కొబ్బరి పాలతో కనుబొమలు ఒత్తుగా, మందంగా..

ఐబ్రోలు ఒత్తుగా పెరగడానికి కొబ్బరి పాలు సహాయపడుతాయి. కొబ్బరి ముక్కను మెత్తగా పేస్ట్ చేసి, వాటి ద్వారా వచ్చే పాలను కనుబొమ్మలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అలాగే మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసి ఐబ్రోలకు పట్టించాలి . ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. కనుబొమ్మలు ఒత్తుగా మరియు డార్క్‌గా పెరుగుతాయి.


నిమ్మతొక్కను రెండుగా కట్ చేసి ఒక బౌల్ పాలలో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు పట్టించి, మసాజ్ చేయాలి. నిమ్మరసాన్ని నేరుగా కనుబొమ్మలకు అప్లై చేయకూడదు. మందారం నూనె లేదా మందార పువ్వుల యొక్క పేస్ట్ ను కనుబొమ్మలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీళ్ళతో కడిగేస్తే కనుబొమ్మలు వత్తుగా తయారవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.

ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మొదలగునవి మీ కనురెప్పలకు అప్లై చేసి మసాజ్ చేయవచ్చు . ఈ నూనెలు కనురెప్ప మొదళ్ల వద్ద ఉద్దీపనగావించి, కనురెప్పల వెంట్రులక పెరగడానికి సహాయపడుతాయి. కనురెప్పలను, కనుబొమ్మలను ఈ నూనెలో ఉపయోగించి మద్యమద్యలో గ్యాప్ ఇస్తు మసాజ్ చేస్తుండాలి. దాంతో కనురెప్పల వద్ద, కనుబొమ్మల్లో వెంట్రుకలు పెరుగదలను పెంచుతుంది.

Comments