చర్మం మరియు జుట్టు సౌందర్యానికి ముల్లంగి, ఏవిధంగా ఉపయోగించాలి

కూరగాయలలో ముల్లంగి రుచి అంటేనే గిట్టదు అనేకమందికి. తరచుగా దీనిని ఆహరం నుండి స్కిప్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, వాస్తవానికి దీనిని ప్రధానంగా సలాడ్లలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీనికి కారణం, ముల్లంగి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలంగా ఉంటుంది. మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ముల్లంగి ఒక పవర్ ప్యాక్డ్ వెజిటేబుల్ గా చెప్పబడుతుంది. ఇది అధిక బరువును తగ్గించడంలోనే కాకుండా, మన చర్మానికి మరియు జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి అవసరమైన పోషకాలను కూడా అధికంగా కలిగి ఉంటుంది.

ముల్లంగిలో ఉండే మినరల్స్, విటమిన్స్ మన చర్మం మరియు జుట్టుకు తగిన పోషణను అందివ్వడంలో ఎంతగానో సహాయపడగలవని సౌందర్య నిపుణులు సూచిస్తుంటారు. విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉన్న కారణంగా, ముల్లంగి చర్మ సౌందర్యానికి ఉత్తమ ఎంపికగా సూచించబడుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ మొదలగు మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ నిక్షేపాలు మీ చర్మానికి మరియు జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందివ్వగలవని సిఫార్సు చేయడమైనది.


అంతేకాకుండా ముల్లంగిలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మీ సౌందర్య పోషణలో అత్యుత్తమ సహాయసహకారాలను అందివ్వగలవు. ఇప్పుడు ముల్లంగి ఎంత అద్భుతమైన పదార్ధమో మీకు అర్దమైంది కదా. ఇక మీ సౌందర్య పోషణలో ముల్లంగిని ఏవిధంగా జోడించుకోవచ్చునో చూద్దాం. కానీ దానికన్నా ముందుగా, చర్మం మరియు జుట్టు సంరక్షణలో ముల్లంగితో కూడిన అనేక ఇతరత్రా ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

 చర్మం మరియు జుట్టు సంరక్షణలో ముల్లంగితో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు :

 • ముల్లంగి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

 • ముల్లంగి చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు డీటాక్సిఫై చేస్తుంది.

 • ఇది వివిధ రకాల చర్మ రోగాలను నివారిస్తుంది. 

• ముల్లంగి మొటిమలను, ఆక్నే సమస్యను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

 • ముల్లంగి బ్లాక్ హెడ్స్ ను ట్రీట్ చేస్తుంది. 

• చర్మానికి నేచురల్ గ్లో జోడించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 

• ముల్లంగి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. 

• జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. 

• చుండ్రు చికిత్సలో సహాయపడుతుంది.

 • మీ జుట్టుకు సహజ సిద్దమైన షైనింగ్ ను జోడిస్తుంది. 

చర్మ సంరక్షణలో ముల్లంగిని ఏవిధంగా ఉపయోగించాలి ?


1. మొటిమల చికిత్సలో : 

ముల్లంగిని తరచుగా ఉపయోగించడం మూలంగా, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా, మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడి, చర్మం నుండి మురికిని మరియు మలినాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 

కావలసిన పదార్ధాలు : 

• 1 టీస్పూన్ ముల్లంగి గింజలు

 • నీరు (తగినంత) 

ఉపయోగించు విధానం :

 • ముల్లంగి గింజలను మెత్తగా రుబ్బి పొడిలా చేసుకోవాలి.

 • దీనికి కొన్ని చుక్కల నీటిని జోడించి, మిశ్రమంగా తయారు చేసుకోడానికి బాగా కలపండి. 

• ఈ పేస్ట్ ను మీ ముఖం మీద నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయాలి. 

• అది పూర్తిగా ఎండిపోయేవరకు వదిలేయండి.

 • చల్లటి నీటిని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేయండి.


