాలి. రోజుకు రెండు సార్లు పాదాలను కడిగి, తుడుచుకుని, తర్వాత క్రీములను పాదాలకు రాసుకోవాలి.
రాత్రి వేళల్లో పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్‌లు వేసుకోవాలి. వీలుపడితే పగటి సమయంలో కూడా సాక్స్‌లు ధరించడం ఉత్తమం. పాదాల గట్టిదనం పోయి మృదువుగా అవ్వాలంటే నిమ్మరం రాసుకుని, పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే సరి.
పాదాలను కడుకున్న తర్వాత మెత్తటి టవల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తర్వాత వాజిలైన్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పాదాలకు రాసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా పాదాలపై పగుళ్లు పోయి బ్యూటీగా తయారవుతాయి.
Comments
Post a Comment