రోజూ రాత్రి పడుకోటానికి ముందు ఒక చెంచా ఆ రసాన్ని తేనెతో కలిపి...

వేసవిలో ఎండలలో తిరగడం వలన చర్మం కాంతిని కోల్పోయి కాంతివిహీనంగా మారుతుంది. మనకు సహజసిద్దంగా లభించే కొన్ని పదార్దాలతో మనం ఈ సమస్యను నివారించుకోవచ్చు. అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో లభించే పదార్దాలతోనే మనం ఈ సమస్యను నివారించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

1. యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే తేనె చర్మాన్ని సున్నితంగా మార్చటమే కాకుండా, యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఒక చెంచా తేనెను తీసుకొని, దానికి చిటికెడు దాల్చిన చెక్క కలిపి ముఖాన్నికి అప్లై చేయాలి. కొద్ది సమయం తరువాత కడిగి వేయండి. ఇలా రోజు చేయటం వలన ముఖం కాంతి రెట్టింపు అవుతుంది.

2. యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ సిఅధికంగా కలిగి ఉండే ఉసిరి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. దీనితో పాటుగా చర్మ నిర్మాణాన్ని సరి చేస్తుంది. రోజు రాత్రి పడుకోటానికి ముందు ఒక చెంచ ఉసిరిరసాన్ని, ఒక చెంచా తేనెను కలపి ముఖానికి అప్లై చేసి పడుకోండి. మరుసటి రోజు కడిగి వేయాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది.

3. పెరుగు వలన ఆరోగ్యానికే కాదు, సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును మన చర్మానికి అప్లై చేసి కొద్ది నిమిషాల పాటూ అలాగే ఉంచి కడగి వేయండి. దీనిలో ఉండే లాక్టిక్ ఆసిడ్ చర్మ రంద్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలను తొలగించి, పాల వంటి చర్మాన్ని అందిస్తుంది.

4. టమోటాను తెసుకొని గుజ్జుగా మార్చి, దీనికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కనీసం ఇరవైనిమిషాల పాటు ఉంచి, తరువాత కడిగి వేయాలి. టమోటాలో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం, సూర్యకాంతి వలన డల్‌గా మారిన చర్మాన్ని తిరిగి పునరుద్దరణకు గురి చేస్తుంది. అంతేకాకుండా, చర్మ నిర్మాణాన్ని మరియు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.

Comments