2. చర్మాన్ని హైడ్రేటింగ్ చేయడంలో : 

ముల్లంగి నీటి నిక్షేపాలను అధికంగా కలిగి ఉంటుంది, క్రమంగా చర్మాన్ని హైడ్రేట్ గా, సాఫ్ట్ గా మరియు మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాదం నూనె ఒక ఎమోలినెంట్ వలె పనిచేస్తుంది మరియు చర్మంలో తేమ నిలుపుదలకు సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, చర్మం ఆకృతిని మెరుగుపరచడంలోనే కాకుండా, ఫైన్ లైన్స్ మరియు ముడుతల వంటి వృద్దాప్య సంకేతాలను నిరోధిస్తుంది.

 కావలసిన పదార్ధాలు :

 • 1 టేబుల్ స్పూన్ తురిమిన ముల్లంగి 

• 1/2 టేబుల్ స్పూన్ పెరుగు 

• 5 చుక్కల బాదం నూనె 

ఉపయోగించు విధానం :

 • ఒక గిన్నెలో తురిమిన ముల్లంగిని తీసుకోండి.

 • దానికి పెరుగును చేర్చి బాగా కలియబెట్టండి. 

• చివరగా బాదం నూనెను జోడించి అన్నింటినీ మిశ్రమంగా కలపండి. 

• ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడకు సమపాళ్ళలో అప్లై చేయండి.

 • 15 నిమిషాలపాటు అలానే విడిచిపెట్టండి. 

• చల్లటి నీటిని ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.

3. బ్లాక్ హెడ్స్ చికిత్సలో : 

ముల్లంగిలోని విటమిన్ సి చర్మానికి ఎక్కువగా పోషణను అందిస్తుంది. మరియు బ్లాక్ హెడ్స్, మొటిమలు మొదలైన వాటితో పోరాడడానికి మీ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.

 కావలసిన పదార్దాలు : 

• 1 టేబుల్ స్పూన్ ముల్లంగి రసం

 ఉపయోగించు విధానం :

 • ముల్లంగి రసాన్ని ఒక గిన్నెలో తీసుకోండి. 

• అందులో ఒక కాటన్ ప్యాడ్ నానబెట్టుకోవాలి. 

• ఈ కాటన్ బాల్ లేదా కాటన్ పాడ్ను ఉపయోగించి, ముల్లంగి రసాన్ని ప్రభావిత ప్రాంతాపై అప్లై చేయండి.

 • 20 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

 • చల్లటి నీటిని ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.


4. టానింగ్ సమస్యను పరిష్కరించడంలో :

 ముల్లంగి మీ చర్మాన్ని కాంతివంతంగా చేయటానికి సహాయపడే ఆవశ్యక పోషకాలకు అద్భుతమూలంగా ఉంటుంది. అంతేకాకుండా, సన్ టాన్ తొలగించడానికి మరియు చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి నిమ్మ కూడా అత్యుత్తమ పదార్ధంగా చెప్పబడుతుంది. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని మాయిశ్చరైజ్డ్ గా ఉంచడంలో సహాయపడుతుంది మరియు హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని సమర్థవంతంగా రక్షిస్తుంది. క్రమంగా ఈ మూడు పదార్ధాల కలయిక, చర్మానికి టానింగ్ సమస్యను పరిష్కరించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పబడుతుంది. 

కావలసిన పదార్ధాలు : 

• 1 టేబుల్ స్పూన్ ముల్లంగి (తురుముకోవాలి) 

• 1/2 టీస్పూన్ నిమ్మ రసం 

• 4 నుండి 5 చుక్కల ఆలివ్ ఆయిల్ 

ఉపయోగించు విధానం : 

• ఒక గిన్నెలో తురిమిన ముల్లంగిని వేసి వేయించాలి.

 • దీనికి నిమ్మరసాన్ని చేర్చి మిశ్రమంగా కలపాలి. 

