మెరిసే చర్మం కోసం ఆలోవెరా, పాల మీగడ ఫేస్ మాస్క్

ప్రతిఒక్కరికీ కాంతివంతమైన చర్మం కావాలనే ఉంటుంది. కానీ కాంతివంతమైన మెరిసే చర్మం కావాలంటే సరైన సంరక్షణ, ఎండ నుంచి,కాలుష్యం నుంచి, పాడవుతున్న వాతావరణం నుంచి రక్షణ అవసరం. మెరిసే చర్మం కోసం ఆలోవెరా ఇంకా పాల మీగడ కలిపి వాడాలని ప్రత్యేకంగా చాలామంది చర్మనిపుణులు సూచించారు.
మేము ఈ అద్భుతమైన పదార్థాలు కలిసివుండే ఒక సూపర్ ఫేస్ ప్యాక్ తో మీ ముందుకు వచ్చాం. ఇది వాడి మీ పర్ఫెక్ట్ చర్మాన్ని పొందండి.
మనం అందులోకి వెళ్ళేముందు మీరు ఇప్పటికే ఆలోవెరా,పాలమీగడ ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తున్నారు, కదా?ఆయుర్వేదంలోనే కాక అనేక పుస్తకాలలో కూడా ఈ పదార్థాలు అందాన్ని పెంచుతాయని తెలపబడ్డాయి. విడివిడిగా కూడా ఈ పదార్థాలు మీ చర్మం అందంగా ఉండటంలో చాలా సాయపడతాయి.

అయితే మనం ఆలోవెరా, పాలమీగడ ఫేస్ ప్యాక్ మన చర్మం కాంతివంతంగా మారటానికి, అందాన్ని నిలిపివుంచటానికి ఎందుకంత ప్రత్యేకమో మొదటగా తెలుసుకుందాం.

ఆలోవెరా లాభాలు

ఆలోవెరా చాలా లాభాలనిచ్చే, ఉపయోగపడే మొక్కల్లో ఒకటి. ఇది మీ రక్తప్రసరణను, జీర్ణశక్తిని మెరుగుపర్చటమేకాక మీ శరీరంలో విషాలను కూడా తొలగిస్తుంది. ఉన్న చాలా లాభాలలో ఆలోవెరా యొక్క చర్మాన్ని బాగుచేసే, ఉపశమనపర్చే గుణం ప్రసిద్ధి చెందింది.

ఆలోవెరా ముఖ్యంగా కమిలిపోయిన చర్మం, మంటల వల్ల గాయాలు, అలర్జీలు, మంట, మొటిమలని నయం చేయటంలో ఉపయోగపడుతుంది. ఈ లాభాలనిచ్చే మొక్క చాలామంది ఇళ్ళ పెరట్లో లేదా పూల కుండీలలో కన్పిస్తుంది.చాలా సులభంగా వాడగలిగే దీని ప్రొసీజర్ ఫేసు మాస్కులుగా మొటిమలను తగ్గించి, ఎటువంటి వాపులకైనా, చర్మానికి నొప్పికైనా, మంటకైనా ఉపశమనం కలిగిస్తుంది.

పాల మీగడ లాభాలు

పాలపై కట్టే మందపాటి పసుపు రంగు కొవ్వు,ప్రొటీన్ పొరలా ఏర్పడే తెట్టును మీగడ అంటారు.ఈ మీగడను సాధారణంగా తీసేస్తారు, పంచదారతో కలుపుకుని లేదా నేరుగా తినేస్తారు, లేదా వంటల్లో వాడతారు.పాల మీగడను చాలా రుచికరమైన వంటలలో, స్వీట్లలో భాగంగా వాడతారు.

మన వంటిల్లే కాకుండా, పాల మీగడకి అందాల పనుల్లో చాలా ముఖ్య పాత్ర ఉంది. ఆయుర్వేదంలో చాలా శతాబ్దాలుగా భారతీయ స్త్రీలకి దీన్ని అందం కోసం సూచించారు. నిజానికి పసుపు, సున్నిపిండుల తర్వాత పాల మీగడే చర్మ సమస్యలన్నిటికీ, అందంకు ప్రభావవంతమైన సరైన చిట్కాగా సూచించబడింది.

ఆలోవెరా, పాలమీగడ మాస్క్

చర్మాన్ని హీల్ చేసే గుణం,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుండే ఆలోవెరాను మనవైపు చాలా సంప్రదాయ పద్ధతుల్లో,చాలా కాలంగా వైద్యంలో వాడుతూ వస్తున్నారు. నిజానికి, ఆలోవెరాను కేవలం నేరుగా కాలిన చర్మంపై రాసేస్తే చిన్న రకం కాలిన గాయాలు తగ్గిపోతాయి.
ఈ అద్భుతమైన ఆలోవెరా మీ కమిలిన చర్మం, గుర్తులు, ఇంకా మీ మొటిమలు కూడా తగ్గించటంలో సాయపడుతుంది. ఆలోవెరా జెల్ ను మాత్రమే వాడితే సున్నితమైన చర్మం ఉన్న వారికి చర్మం ఎండిపోయినట్లుగా మారిపోతుంది.
అందుకని దీన్ని మరింత ఉపశమనాన్నిచ్చే, ఎక్కువ తేమను ఇచ్చే పాలమీగడతో కలిపాం.పాల మీగడతో ఉండే క్రీంలో తేమగా, పోషణనిస్తూ ఉండి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనిచ్చి మీ చర్మాన్ని ఫర్ఫెక్ట్ గా, అందంగా తయారుచేసి వస్తుంది.

ఆలోవెరా, పాలమీగడ ఫేస్ మాస్క్ ను తయారుచేయటం

కావాల్సిన వస్తువులు
ఆలోవెరా జెల్ -2 చెంచాలు
పాల మీగడ - 1/4వ కప్పు
ఎలా తయారుచేయాలి ;
1.పావు కప్పు తాజా పాల మీగడను శుభ్రమైన బౌల్ లో తీసుకోండి.
2.తర్వాత రెండు చెంచాల తాజా ప్రాసెస్డ్ ఆలోవెరా జెల్ ను వేయండి.
3. ఆఖరుగా, రెండింటినీ కాసేపు బాగా కలపాలి.

ఎలా వాడాలి

1.బాగా మిక్సీ పట్టాక, మీరు ఈ ఫేస్ మాస్కును వేళ్లతో లేదా బ్రష్ తో నేరుగా ముఖంపైనే రాసుకోండి.
2.30 నిమిషాలు ఆగి, చర్మం మొత్తం ఆలోవెరా, పాల క్రీము మిశ్రమంలోని పోషకాలు, తేమను పీల్చుకోనివ్వండి.
3.గోరువెచ్చని నీటితో కడిగేసి, మెత్తని టవల్ తో మొహాన్ని అద్దుకోండి.

Comments