అందంగా కనిపించాలంటే.. ఏం చేయాలి..?


అందంగా కనబడాలనే ప్రతి ఒక్కరి మససులో కోరుకుంటారు. అందుకు సరైన ఆహారం తీసుకోవాలి. కరెక్ట్ టైమ్‌కు నిద్రపోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. అప్పుడే యవ్వనంగా కనబడుతారు. శరీర ఆరోగ్యంతో పాటు, చర్మ ఆరోగ్యానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరైతే ఎప్పుడూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాల్సిందే..

1. నేచురల్ స్కిన్ ప్రోడక్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. 

2. పండ్లతో తయారయ్యే నాన్ టాక్సిక్ క్లీనింగ్ ప్రోడక్ట్స్‌ను ఉపయోగించాలి.

3. ఇండోర్ మొక్కలకు కాలుష్యం యొక్క స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇంట్లో కానీ, మీరు పనిచేసే చోట కానీ, ఎయిర్ ఫిల్టర్ చాలా అవసరం.

4. కొద్దిపాటి డీహైడ్రేషన్ ఉన్నా నీరు తీసుకోవాలి.

5. ద్రాక్షలు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. 

6. ఆకుపచ్చని కూరగాయలు, ఎరుపు రంగు పండ్లు తీసుకోవాలి 

7. రెగ్యులర్ డైట్‌లో విటమిన్ సి తగినంత తీసుకోవడం వల్ల ముడతలు చర్మం పోతుంది. 

8. ఫ్యాట్‌ను తగ్గించే ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవాలి. 

9. నీటితో పాటు ఫ్రెష్ జ్యూస్‌లు తీసుకోవాలి. 

10. ఒత్తిడిని తొలగించే పనులతో ఎప్పుడూ బిజీగా ఉండాలి. అప్పుడే అందంగా ఉంటారు. 

Comments