• తరువాత, ఈ మిశ్రమానికి ఆలివ్ నూనె జోడించి, మరలా అన్నింటినీ బాగా కలపవలసి ఉంటుంది. • మీ ముఖాన్ని కొంచెంగా తడిగా చేసుకోవాలి.

 • ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడ మీద నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయాలి.

 • 15 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

 • తరువాత చల్లని నీటితో శుభ్రం చేయండి.

5. చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేయడానికి..

 ఓట్స్ చర్మంలోని మృతకణాలను, మలినాలను తొలగించే క్రమంలో భాగంగా చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది. దీనితోపాటుగా, దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చిరాకుతో కూడిన చర్మానికి ఉపశమనాన్ని కలిగించగలదు. ఎగ్ వైట్లో ప్రోటీన్స్ అధికంగా ఉండటం మూలంగా చర్మాన్ని పునరుద్దరించడంలో సహాయపడుతుంది, అంతేకాకుండా ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ నివారిస్తుంది.

 కావలసిన పదార్ధాలు : 

• 1 టేబుల్ స్పూన్ ముల్లంగి రసం 

• 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్

 • 1 ఎగ్ వైట్ 

ఉపయోగించు విధానం : 

• ఒక గిన్నెలో ముల్లంగి రసాన్ని తీసుకోండి. 

• దీనికి ఓట్ మీల్ పౌడర్ వేసి బాగా కలియబెట్టాలి.

 • ఒక ఎగ్ వైట్ ను అందులో వేసి, మరలా అన్నింటినీ మిశ్రమంగా చేయాలి.

 • ఆ మిశ్రమాన్ని మీ ముఖంపై రాయాలి.

 • 10 నుండి 15 నిమిషాలపాటు అలానే వదిలేయండి. 

• మీ ముఖాన్ని కొన్ని సెకన్లపాటు వలయాకారంలో సున్నితంగా మసాజ్ వలె రుద్దండి. 

• తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. 

జుట్టుకు ముల్లంగిని ఎలా ఉపయోగించాలి ?


1. చుండ్రు చికిత్సలో ... 

ముల్లంగిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, చుండ్రును కలిగించే బ్యాక్టీరియాను అదుపు చేయడంలో సహాయం చేస్తాయి. క్రమంగా తలమీద చర్మ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. 

కావలసిన పదార్ధాలు :

 • ముల్లంగి 

ఉపయోగించు విధానం : 

• ముల్లంగి తొక్క తీసి, ముక్కలుగా చేయాలి. దీనిని గ్రైండ్ చేసి రసాన్ని వేరుచేసుకోవాలి..

 • ముల్లంగి రసంలో ఒక కాటన్ బాల్ ముంచి, మీ తలపై ముల్లంగి రసాన్ని పూయండి. 

• టవల్ ఉపయోగించి మీ తలను చుట్టండి. 

• 30 నిమిషాల పాటు అలానే వదిలేయండి.

 • తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయండి.

2. జుట్టు పెరుగుదలలో ... 

నల్ల ముల్లంగిలో జుట్టు పోషణకు సరిపడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లుగా చెప్పబడుతుంది. నల్ల ముల్లంగి రసాన్ని తరచుగా అప్లై చేయడం మూలంగా జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడగలదని చెప్పబడింది. 

కావలసిన పదార్ధాలు : 

• నల్ల ముల్లంగి

 ఉపయోగించు విధానం :

 • నల్ల ముల్లంగి తొక్క తీసి, ముక్కలుగా చేయండి. దీనిని గ్రైండ్ చేసి రసాన్ని వేరుచేయండి.

 • ఈ రసాన్ని మీ తలపై సున్నితంగా రుద్దండి.

 • టవల్ లేదా షవర్ కాప్ ఉపయోగించి మీ తలను కవర్ చేయండి. 

• 1 గంటపాటు అలానే వదిలేయండి.

 • తరువాత నీటిని ఉపయోగించి బాగా రుద్ది కడగాలి.

 • తలస్నానానికి సాధారణ షాంపూ వినియోగించండి.


Comments