ముఖం ముడతలు పడకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు.....

కొందరికి నవ్వినపుడు కళ్ల దగ్గర, పెదవుల పక్కన ముడతలు కనిపిస్తాయి. ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవాలంటే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడకం మెుదలుపెట్టాలి. ఈ క్రీములు ముఖంపై సన్నని గీతలను నియంత్రిస్తాయి. ముడతలు రాకుండా ఉండాలంటే ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. 
అలాగే కోపాన్ని, ఆవేశాన్ని కూడా తగ్గించుకుంటే మంచిది. 30 ఏళ్లు దాటితే ముఖచర్మంపై ముడతలు మెుదలవుతాయి. అలాకాకుండా ఉండాలంటే మీరు తీసుకోవలసి జాగ్రత్తలు.

20 ఏళ్లు దాటినవాళ్లు సన్ స్క్రీన్ వాడకం మొదలుపెట్టాలి. 35 ఏళ్లు దాటిన వాళ్లు యాంటి రింకిల్ క్రీమ్స్, మాయిశ్చరైజర్లు వాడాలి. చర్మానికి మేలు చేసే విటమిన్ ఇ ఉండే చేపలు ఆహారంలో చేర్చుకోవాలి. కాలుష్యానికి గురికాకుండా బయటకు వెళ్ళినప్పుడల్లా ముఖాన్ని కప్పుకోవాలి. బయటకు వెళ్లొచ్చిన ప్రతీసారి ముఖాన్ని నీళ్లలో కడుక్కోవాలి.

ఎటువంటి పరిస్థితుల్లోనూ మేకప్‌తో రాత్రివేళ నిద్రించకూడదు. రక్తహీనత వల్ల ముఖంపై తెల్ల మచ్చలు రాకుండా ఉండాలంటే ఆకుకూరలు తీసుకోవాలి. ప్రతి మనిషికి రోజుకి 8 గ్లాసుల నీళ్లు 8 గంటల నిద్ర తప్పనిసరి. యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకుంటే ముఖం ముడతలు పడకుండా ఉంటుంది.

Comments