నల్లగా ఉన్నారా:తెల్లగా మారడానికి అమ్మమ్మ చెప్పే సింపుల్ చిట్కాలు

సహజంగా ప్రతి ఒక్క అమ్మాయి తెల్లగా ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం వివిధ రకాల బ్యూటీ ఎక్స్ పరమెంట్స్ చేస్తుంటారు. మార్కెట్లో వచ్చే కొత్త కొత్త క్రీమ్ లు, ఫేస్ వాష్ లు, ఉపయోగిస్తుంటారు. ఇవన్నీ ఇన్ స్టాంట్ గా ప్రయోజనాలను అందించేవే కానీ, శాశ్వతంగా ఎలాంటి మార్పులు తీసుకురావు. 

అంతే కాదు మార్కెట్లో లభించే క్రీమ్స్ కెమికల్స్ తో తయారుచేయడం వల్ల చర్మానికి హాని కలిగిస్తాయి.కాబట్టి, కాస్త శ్రద్ద పెట్టి చూస్తే మన చుట్టూనే అనేక నేచురల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫేస్ వైట్ గా మార్చడానికి గ్రేట్ గా సహయపడుతాయి.

 మీరు నల్లగా ఉన్నారా?ఐతే తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్ మీకోసం

స్కిన్ కలర్ అంద్భుతంగా, కాంతివంతంగా తేమగా..తెల్లగా ఉండాలని కోరుకుంటారు. బ్యూటీ వైటనింగ్ ప్రొడక్ట్స్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అంతే కాదు, వయస్సైన వారిలా కనబడేలా చేస్తుంది. అందువల్లే మనకు సులభంగా అందుబాటులో ఉండే నేచురల్ బ్యూటీ టిప్స్ ను ఫాలో అవుతూ స్కిన్ వైట్ గా మార్చుకోవచ్చు. గ్రాండ్ మదర్స్ బ్యూటిటప్స్, కిచెన్ రెమెడీస్ కు డిమాండ్ ఎక్కువ. కాబట్టి, కెమికల్ బేస్డ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫాలో అవ్వకుండా, నేచురల్ రెమెడీస్ ను ఫాలో అవ్వడం ఉత్తమం. మరి ఆ ఎఫెక్టివ్ గ్రాండ్ మదర్స్ బ్యూటీ టిప్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...
పాలు, నిమ్మరసం మరియు తేనె :

 ఈ మూడు పదార్థాలు బ్యూటిని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి నల్లగా ఉన్న చర్మంను తెల్లగా మార్చుతాయి. ఒక టేబుల్ స్పూన్ పాలు, నిమ్మరసం, తేనె ఒక్కో టేబుల్ స్పూన్ తీసుకుని, మిక్స్ చేయాలి.ఇలా చేయడం వల్ల ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఫెయిర్ అండ్ ఫవ్ లెస్ స్కిన్ పొందుతారు.

ఓట్స్ మరియు పెరుగు: 

ఓట్స్ మరియు పెరుగు బెస్ట్ నేచురల్ పదార్థాలు. ముఖం తెల్లగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది సన్ టాన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఏజ్ స్పాట్స్, పిగ్మెంటేషన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఓట్ మీల్ ను రాత్రంతా నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేసి, పెరుగుతో కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బెటర్ గా ఎఫెక్టివ్ రిజల్ట్ ను అందిస్తుంది.

బంగాళదుంప: 

బంగాళదుంపలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ స్కిన్ ఫెయిర్ గా మరియు గ్లోయింగ్ గా మార్చుతుంది. ఒక పొటాటో తీసుకుని, మెత్తగా పేస్ట్ చేసి, జ్యూస్ తియ్యాలి. ఈ రసాన్ని ముఖానికి అప్లై చేస్తే ఎఫెక్టివ్ రిజల్ట్ ను అందిస్తుంది. బెటర్ రిజల్ట్ కోసం, రెగ్యులర్ గా అప్లై చేసుకోవాలి.

అరటి మరియు బాదం ఆయిల్ : 

ఈ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ లో న్యూట్రీషియన్స్ అధికం. అరటి మరియు బాదం ఆయిల్ కాంబినేషన్ స్కిన్ ఫేయిర్ గా మార్చుతుంది. సపెల్ గా తయారుచేస్తుంది. బాగా పండిని అరటి పండును మెత్తగా చేసి, అందులో కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖాని అప్లై చేసి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి మరియు పసుపు :

 శెనగపిండి మరియు పసుపు ప్యాక్ గ్రాండ్ మదర్స్ బ్యూటీ రిసిపి. ఈ కాంబినేషన్ తో ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఒక టీస్పూన్ పాలు, వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి మరియు తేనె : 

బొప్పాయిలో ఎంజైమ్స్ అధికంగా ఉండటం వల్ల చర్మం తెల్లగా మార్చుతుంది. దీంతో పాటు నేచురల్ సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది. చర్మానికి సన్ టాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. అరకప్పు బొప్పాయి ముక్కలను పేస్ట్ చేసి, ఒక టీస్పూన్ తేనెను మిక్స్ చేయాలి. ఈపేస్ట్ ను ముఖానికి అప్లై చేసి, 20 నిముషాల తర్వాత వాటర్ కడిగేసుకోవాలి.

టమోటో, పెరుగు:

 ఫ్రెష్ గా తరిగిన టమెటో ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి, పెరుగు మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మంను తెల్లగా మార్చుతుంది. ఈ ఫేస్ మాస్క్ ను ప్రతి రెండు రోజులకొకసారి అప్లై చేయాలి. ఇలా చేస్తే బెటర్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ పొందుతారు.




Comments