గులాబీ పువ్వులు వాడిపోతే వాటిని పారేయకుండా నీడలో రెండుమూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. తడిపూర్తిగా పోయాక అరకప్పు వేడినీటిలో వేసి మూత పెట్టుకోవాలి. ఆ నీరు చల్లారిన తరువాత వడకట్టుకుని స్నానం చేసే నీటిలో కలుపుకుంటే పొడి చర్మం కాస్త మృదువుగా మారుతుంది. అరకప్పు నీళ్లను మరిగించుకుని వాటిలో గుప్పెడు ఎండిన గులాబీ, మందార పువ్వుల రేకులను వేసి మూత పెట్టుకోవాలి.
5 నిమిషాల తరువాత ఈ నీటిని వడగట్టి అరచెంచా కొబ్బరినూనెను, పావుచెంచా మెత్తటి ఉప్పును కలుపుకుని ఒంటికి రాసుకోవాలి. అరగంట తరువాత స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఎండిన చామంతి పువ్వులను 5 తీసుకుని కొద్దిగా కొబ్బరినూనెలో కలుపుకుని ముద్దలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్స్ ఓట్స్ అవిసెగింజల పొడిని కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా మారుతుంది. కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మనూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

Comments
Post a Comment