ఇంటి వద్ద కూర్చుని మెరిసే చర్మాన్ని ఎలా సొంతం చేసుకోవాలి....?

ఎవరికి మాత్రం తాము మెచ్చే ప్రముఖులకు మల్లే మచ్చలేని మెరిసే చర్మం సొంతం చేసుకోవాలని ఉండదు చెప్పండి? కానీ దానిని సొంతం చేసుకోవడాం మాత్రం అంత కష్టతరమేమి కాదు. అవును, మీరు చదివింది నిజమే! ఈ కధనం ద్వారా మెరిసే మేని సోయగాన్ని ఎలా మీ సొంతం చేసుకోవాలో తెలియజేస్తున్నాం.

 చాలావరకు, కాలుష్యం, వాతావరణ మార్పులు, జీవనశైలి మార్పులు, అధికంగా మద్యం సేవించడం, పొగ త్రాగడం, హార్మోన్ల మార్పులు మొదలైన కారణాల వలన, చర్మంపై నల్లని మచ్చలు, మరకలు, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, ఇంట్లో సరైన సంరక్షణ చర్యలు చేపడితే, ఇటువంటి సమస్యలనన్నింటిని చిటికెలో మాయం చేయవచ్చు. ఈ సమస్యలకు తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కారాలను చేపట్టవచ్చు.
మేకప్ ద్వారా తాత్కాలికంగా మన చర్మం పై మచ్చలను, గాట్లను, మరకలను దాచిపెట్టవచ్చు. కానీ ఈ తాత్కాలిక పరిష్కారాలను ఎవరు ఇష్టపడతారు. అవునా? కాదా? మేకప్ సామాగ్రిపై ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెట్టడానికి మనకు మనసు అంగీకరించదు. 

కనుక, సులభంగా, ఇంటివద్దనే చేసుకోగలిగే సహజమైన పరిష్కారాలు లభ్యమైనప్పుడు, చర్మానికి చేటు చేసే ఖరీదైన పరిష్కారాలను ఎందుకు అవలంబించాలి? ఇప్పుడు మనం మీ చర్మాన్ని, ఇంట్లోనే కూర్చుని, ఎల్లప్పుడూ మన వంటగదిలో లభ్యమయ్యే సహజ పదార్ధాలతో మచ్చలేని, అందమైన చర్మాన్ని పొందవచ్చో తెలుసుకుందాం!

1. కొబ్బరినూనె:

 కొబ్బరినూనెలోని యాంటి మైక్రోబియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. అంతేకాక అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. 

కావలసిన పదార్థాలు:

 కొబ్బరినూనె దూది ఉండ

 వాడే విధానం:

 1. ముందుగా కొబ్బరినూనె తీసుకుని సన్నని సెగపై వేడిచేయండి.

 2. మునివేళ్ళతో నునివెచ్చని కొబ్బరినూనెను ముఖమంతటా సున్నితంగా మర్దన చేసుకోండి. 

3. పది పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి, చర్మంపై అధికంగా మిగిలిన నూనెను దూదితో తుడిచేయాలి.

 4. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే, మెరిసే చర్మం మీ సొంతం.

2. నిమ్మకాయ: 

నిమ్మకాయలోని విటమిన్ సి ముఖంపై మచ్చలను తొలగించి, మేనిఛాయను మెరుగుపరుస్తుంది.

 కావలసిన పదార్థాలు: 

నిమ్మకాయ

 వాడే విధానం:

 1. ముందుగా, నిమ్మకాయను రెండు ముక్కలు చేయండి. 

2. ఒక ముక్కను తీసుకుని నేరుగా ముఖానికి రుద్దండి. 

3. ఇలా కొన్ని నిమిషాల పాటు చేయండి. 

4. తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కుని పొడిగా తుడుచుకోండి.

 5. తరువాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోండి.

3. ఆపిల్ సిడర్ వెనిగర్: 

ఆపిల్ సిడర్ వెనిగర్ లో ఆమ్లం చర్మం పై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది. మృతకణాలను తొలగి పోయినప్పుడు చర్మం తేటుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. 

కావలసిన పదార్థాలు: 

ఆపిల్ సిడర్ వెనిగర్ ఒక కప్పు 
నీరు 
దూది ఉండ 

వాడే విధానం: 

1. ఒక భాగం ఆపిల్ సిడర్ వెనిగర్ లో ఒక భాగం నీరు వేసి బాగా కలిసేలా కలపండి. 

2. ఈ మిశ్రమంలో దూది ముంచి, శుభ్రపరచుకున్నముఖం పై రాసుకోవాలి. 

3. రాత్రంతా వదిలేసి మరుసటి రోజు ఉదయం ముఖాన్ని కడుక్కోండి. 

4. ప్రతిరోజూ పడుకునే ముందు ఇలా చేస్తే మంచి ఫలితాలు త్వరగా కలుగుతాయి.

4. తేనె: 

తేనెలో విటమిన్లు మరియు ఖనిజాలు చర్మానికి పోషణను అందిస్తాయి. దీనిలోని ఫ్లావనాయిడ్లు మచ్చలేని, మెరిసే చర్మాన్ని అందిస్తాయి. 

కావలసిన పదార్థాలు: 

ఒక టీ స్పూన్ తేనె 

వాడే విధానం: 

1. ముందుగా ముఖాన్ని శుభ్రపరుచుకుని, తేనేని ముఖమంతటా రాసుకోవాలి.

 2. వేలికొనలను వలయాకారంలో కదుపుతూ మృదువుగా మర్దన చేసుకోవాలి. 

3. పదిహేను నిమిషాలు తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. 

4. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5. కలబంద:

 కలబంద గుజ్జు మన చర్మంలో తేమను పునరుద్ధరించి, ముఖంపై మొటిమలను, మచ్చలను తొలగిస్తుంది.

 కావలసిన పదార్థాలు:

 కలబంద ఆకు

 వాడే విధానం: 

1. ఒక తాజా కలబంద ఆకును తీసుకోండి. 

2. దానిని కట్ చేసి, లోపల నుండి గుజ్జును వెలికితీయండి. 

3. దీనిని ముఖానికి పూసుకుని 20 నిమిషాలు ఆరనిచ్చిన తరువాత, చల్లని నీటితో శుభ్రం చేయాలి.






Comments