సాధారణంగా మన రెగ్యులర్ డైట్ లో పంచదార తప్పని సరిగా తీసుకొనే ఒక ఆహార పదార్థం. పంచదారను రోజులో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటాం . అయితే అధికంగా పంచదారను ఉపయోగించే వాళ్ళు బరువు పెరగడం మాత్రం కాయం. ఇంకా పంచదారను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మానికి కూడా హానీ కలిగిస్తుంది. చర్మ మీద ముడుతలు మరియు బ్రేక్ అవుట్స్ ఏర్పడుతాయి. అయితే అంత ఖచ్చితంగా వెంటనే పంచాదారను మానేయాలని లేదు. తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అన్ని రకాల శ్రేయస్కరం. అయితే ఎక్స్ టర్నల్ గా పంచదార వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మొటిమలను నివారించడాని పంచదారను స్ర్కబ్బింగ్ ఉపయోగించవచ్చు. పెదాలు సున్నితంగా తేమగా ఉండేందుకు ఉపయోగించవచ్చు . లిప్ స్టిక్ ఎక్కువ సమయం పెదాల మీద నిలిచి ఉండేందుకు బాగా సహాపడుతుంది. ఇన్ని ప్రయోజనలు కలిగిన ఉన్న పంచదారను వైట్ గోల్డ్ అంటారు. మరి ఈ వైట్ గోల్డ్ (పంచదార)తో బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
వయస్సు మీద పడనియ్యకుండా చేస్తుంది: మీ రెగ్యులర్ డైట్ లో పంచదారను తీసుకోవడం వల్ల చర్మ మీద ముడుతలు ఏర్పడటానికి కారణం అయితే, పంచదారను ఎక్స్ ఫ్లోయేట్ గా ఉపయోగించినప్పుడు ముడుతలను తొలగిస్తుంది. ముఖం మీద వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తుంది. పంచదార-నిమ్మరసం కలిపి ముఖానికి స్ర్కబ్ చేయడం వల్ల ఏజ్ స్పాట్స్ తొలగింపబడుతుంది. అంతే కాదు మీ ముఖం మీద మంచి ఛాయను ఏర్పరుస్తుంది. ఈ స్ర్కబ్బింగ్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల వృద్ధాప్య ఛాయలను పైకి తెలియకుండా దాచుతుంది. దాంతో మీరు యంగ్ గా కనపబడవచ్చు. పంచదారను టానింగ్ గా కూడా ఉపయోగించవచ్చు. డార్క్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది.
మరి ఇన్ని సుగుణాలున్న పంచదారు ఇంటర్నల్ గా తక్కువ మోతాదులో ఎక్స్ టర్నల్ గాఎక్కువ మోతాదులో తీసుకోవడం ఇటు ఆరోగ్యంతో పాటు అటు అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
వయస్సు మీద పడనియ్యకుండా చేస్తుంది: మీ రెగ్యులర్ డైట్ లో పంచదారను తీసుకోవడం వల్ల చర్మ మీద ముడుతలు ఏర్పడటానికి కారణం అయితే, పంచదారను ఎక్స్ ఫ్లోయేట్ గా ఉపయోగించినప్పుడు ముడుతలను తొలగిస్తుంది. ముఖం మీద వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తుంది. పంచదార-నిమ్మరసం కలిపి ముఖానికి స్ర్కబ్ చేయడం వల్ల ఏజ్ స్పాట్స్ తొలగింపబడుతుంది. అంతే కాదు మీ ముఖం మీద మంచి ఛాయను ఏర్పరుస్తుంది. ఈ స్ర్కబ్బింగ్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల వృద్ధాప్య ఛాయలను పైకి తెలియకుండా దాచుతుంది. దాంతో మీరు యంగ్ గా కనపబడవచ్చు. పంచదారను టానింగ్ గా కూడా ఉపయోగించవచ్చు. డార్క్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది.
