కళ్లు ఎంత చక్కగా ఉంటే ముఖం అంత అందంగా కనిపిస్తుంది. అయితే, కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు (డార్క్ సర్కిల్స్) అందానికి అడ్డంగా మారుతాయి. ప్రతి 10 మందిలో ఆరుగురికి ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్య సమస్యల వల్ల ఈ నల్లని వలయాలు ఏర్పడుతున్నాయని సర్వేలు తెలుపుతున్నాయి. ఈ 5 చిట్కాలతో ఇంటి వద్దే వాటిని మాయం చేసుకోవచ్చు.
1. బంగాళ దుంప రసం:
పచ్చి బంగాళా దుంపతో జ్యూస్ చేయండి. ఆ జ్యూస్‌లో దూది ముంచండి. కళ్లు మూసుకుని నల్ల వలయాలు కవరయ్యేలా ఆ దూదిని పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వాటిని తొలగించి చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.
2. టమోటాలు:
ఒక టీస్పూన్ టమోటా రసంలో టీస్పూన్ టమోటా రసం మిక్స్ చేయండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని కళ్ల కింద డార్క్ సర్కిళ్లకు అద్దండి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ టమోటా, నిమ్మ రసాన్ని తాగినా కూడా నల్ల వలయాలు మాయమవుతాయి.
3. చల్లని టీ బ్యాగ్స్:
గ్రీన్ టీ బ్యాగ్‌లను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టండి. అవి చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకోండి. రోజూ ఇలా చేస్తే కళ్ల కింద నల్ల వలయాలు క్రమేనా తగ్గుముఖం పడతాయి.
4. ఆరెంజ్ జ్యూస్:
కొన్ని గ్లిసరిన్ చుక్కల్లో ఆరెంజ్ రసాన్ని కలిపండి. ఆ మిశ్రమాన్ని కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌కు రాయండి. ఇలా చేయడం వల్ల నల్ల వలయాలే కాదు, కళ్లు కూడా కాంతివంతంగా కనిపిస్తాయి.
5. దోసకాయ:
కళ్ల కింద నల్ల వలయాలను మాయం చేయడంలో దోసకాయ బాగా పనిచేస్తుంది. దోసకాయ ముక్కలను ఫ్రిజ్‌లో 30 నిమిషాలు ఉంచండి. తర్వాత వాటిని కళ్లపై పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత వాటిని తీసి చల్లని నీటితో కళ్లను శుభ్రం చేసుకోండి.

Comments
Post a Comment