అందమైన ముఖం... నల్లనైన మెడ... ఏం చేయాలి?

సాధారణంగా కొందరిలో ముఖం అందంగా ఉన్నప్పటికి మెడ భాగం నల్లగా ఉంటుంది. అలాగే మొటిమల సమస్య ఇబ్బంది పెడుతుంటుంది. దీనికి రకరకాల కాస్మోటిక్స్ వాడినప్పటికి ఒక్కోసారి ఫలితం కనిపించకపోగా సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్థాలతో మనం ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

1. కీరదోస కాయ ముక్కలను మెత్తగా చేసి దానికి కొంచెం తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని మెడకు పూయాలి. ఇలా ప్రతి రోజు చేయడం వలన మెడ భాగం దగ్గర ఉండే నలుపు తగ్గుముఖం పడుతుంది.

2. విటమిన్‌ ఏ అధికముగా ఉంటే క్యారెట్ మొటిమలకు చక్కగా పనిచేస్తుంది. క్యారెట్ జ్యూస్‌ని మొటిమలు, పొక్కులు, కురుపులపై పూయడం ద్వారా అతి త్వరగా నయమవుతాయి.

3. ముఖం మీద మొటిమల సమస్యతో బాధపడేవారు కలబంద గుజ్జును మొటిమలపై రాసి 20 నిముషముల తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.

4. ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్,అరస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

5. టమోటోను తీసుకొని వాటిని బాగా గుజ్జులా తయారుచేసి అందులో కొద్దిగా ఓట్ మీల్ మరియు ఒక చెంచా పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్‌టాన్ తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.

Comments