వయసేమో 30.. అయినా 40లా కనిపిస్తున్నారా.. కలబంద గుజ్జును..?

కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా వుండవచ్చు. అంతేగాకుండా చర్మానికి కలబంద గుజ్జు రాసుకోవడం ద్వారా చర్మ సౌందర్యం పెంపొందుతుంది. ఇంకా కేశ సౌందర్యానికి కూడా కలబంద ఎంతో మేలు చేస్తుంది. అలాగే కలబంద గుజ్జును కంటిపై పది నిమిషాలు వుంచితే కంటి చుట్టు వలయాలు తొలగడమే కాకుండా కళ్ల మంటలు తగ్గిపోతాయి. 

కలబంద వృద్ధాప్య చాయలను తొలగిస్తుంది. చర్మం ముడతలు పడనీయకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, బి వంటి ధాతువులు చర్మ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతాయి. కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా, మంచి నిగారింపును సంతరించుకుంటుంది. 

కలబంద గుజ్జుకు తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్‌ చేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి ముఖం కాంతివంతం అవుతుంది. తలకు కలబంద వాడడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు తెల్లబడడం, ఎర్రబడటం, ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Comments