చర్మానికి తగినంత తేమను అంధిస్తుంది:
డెడ్ స్కిన్ సెల్స్ ముఖ చర్మం మీద పేరుకుపోవడాన్ని పంచదార ఉపయోగించడం వల్ల తగ్గించుకోవచ్చు. ఇంకా చర్మ లోని నూనె గ్రంథులను బ్యాలెన్స్ చేసి రీస్టోర్ చేస్తుంది . అందవల్ల మీ చర్మం ఎక్కువ కాలం మాయిశ్చరైజరగా ఉంటుంది. అంతే కాదు వివిధ రకాల చెడు టాక్సిన్ (విషాల)నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. పంచదార పొడి చర్మ నుండి విముక్తి పొందేలా చేస్తుంది. ఎప్పుడైతే చర్మానికి నేచురల్ ఆయిల్స్ ఆయిల్స్ ఆయిల్, బాదాం ఆయిల్, మరియు జోబాబా ఆయిల్ వంటివి చర్మాన్ని మర్ధన చేయడం వల్ల చర్మం ఎల్లప్పుడు తేమగా ఉంటుంది.
అద్భుతమైన క్లెన్సర్:
పంచదార వల్ల ఓ అద్బుతమైన బ్యూటీ బెనిఫిట్ ఏంటంటే పంచదారలో ఉండో గ్లైకోలిక్ యాసిడ్, ఉండటం వల్ల ఇది డెడ్ స్కిన్ సెల్స్ మరియు చర్మ దిగువను పేరొకొన్న దుమ్ము మరియు ధూలిని తొలిగించి చర్మాన్ని క్లీన్ గా ఉంచుతంది. చర్మ రంధ్రాలను పూర్తిగా శుభ్రపరిచ మొటిమలను, మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. ఇది వివిధ రకాల టాక్సిన్స్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. రెండు చెంచాల పంచదారలో కొన్ని చుక్కల తేనె మరియు బాదాం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి చర్మ మీద మర్ధన చేయాలి.
చర్మాన్ని కాంతి వంతంగా మార్చుతుంది:
మీ ముఖం మీద ఉన్న చర్మం 15-30రోజుల్లో మృత కణాలతో కప్పబడుతుంది. పంచదారలో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ ఈ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి అదే స్థానంలో కొత్త కనాల ఉత్పత్తికి సహాయపడుతుంది. పంచదారను ఉపయోగించడం చర్మ స్మూత్ గా ఉంటుంది. పంచదారతో స్ర్కబ్ చేయడం, హైడ్రేటింగ్ షుగర్ స్ర్కబ్ చేయవచ్చు. ఒక చెంచా పంచదారకు ఒక చెంచా నువ్వుల నూనె మరియు యూకలిప్టస్ ఆయిల్ ను మిక్స్ చేసి స్ర్కబ్ చేయడం వల్ల చర్మ తేమగా ఉంటుంది.
లిప్ కేర్ :
చాలా మంది మహిళలు పెదాల మీద పొడి బారిన, ఎండిన చర్మంతో బాధపడుతుంటారు. కాబట్టి పంచదారతో పెదాలను సున్నితంగా మాయిశ్చరైజింగ్ గా ఉంచుకోవచ్చు . ఆలివ్ ఆయిల్ లో కాస్ట్రో సుగర్ వేసి బాగా మిక్స్ చేసి పెదాల మీద స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు కాంతివంతంగా సున్నితంగా మెరుస్తుంటాయి. డల్ నెస్ తగ్గిపోతుంది. ఇంకా పంచదారను లిప్ గ్లాస్ గా కూడా ఉపయోగించి లిప్ స్టిక్ ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చేస్తుంది.మరి ఇన్ని సుగుణాలున్న పంచదారు ఇంటర్నల్ గా తక్కువ మోతాదులో ఎక్స్ టర్నల్ గాఎక్కువ మోతాదులో తీసుకోవడం ఇటు ఆరోగ్యంతో పాటు అటు అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
Comments
Post a Comment