రోజ్ వాటర్ ఎలా తయారు చేయాలో తెలుసా...?

రోజా పువ్వుల శాస్త్రీయ నామం రోసాసరు. ఇందులో సుమారుగా 100కి పైగా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క రకం, ఒక్కొక్క రంగు పువ్వులతో ఎంతో మనోహరంగా ఉంటాయి. రోజ్ వాటర్‌ని మార్కెట్లో కొని తెచ్చుకోవడం కంటే, ఇంటివద్దే తయారు చేసుకొని సహజ చర్మతత్వాన్ని పొందవచ్చు. ఒక పాత్రలో తాజా గులాబీ పువ్వుల రేకులను వేసి అందులో నీరు పోసి బాగా మరిగించాలి. తర్వాత క్రిందికి దింపుకొని ఒక గిన్నెలో పోసి మూత పెట్టి బాగా చల్లారనివ్వాలి.

కొన్ని గంటలు చల్లారిన తర్వాత ఈ రోజ్ వాటర్‌ను ఒక మూత ఉన్న డబ్బా లేదా బాటిల్లో నింపుకొని ఫ్రిజ్‌లో పెట్టి 24 గంటల పాటు ఉంచాలి. ఒక రోజు గడిచిన తర్వాత ప్రిజ్‌లో నుండి బయటకు తీసి గట్టి మూత వుండే బాటిల్స్‌లో వడపోసుకుని ఈ తాజా, ఫ్రెష్ రోజ్ వాటర్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు.

ముఖానికి రోజ్ వాటర్: కాటన్ బాల్స్‌ను రోజ్ వాటర్లో ముంచి ముఖం మీద అద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం మాత్రమే శుభ్రపడటమే కాకుండా చర్మ గ్రంధుల‌ను తెరచుకొనేలా చేసి, చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. ముల్తానీ మట్టి అన్ని ఫేస్ ప్యాక్స్‌లో కంటే చాలామంచి ఫేస్ ప్యాక్ ఇది వేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశించేలా చేస్తుంది.

ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ చుక్కలను క‌లిపి ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసినట్లైతే ముఖం ప్రకాశ‌వంతంగా మెరుస్తుంటుంది. ఆరెంజ్ ఫేస్ ప్యాక్ చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి తర్వాత పౌడర్ చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం సహజ రూపంతో.. ప్రకాశవంతంగా తయారవుతుంది.

Comments