అవకాడో మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

గంధపు పొడిలో తేనెను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకుంటే కూడా నల్లటి వలయాలు తొలగిపోతాయి.
అవకాడోని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం ముడతలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. గులాబీ ఆకులు పొడిచేసుకుని అందులో కొద్దిగా బాదం నూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం అందంగా, తెల్లగా మారుతుంది. 

దానిమ్మ గింజలను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా కీరదోస మిశ్రమాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 

Comments