కుంకుమ పువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది. కుంకుమపువ్వు, పాల మిశ్రమం ఫేస్ ప్యాక్ చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. స్కిన్ స్ట్రక్చర్‌ను మెరుగుపరుస్తుంది. ఏజింగ్ స్కిన్ టిష్యులను రిపేర్ చేస్తుంది. దాంతో చర్మం మరింత యవ కనబడేలా చేస్తుంది.
పాలు మరియు కుంకుమపువ్వు మిశ్రమం చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి తగిన హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఇది చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను అందిస్తుంది. దాంతో చర్మం మృదువుగా తయారవుతుంది.
అలాగే కలబంద చర్మ సౌందర్యానికి వన్నె తెస్తుంది. కలబంద గుజ్జు చర్మంపై ఎప్పుడూ తేమను వుంచుతుంది. అంతేకాదు ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలోవేర, బియ్యంపిండి, టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించి ఫేస్ మాస్క్ కూడా తయారుచేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
Comments
Post a Comment