చాలా మంది మహిళలు తమ ముఖ సౌందర్య పరిరక్షణపై నానా తంటాలు పడుతుంటారు. ఇందుకోసం మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీమ్‌లను వాడుతుంటారు. అయినప్పటికీ.. వారి ముఖ చర్మ సౌందర్యంలో పెద్దగా మార్పు కనిపించక పోవడంతో బాధ పడుతుంటారు. ముఖ్యంగా ప్రకృతి వనమూలికలతో ముఖ చర్మసౌందర్యాన్ని కాపాడుకునేందుకు వారు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే, ఒక్క పైసా ఖర్చు లేకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించే సాధనంగా కలబంద పని చేస్తుందనే విషయాన్ని వారు మరిచిపోతారు. ఈ విషయాన్ని వైద్యులు కూడా స్పష్టంగా చెప్పినా పెద్దగా శ్రద్ధ చూపరు.
వాస్తవానికి మనకు అందుబాటులో ఉండే కలబంద ఆకుల్లో నీటిని పీల్చుకునే గుణం అధికంగా ఉంటుంది. కలబంద రసాన్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. శరీర చర్మం కాలిపోతే కలబంద రసాన్ని కాలిన గాయాలపై పూతలా పూస్తే గాయాలు కొన్ని రోజుల్లోనే మటుమాయమవుతాయని చెపుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అలాగే, రోజ్ వాటర్‌లో కలబంద రసాన్ని కలుపుని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుందని వారు చెపుతున్నారు. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు ఒక్క రోజులో కనిపించకుండా పోతాయంటున్నారు.
Comments
Post a Comment