గులాబీ నీళ్లతో కళ్ల కింద వలయాలు మాయం...!!

కళ్ల కింద నల్లటివలయాలు ఏర్పడడానికి ముఖ్య కారణం నిద్రలేమి, ఒత్తిడి. కనుక వీలైనంత వరకూ ఈ రెండింటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. దానితోపాటు కాస్త సమయం కేటాయించి ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని చిట్కాలు పాటిస్తే కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టవచ్చు. 

* బాదం నూనెను ప్రతిరోజూ రాత్రి పడుకొనే ముందు కళ్ల కింద రాసి మర్దన చేస్తే క్రమంగా నల్లటివలయాలు తగ్గుముఖం పడుతాయి.

* రెండు చెంచాల టమాటారసంలో చెంచా నిమ్మరసం కలిపి నల్ల మచ్చల మీద రాసి పావుగంటయ్యాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

* గులాబీనీళ్లలో దూదిని నానబెట్టి కళ్ల కింద అప్పుడప్పుడూ తుడుస్తూ ఉంటే నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.

* ఎర్రకందిపప్పును పొడిగా చేసి అందులో చిటికెడు పసుపు, టమాటా, నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకొని పూతలా వేసుకొని ఇరవై నిమిషాలయ్యాక కడిగేస్తే క్రమంగా తగ్గిపోయి, మచ్చలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

Comments