చర్మాన్ని అందంగా మార్చే ఆల్ నేచురల్ అలోవెరా ఫేసియల్ క్లీన్సర్ రెసిపీస్

క్లియర్ స్కిన్ ని మెయింటైన్ చేయడం కోసం ఫేస్ క్లీన్సర్ ని విస్తృతంగా ఉపయోగిసారు. నిజానికి, ఫేస్ ని రోజుకు రెండుసార్లు క్లీన్సింగ్ చేసుకోవాలి.

స్కిన్ కేర్ రొటీన్ లో క్లీన్సింగ్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ముని ధూళిని తొలగించి చర్మానికి తాజా మరియు రిఫ్రెషింగ్ అపియరెన్స్ ను అందిస్తుంది.

అయితే, ఈ రోజుల్లో, మార్కెట్ లో లభ్యమయ్యే ఫేషియల్ క్లీన్సర్స్ లో ఎక్కువ కెమికల్స్ లోడై ఉంటున్నాయి. కెమికల్స్ తో నిండిన ఈ ప్రోడక్ట్స్ ని వాడితే చర్మం తన సహజసిద్ధమైన ఆయిల్ ను ఉత్పత్తి చేయడం మానుకుంటుంది.
అందుకే, ఈ రోజుల్లో చాలా మంది మహిళలు హోంమేడ్ క్లీన్సర్స్ కే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంట్లోనే క్లీన్సర్స్ ని తయారుచేసుకునేందుకు ఎన్నో రకాల ప్రోడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో, అలోవెరా జెల్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

ఈ పదార్థంలో స్కిన్ సూతింగ్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మం ఆరోగ్యాన్ని సంరక్షించి చర్మాన్ని అందంగా మారుస్తాయి.

ఇక్కడ, కొన్ని అలోవెరా ఫేషియల్ క్లీన్సర్ రెసిపీల లిస్ట్ ను తయారు చేసాము. వీటిని వాడి చర్మాన్ని అందంగా మార్చుకోండి.

1. రోజ్ వాటర్ తో అలోవెరా:

 ఎలా వాడాలి:
 - ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ లో రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ ను కలపండి.

 - దీనిని చర్మంపై స్క్రబ్ చేసి వెచ్చటి నీటితో రిన్స్ చేయండి.

- తేలికపాటి టోనర్ ను అప్లై చేయండి.
లాభాలు:
ఈ హోంమేడ్ ఫేషియల్ క్లీన్సర్ అనేది స్కిన్ టోన్ ని ఈవెన్ గా ఉంచేందుకు తోడ్పడుతుంది.

2. కొబ్బరినీళ్లతో అలోవెరా జెల్: 

ఎలా వాడాలి:
- ఒక పాత్రలో రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ ను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినీళ్లను తీసుకోండి.

- ఈ పదార్థాలను బాగా కలిపి ముఖంపై స్క్రబ్ చేసుకోండి.

- గోరువెచ్చటి నీటితో ముఖాన్ని రిన్స్ చేసుకోండి.
లాభాలు:
 ఈ కాంబినేషన్ మీ చర్మాన్ని మరింత బ్రైట్ గా అలాగే తాజాగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

3. టమాటో పల్ప్ తో అలోవెరా జెల్: 

ఎలా వాడాలి:
- ఒక టీస్పూన్ టమాటో పల్ప్ ను తీసుకుని అందులో రెండు లేదా మూడు టీస్పూన్ల అలోవెరా జెల్ ను కలపండి.

- ఈ క్లీన్సర్ తో ముఖంపై అలాగే నెక్ పై క్లీన్సింగ్ చేసుకోండి.

 - గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని రిన్స్ చేసుకోండి.

- చర్మంపై తడిని తుడుచుకుని తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.
లాభాలు:
 ఈ ఆల్ నేచురల్ ఫేషియల్ క్లీన్సర్ అనేది చర్మంపై దుమ్మును తొలగిస్తుంది. చర్మానికి మెరుపును అందిస్తుంది.

4. దోసకాయ నీటితో అలోవెరా జెల్:

 ఎలా వాడాలి:
 - ఒక టేబుల్ స్పూన్ దోసకాయ నీటిలో రెండు లేదా మూడు టీస్పూన్ల తాజా అలోవెరా జెల్ ను కలపాలి.

- ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి.

- గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయాలి.
 లాభాలు:
ఈ హోంమేడ్ ఫేషియల్ క్లీన్సర్ ని వాడితే యాక్నే స్కార్స్ తొలగిపోతాయి. చర్మం తేటగా అలాగే కాంతివంతంగా మారుతుంది.

5. ఓట్స్ తో అలోవెరా జెల్: 

- అర టీస్పూన్ ఓట్ మీల్ లో రెండు లేదా మూడు టీస్పూన్ల అలోవెరా జెల్ ను కలపాలి.

 - బాగా కలిపి క్లీన్సింగ్ మెటీరియల్ ను తయారుచేయాలి.

- ముఖంపై అలాగే మెడపై స్క్రబ్ చేయాలి.

- గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయాలి. తేలికపాటి టోనర్ ను అప్లై చేయాలి.
లాభాలు:
 వారంలో మూడు లేదా నాలుగు సార్లు ఈ హోంమేడ్ క్లీన్సర్ ను వాడితే చర్మం మృదువుగా అలాగే కోమలంగా మారుతుంది.
6. పాలతో అలోవెరా జెల్:
ఎలా వాడాలి:
- రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ లో ఒక టీస్పూన్ పచ్చిపాలను కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.

 - ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకుని చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

- గోరువెచ్చటి నీటితో రిన్స్ చేసుకోవాలి.
లాభాలు:
ఈ ఆల్ నేచురల్ క్లీన్సర్ ని వాడి చర్మంపై దుమ్మును తొలగించుకుని మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండి.

7. గ్రీన్ టీ తో అలోవెరా జెల్:

 ఎలా వాడాలి:
- రెండు టీస్పూన్ల తీపిలేని గ్రీన్ టీ ను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను కలపాలి.

- ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి.

- గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి.

 - చర్మంపై తడిని తుడుచుకుని తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
లాభాలు:
ఈ స్కిన్ నరిషింగ్ క్లీన్సర్ అనేది చర్మంపై ఇంప్యూరిటీస్ ను తొలగించి బ్రేక్ అవుట్స్ సమస్యను నివారిస్తుంది.





Comments